PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan2353bd8a-9891-4659-b9e2-6cfa988105a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan2353bd8a-9891-4659-b9e2-6cfa988105a4-415x250-IndiaHerald.jpgమరి పవన్ ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు. ఆయన రాజకీయ ఆలోచనలు ఎందుకిలా మారుతున్నాయి అన్నది ఒక చర్చగా ఉంది. పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లర్. ఆయన రాజకీయంగా యువకుడి కిందలే లెక్క పైగా ఆయన ఫ్రెష్ లుక్ కూడా ఒక అడ్వాంటేజ్. ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. ఇక ఏపీలో చూస్తే వైసీపీ అధికారంలో ఉంది. టీడీపీ సరైన రాజకీయ పాత్ర పోషించలేక సతమతమవుతోంది. నిజంగా పవన్ కి ఇది గోల్డెన్ చాన్స్. పవన్ కనుక ఉపయోగించుకుంటే మాత్రం జనసేన జనంలో కచ్చితంగా ఉంటుంది. ఒక పవర్ ఫుల్ ఫోర్స్ గా ఏపీ రాజకీయాల్లో ఎస్టాబ్లిష్ అవుతుంది.PawanKalyan{#}Tirupati;Mangalagiri;Janasena;Josh;Bharatiya Janata Party;YCP;kalyan;Cinema;TDP;Andhra Pradesh;Coronavirusపవన్ పాలి ' ట్రిక్స్‌ ' తో జుట్టు పీక్కుంటోన్న జ‌న సైనికులు ?పవన్ పాలి ' ట్రిక్స్‌ ' తో జుట్టు పీక్కుంటోన్న జ‌న సైనికులు ?PawanKalyan{#}Tirupati;Mangalagiri;Janasena;Josh;Bharatiya Janata Party;YCP;kalyan;Cinema;TDP;Andhra Pradesh;CoronavirusThu, 15 Jul 2021 14:50:00 GMTపవన్ కళ్యాణ్. సినిమా నటుడు కమ్ పొలిటీషియన్. అయితే ఈ మధ్య జనసేనాని యాక్టివిటీ పెద్దగా కనిపించడంలేదు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి తరఫున ఆయన ఒకసారి ప్రచారం చేసి ఊరుకున్నారు. ఆ తరువాత పవన్ కి కరోనా వచ్చింది. అది తగ్గిన తరువాత రెండవ దశ కరోనాతో ఆయన అసలు  బయటకు రాలేకపోయారు. ఈ మధ్య మాత్రం మంగళగిరి టూర్ చేశారు. అయితే మునుపటి జోష్ కానీ పొలిటికల్ పంచులు కానీ పవన్ స్పీచ్ లో ఎక్కడా లేవు. పైగా ఆయన ఒక మాట అన్నారు. పార్టీని నడపడం చాలా కష్టమైన విషయం అని.

మరి పవన్ ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు. ఆయన రాజకీయ ఆలోచనలు ఎందుకిలా మారుతున్నాయి అన్నది ఒక చర్చగా ఉంది. పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లర్. ఆయన రాజకీయంగా యువకుడి కిందలే లెక్క  పైగా ఆయన ఫ్రెష్  లుక్ కూడా ఒక అడ్వాంటేజ్. ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. ఇక ఏపీలో చూస్తే వైసీపీ అధికారంలో ఉంది. టీడీపీ సరైన రాజకీయ పాత్ర పోషించలేక సతమతమవుతోంది. నిజంగా పవన్ కి ఇది గోల్డెన్ చాన్స్. పవన్ కనుక ఉపయోగించుకుంటే మాత్రం జనసేన జనంలో కచ్చితంగా  ఉంటుంది. ఒక పవర్ ఫుల్ ఫోర్స్ గా ఏపీ రాజకీయాల్లో ఎస్టాబ్లిష్ అవుతుంది.

కానీ పవన్ ఎందుకో ఆ దిశగా అడుగులు వేయడంలేదు అంటున్నారు. పవన్ సినిమాలకే టైమ్ కేటాయిస్తున్నారు. పవన్ రీ ఎంట్రీ తరువాత చాలా సినిమాలు ఒప్పుకున్నారు. నిజానికి అవన్నీ పూర్తి చేసుకుని 2022 నాటికి ఖాళీ అవాలని పవన్ ప్లాన్స్ చేశారు. కానీ చూడబోతే ఆ సినిమాలే ఇపుడు పవన్ కి అతి పెద్ద సంకెళ్ళుగా మారాయి అన్న చర్చ ఉంది. కరోనా రెండు దశలుగా వచ్చిపడిపోయి సినిమా షూటింగులను ఏడాదిన్నర పాటు ఆపేసింది. ఇపుడు మూడవ దశ అంటున్నారు.

పవన్ తాను సినిమాల్లో సంపాదించి దాన్ని రాజకీయాలకు ఖర్చు చేయాలని అనుకున్నారు. అలా 2024 ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన భావించారు. కానీ సీన్ చూస్తే వేరుగా ఉంది. కమిట్ అయిన సినిమాలు చేయక తప్పదు. అదే సమయంలో ఉత్త చేతులతో రాజకీయాల్లోకి వస్తే  కోట్లలో ఖర్చు పెట్టాలి. ఈ రకమైన సందిగ్దతతో పవన్ ఉన్నారని అంటున్నారు. మరి పవన్ భవిష్యత్తు అడుగులు ఎలా ఉంటాయా అన్నది జనసైనికులకే అర్ధం కావడం లేదుట.





ఆ సినిమా పై గంపెడు ఆశలు పెట్టుకున్న సునీల్.. ఇది కూడా పోతే ?

నితిన్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

జూ.ఎన్టీఆర్ స్లోగన్స్ వెనుక పెద్ద వ్యూహం..?

లోకేష్ కి సైలెంట్ గా దెబ్బేస్తున్న జూనియర్... ?

భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత‌మందికి కొవిడ్ టీకా వేశారో తెలుసా..?

నిరుద్యోగుల‌కు నారా లోకేష్ పిలుపు..క‌లిసిపోరాడుదాం.. !

పాత్ర కోసం మహేష్ బాబు హీరోయిన్ ఎన్ని కేజీల బరువు పెరిగిందో తెలుసా ?

జులై 15: చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందంటే..?

హార్ట్ ను ఫాలో అవుతూ స‌క్సెస్ చూడాల‌న్న సినిమా.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>