PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/modif9163ca6-d6ef-451a-bd78-e67979d42236-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/modif9163ca6-d6ef-451a-bd78-e67979d42236-415x250-IndiaHerald.jpgకరోనా మూడో వేవ్ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది కేంద్రం. అన్ లాక్ అమలులోకి వచ్చాక వివిధ పర్యాటక ప్రాంతాలకు ప్రజలు పోటెత్తడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా తప్పుబట్టారు. ఆందోళన కలిగించే అంశంగా దాన్ని అభివర్ణించారు. అయితే ఇదే సమయంలో యూపీ సీఎం యోగి మాత్రం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 'కాంవడ్' యాత్రకు అనుమతిచ్చి కలకలం రేపారు. modi{#}Ganga;Shiva;Ganges;Narendra Modi;Prime Minister;lord siva;Yatra;Uttarakhand;Coronavirus;CM;Governmentమోదీ చెప్పినా డోంట్ కేర్ అంటున్న యోగి..మోదీ చెప్పినా డోంట్ కేర్ అంటున్న యోగి..modi{#}Ganga;Shiva;Ganges;Narendra Modi;Prime Minister;lord siva;Yatra;Uttarakhand;Coronavirus;CM;GovernmentThu, 15 Jul 2021 07:54:28 GMTకరోనా మూడో వేవ్ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది కేంద్రం. అన్ లాక్ అమలులోకి వచ్చాక వివిధ పర్యాటక ప్రాంతాలకు ప్రజలు పోటెత్తడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా తప్పుబట్టారు. ఆందోళన కలిగించే అంశంగా దాన్ని అభివర్ణించారు. అయితే ఇదే సమయంలో యూపీ సీఎం యోగి మాత్రం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 'కాంవడ్' యాత్రకు అనుమతిచ్చి కలకలం రేపారు.

ఏంటీ కాంవడ్ యాత్ర..?
ప్రతి ఏటా శ్రావణ మాసంలో 15రోజులపాటు శివ భక్తులు గంగా నదీ జలాలను సేకరించడం కాంవడ్ యాత్ర ముఖ్య ఉద్దేశం. అసలే గంగా నదిలో శవాలు తేలి.. నదీ జలాలు కలుషితమయ్యాయనే ఆరోపణలున్నాయి. మరోవైపు శివభక్తులు గుంపులు గుంపులుగా కాంవడ్ యాత్రకు బయలుదేరి వెళ్తే, కరోనా ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా యూపీ ప్రభుత్వం యాత్రకు అనుమతినివ్వడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సుప్రీంకోర్టు కూడా యూపీ ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. కరోనా కష్టకాలంలో యాత్రకు ఎందుకు అనుమతిచ్చారో చెప్పాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

మరోవైపు ఉత్తరాఖండ్ లోనూ ఇలాంటి సంప్రదాయం ఉన్నా కూడా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం యాత్రకు అనుమతి ఇవ్వలేదు. ప్రజలు చనిపోవాలని దేవుడు కూడా కోరుకోరు అంటూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి వ్యాఖ్యానించారు. అయితే యూపీ మాత్రం కొవిడ్ నిబంధనలు పక్కనపెట్టి యాత్రకు అనుమతివ్వడం ఆందోళన కలిగిస్తోంది.

ఓవైపు ప్రధాని మోదీ తీర్థయాత్రలు, విహార యాత్రలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఇటు యూపీ సీఎం యోగి మాత్రం అలాంటి వాటిని లక్ష్యపెట్టట్లేదు. 'కాంవడ్' యాత్రకు అనుమతులిచ్చి కలకలం రేపారు. పరిమిత సంఖ్యలో భక్తుల్ని మాత్రమే అనుమతిస్తామని, కొవిడ్ నిబంధనలు పాటిస్తామని ఆయన చెబుతున్నారు. యాత్రికులు తమ వెంట ఆర్టీపీసీఆర్ పరీక్షల రిపోర్ట్ లు కూడా తెచ్చుకోవాలని అంటున్నారు. అయితే వీటితో కరోనా కట్టడి పూర్తిగా సాధ్యమవుతుందా అనేది అనుమానమే. యూపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. సుప్రీంకోర్టు అభ్యంతరాల నేపథ్యంలో ఈనెల 25నుంచి మొదలు కావాల్సిన ఈ యాత్ర జరుగుతుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి.  



పీలేరులో భూదందా రచ్చ!

సింగరేణిపై సితక్క కన్ను

హైదరాబాద్‌లో మరో హైటెక్‌ సిటీ రాబోతోంది..ఎక్కడో తెలుసా..?

పార్టీ ఎంపీలకు జగన్ ఏం చెప్తారో..?

మొద్దు అబ్బాయ్ హీరో పాత్ర.. అదో పెద్ద సాహసం.. నేషనల్ అవార్డు తెచ్చింది..!

50 వేల ఉద్యోగాల భర్తీపై తెలంగాణ కేబినెట్ కీలక ప్రకటన ?

అగ్రవర్ణ పేదలకు వైసీపీ గుడ్ న్యూస్

ఏపీలో వ్యాపార వర్గాలకు బిగ్ షాక్..

కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం.. ఇక ఆ రంగం దూసుకుపోతుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>