MoviesPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnab99e66bc-8517-43d4-98d4-f0aa19a17b15-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnab99e66bc-8517-43d4-98d4-f0aa19a17b15-415x250-IndiaHerald.jpgమా ఎన్నికలు... ప్రస్తుతం హాట్ హాట్ గా జరుగుతున్నాయి. ఓ వైపు కరోనా కారణంగా సినీ పరిశ్రమ కుదేలైనప్పటికీ,... సినీ పాలిటిక్స్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మా ఎన్నికలకు ఇంకా 3 నెలలు సమయం ఉన్నా కూడా... ఇప్పటి నుంచే అభ్యర్థుల ప్రకటన, ప్రెస్ మీట్లు, ప్యానల్ పరేడ్, హామీలు, విమర్శలు కూడా. పట్టుమని వెయ్యి ఓట్లు కూడా లేని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మాత్రం దేశ రాజకీయాలకు ఉన్నంత ప్రాధాన్యత సంతరించుకుంది. Balakrishna{#}Yuvaratna;Ram Gopal Varma;raj;movie artist association;manchu vishnu;American Samoa;Balakrishna;Darsakudu;Director;Coronavirus;Film Industry;local language;Chiranjeevi;Press;Telangana;Teluguమా ఎన్నికల్లో బాలయ్య ఎటువైపు..?మా ఎన్నికల్లో బాలయ్య ఎటువైపు..?Balakrishna{#}Yuvaratna;Ram Gopal Varma;raj;movie artist association;manchu vishnu;American Samoa;Balakrishna;Darsakudu;Director;Coronavirus;Film Industry;local language;Chiranjeevi;Press;Telangana;TeluguThu, 15 Jul 2021 20:01:00 GMTమా ఎన్నికలు... ప్రస్తుతం హాట్ హాట్ గా జరుగుతున్నాయి. ఓ వైపు కరోనా కారణంగా సినీ పరిశ్రమ కుదేలైనప్పటికీ,... సినీ పాలిటిక్స్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మా ఎన్నికలకు ఇంకా 3 నెలలు సమయం ఉన్నా కూడా... ఇప్పటి నుంచే అభ్యర్థుల ప్రకటన, ప్రెస్ మీట్లు, ప్యానల్ పరేడ్, హామీలు, విమర్శలు కూడా. పట్టుమని వెయ్యి ఓట్లు కూడా లేని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మాత్రం దేశ రాజకీయాలకు ఉన్నంత ప్రాధాన్యత సంతరించుకుంది.

మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ముందుగా ప్రకటించింది మంచు విష్ణు. ఆ తర్వాత ప్రకాశ్ రాజ్. చిరంజీవి ఫ్యామిలీ సపోర్ట్ తనకే ఉందన్న ప్రకాశ్ రాజ్ పై మాత్రం నాన్ లోకల్ అనే ముద్ర వేశారు. ఎక్కడో కర్ణాటక నుంచి వ్యక్తి మా అధ్యక్ష స్ధానానికి ఎలా పోటీ చేస్తారంటూ పెద్ద లా పాయింట్ లాగారు. అయితే వందల సంఖ్యలో తెలుగు సినిమాల్లో నటించి నంది అవార్డులు కూడా పొందిన ప్రకాశ్ రాజ్ కు సినీ ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలతో పాటు రామ్ గోపాల్ వర్మ లాంటి వివాదాస్పద దర్శకుడు కూడా మద్దతుగా నిలిచాడు.
 
ఇప్పుడు తాజాగా ప్రకాశ్ రాజ్ కు యువరత్న నందమూరి బాలకృష్ణ కూడా మద్దతు నిలిచినట్లే అనిపిస్తోంది. మా ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనేది పట్టించుకోనంటూ బాలయ్య కామెంట్ చేశారు. అయితే మా బిల్డింగ్ మాత్రం ఎందుకు కట్టలేకపోయారని సూటిగా ప్రశ్నించారు. గ్లామర్ ఇండస్ట్రీగా ఉన్న సినీ పరిశ్రమలో సమస్యలను బహిరంగంగా చర్చించుకోవడం సరికాదంటూ బాలయ్య చురకలంటించారు. తెలంగాణ ప్రభుత్వంతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కొంతమంది పెద్దలపై కూడా ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వాన్నిఅడిగి మా బిల్డింగ్ కోసం ఒక ఎకరం భూమి కూడా సాధించలేరా అని బాలయ్య ప్రశ్నించారు.

మా బిల్డింగ్ కోసం ఎలాంటి ఫండ్స్ రైజ్ చేయాల్సిన అవసరం లేదని... మొత్తం నిర్మాణ ఖర్చు తానే భరిస్తా అంటూ ముందుకు వచ్చిన మంచు విష్ణును బాలయ్య మెచ్చుకున్నారు. మంచు విష్ణు ముందుకు వస్తే... తాను కూడా భాగస్వామిని అవుతా అన్న బాలకృష్ణ... అందరం కలిస్తే ఇంద్రభవనం నిర్మించొచ్చు అన్నారు.. అసలు ఫండ్స్ కోసం ఫస్ట్ క్లాస్ లో అమెరికా అంతా తిరిగారు కదా... ఆ డబ్బంతా ఏం చేశారని నందమూరు బాలకృష్ణ సూటిగా ప్రశ్నించారు. లోకల్, నాన్ లోకల్ వివాదం మాత్రం పట్టించుకోనవసరం లేదన్నాడు బాలయ్య. ఏమైనా బాలయ్య స్టైలే వేరు.





బాలీవుడ్ సూపర్ స్టార్ లు ఒకే సినిమాలో కలిస్తే ?

మొద్దు అబ్బాయ్ హీరో పాత్ర.. అదో పెద్ద సాహసం.. నేషనల్ అవార్డు తెచ్చింది..!

బిజినెస్ : లక్షల్లో ఉద్యోగం వదిలి.. కోళ్ల వ్యాపారం..

రామ్ చరణ్ - శంకర్ సినిమా ఆస్కార్ లెవల్ లో ఉంటుందట...

కోకాాపేటలో రికార్డు ధర

నేను కోటిశ్వరున్ని... ఇప్పుడంటే ఇప్పుడే కోట్లు రాలుతాయి?

స్టార్ విలన్స్ కానీ వీరి భార్యలు మాత్రం టాప్ హీరోయిన్స్..!

స్టార్ హీరోలు మోజు పడుతున్నారు..!

పోస్టర్ వచ్చింది.. బిజినెస్ బ్లాస్ట్ అయ్యింది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>