EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr88dd0cc6-8480-4329-b7bc-896309fab13d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr88dd0cc6-8480-4329-b7bc-896309fab13d-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇప్పుడు పంటలు బాగా పండుతున్నాయి. సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రత్యేకించి వరి విషయంలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించింది. గత ఏడాది దేశం మొత్తం ఎఫ్సీఐ సేకరించిన ధాన్యంలో సగం తెలంగాణ నుంచేనని ఆ సంస్థ ప్రకటించడం విశేషం. అయితే పంటలు పండించడమే కాదు.. వాటికి విలువ జోడించడం కూడా అవసరమే. అలా విలువ జోడించకపోతే.. ఆర్థిక వ్యవస్థకు ఈ ప్రగతి పెద్దగా ఉపయోగపడదు. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ సర్కారు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై దృష్టి సారించింది. తాజాగా తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి తెలంగాణ కేబినెkcr{#}pragathi;Cabinet;Government;Telanganaకేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం.. ఇక ఆ రంగం దూసుకుపోతుందా..?కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం.. ఇక ఆ రంగం దూసుకుపోతుందా..?kcr{#}pragathi;Cabinet;Government;TelanganaThu, 15 Jul 2021 07:00:00 GMTతెలంగాణలో ఇప్పుడు పంటలు బాగా పండుతున్నాయి. సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రత్యేకించి వరి విషయంలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించింది. గత ఏడాది దేశం మొత్తం ఎఫ్సీఐ సేకరించిన ధాన్యంలో సగం తెలంగాణ నుంచేనని ఆ సంస్థ ప్రకటించడం విశేషం. అయితే పంటలు పండించడమే కాదు.. వాటికి విలువ జోడించడం కూడా అవసరమే. అలా విలువ జోడించకపోతే.. ఆర్థిక వ్యవస్థకు ఈ ప్రగతి పెద్దగా ఉపయోగపడదు.


ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ సర్కారు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై దృష్టి సారించింది. తాజాగా తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పాలసీ వివరాలు ఏంటంటే.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్దఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిదశలో కనీసం 10 ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2024-25 వరకు వెయ్యి ఎకరాల వరకు జోన్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకుంది తెలంగాణ.


తెలంగాణ రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లో జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఔత్సాహికులకు ప్రోత్సాహకాలు అందించాలని తెలంగాణ  కేబినెట్‌ నిర్ణయించింది. ఈ జోన్లలో సౌకర్యాలు కల్పించి అర్హులకు భూమి ఇవ్వాలని తెలంగాణ ఆదేశించింది. మొత్తం మీద ఈ రంగంలో సుమారు రూ.25 వేల కోట్ల పెట్టుబడి ఆకర్షించాలని నిర్ణయించింది. దీని ద్వారా 70 వేల మందికి ప్రత్యక్షంగా , మరో 3 లక్షల మందికి పరోక్ష ఉపాధి కల్పన జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో కూడిన యూనిట్లకు ఈ ప్రోత్సాహకాలు అందుతాయి. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేకంగా షెడ్లు నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. సాగు రంగంలో కూడా  సాంకేతికత పెంచే దిశగా జోన్ విధానం అమలు చేయబోతున్నారు. వివిధ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. జోన్ల చుట్టూ 500 మీటర్ల వరకు బఫర్ జోన్‌గా గుర్తిస్తారు. ఈ బఫర్‌ జోన్‌లో జనావాసాలు, నిర్మాణాలు అనుమతించవద్దని కేబినెట్ నిర్ణయించింది.





పాలిటిక్స్‌లో చీలిపోతున్న కుటుంబాలు

రేవంత్ ఎఫెక్ట్ : కాంగ్రెస్ లోకి టిఆర్ఎస్ మాజీ మంత్రి ?

సింగరేణిపై సితక్క కన్ను

తెలంగాణ బీజేపీకీ కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా...?

హైదరాబాద్‌లో మరో హైటెక్‌ సిటీ రాబోతోంది..ఎక్కడో తెలుసా..?

మోదీ చెప్పినా డోంట్ కేర్ అంటున్న యోగి..

50 వేల ఉద్యోగాల భర్తీపై తెలంగాణ కేబినెట్ కీలక ప్రకటన ?

అగ్రవర్ణ పేదలకు వైసీపీ గుడ్ న్యూస్

ఏపీలో వ్యాపార వర్గాలకు బిగ్ షాక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>