Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/maske2a9dc58-4eba-40ad-88c2-bb6c1eb5f661-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/maske2a9dc58-4eba-40ad-88c2-bb6c1eb5f661-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎంతలా ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీ రేంజ్ లో కేసులు పెరిగిపోవడంతో ఏపీ వాసులు అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చింది దాదాపు 18 గంటల పాటు కఠినమైన కర్ఫ్యూ విధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు కర్ఫ్యూను ఎంతో కట్టుదిట్టంగా అమలు చేసింది దీంతో ఇక కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింMask{#}Coronavirus;Government;Andhra Pradeshకస్టమర్లు మాస్క్ పెట్టుకోకపోతే.. యజమానికి జరిమానా?కస్టమర్లు మాస్క్ పెట్టుకోకపోతే.. యజమానికి జరిమానా?Mask{#}Coronavirus;Government;Andhra PradeshThu, 15 Jul 2021 10:10:00 GMTమొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎంతలా ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీ రేంజ్ లో కేసులు పెరిగిపోవడంతో ఏపీ వాసులు అందరూ  ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి  ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చింది  దాదాపు 18 గంటల పాటు కఠినమైన కర్ఫ్యూ  విధిస్తూ  ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  అంతేకాదు కర్ఫ్యూను ఎంతో కట్టుదిట్టంగా అమలు చేసింది  దీంతో ఇక కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది.


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త అదుపులోకి వస్తుంది. ఇలాంటి సమయంలో థర్డ్ వేవ్ కూడా ముంచుకు వస్తుంది అని అటు నిపుణులు హెచ్చరిస్తున్నారు.  అయితే నిపుణుల హెచ్చరికలతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చేందుకు సిద్ధమైంది.  ప్రస్తుతం సెకండ్ వేవ్ కరోనా కేసులు తగ్గుతున్న సమయంలోనే కుథర్డ్ వేవ్ కి సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. ఇక ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి అనే నిబంధన కొనసాగిస్తోంది.



 ఇటీవలే మాస్కు వినియోగంపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులు లేకుండా వాణిజ్య సముదాయాలు దుకాణాల్లో కి కస్టమర్లను అస్సలు అనుమతించ వద్దు అంటూ ఆదేశించింది. ఒకవేళ ఇలా దుకాణ సముదాయాలు వాణిజ్య సముదాయాల్లో కస్టమర్లు మాస్కులు లేకుండా కనిపిస్తే యజమానులకు జరిమానా పడుతుంది అంటూ హెచ్చరించింది. ఏకంగా పది వేల రూపాయల నుంచి 25 వేల జరిమానా విధించాలని ఇటీవలే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక అవసరం అయితే ఏకంగా రెండు రోజులపాటు ఇక దుకాణాలు వాణిజ్య సముదాయాలను మూసివేసేందుకు కూడా నిర్ణయం తీసుకోవాలి అని సూచించింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించింది ఏపీ ప్రభుత్వం.



నేడు వారణాసికి ప్రధాని.. కారణం ఇదే.. !

చిరంజీవి చేసిన బెస్ట్ మోటివేషనల్ సినిమా ఇదే..!

ఆంధ్రజ్యోతికి.. బాబు ఎంత భూమి చౌకగా ఇచ్చారో బయటపెట్టిన సాక్షి..!

మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్..సామాన్యుడికి చుక్కలే !

బ్రేకింగ్ : టీమ్ ఇండియా క్రికెటర్ కు కరోనా.. !

మాట నిలబెట్టుకోలేకపోతున్న జగన్.. మరో అవమానం..!

ఆ నిర్ణయంతో.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌కు మరో బూమ్..?

పీలేరులో భూదందా రచ్చ!

సింగరేణిపై సితక్క కన్ను



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>