SmaranaDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/smarana-mitaee-vayapama-nunchi-haysa-natudiga-gruthimpu129775d8-f008-4152-bda8-7d49490720ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/smarana-mitaee-vayapama-nunchi-haysa-natudiga-gruthimpu129775d8-f008-4152-bda8-7d49490720ae-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఎంతో మంది నటులు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ, ఆ తరువాత నటన మీద ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేసి ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు కూడా ఒకరు. ఈయన రాజేంద్రప్రసాద్ , బ్రహ్మానందంలతో కలిసి ఎన్నో కామెడీ సీన్లతో నటించి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ముఖ్యంగా టీవీలో వచ్చిన అమృతం సీరియల్ ఇతనికి మంచి గుర్తింపు తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. ఇక గుండు హనుమంతరావు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం..GUNDU HANUMANTH RAO{#}saptagiri;sree;AdiNarayanaReddy;School;television;February;October;Gemini;rajendra prasad;Film Industry;Comedy;TDP;Darsakudu;Directorస్మరణ: మిఠాయి వ్యాపారం నుంచి హాస్య నటుడిగా గుర్తింపు..స్మరణ: మిఠాయి వ్యాపారం నుంచి హాస్య నటుడిగా గుర్తింపు..GUNDU HANUMANTH RAO{#}saptagiri;sree;AdiNarayanaReddy;School;television;February;October;Gemini;rajendra prasad;Film Industry;Comedy;TDP;Darsakudu;DirectorWed, 14 Jul 2021 07:58:51 GMTసాధారణంగా సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఎంతో మంది నటులు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ, ఆ తరువాత నటన మీద ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేసి ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు కూడా ఒకరు. ఈయన రాజేంద్రప్రసాద్ , బ్రహ్మానందంలతో కలిసి ఎన్నో కామెడీ సీన్లతో నటించి,  ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ముఖ్యంగా టీవీలో వచ్చిన అమృతం సీరియల్ ఇతనికి మంచి గుర్తింపు తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. ఇక  గుండు హనుమంతరావు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం..


గుండు హనుమంతరావు 1956 సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన జన్మించారు. ఇక  ఈయన సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు మిఠాయి వ్యాపారంలో పని చేసేవాడు. మొదట 1987వ సంవత్సరంలో దర్శకుడు జంధ్యాల దర్శకత్వం వహించిన,  ఆహ నా పెళ్ళంట సినిమాలో కనిపించి, ప్రేక్షకులకు తన హాస్యంతో బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాలలో కామెడీ పాత్రలలో నటించి, ప్రేక్షక ఆదరణ పొందాడు.. ఇక ఆయన నటించిన మాయలోడు, శ్రీవారికి ప్రేమలేఖ, రాజేంద్రుడు-గజేంద్రుడు, యమలీల ,పెళ్ళానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ, కేడి నంబర్ వన్ ,అప్పారావు డ్రైవింగ్ స్కూల్ , బాడీగార్డ్, పంచముఖి, శ్రీ సాయి సంకల్పం వంటి ఎన్నో చిత్రాలలో నటించి, మంచి గుర్తింపు పొందిన ఈయన , జెమిని టీవీలో ప్రసారమైన అమృతం సీరియల్ లో నటించి ప్రేక్షకుల మదిలో చిరకాలం స్థానం సంపాదించుకున్నారు.


ఇక అంతే కాదు జెమినీ టీవీ , ఈటీవీ, మాటీవీ ,డిడి సప్తగిరి వంటి  ప్రముఖ ఛానల్ లలో కూడా సీరియల్స్ లో నటించారు. ఇక ఈయన నటించిన ఆది తాళం సీరియల్ కు నంది అవార్డు , అమృతం అలాగే శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం వంటి ధారావాహికలు కూడా నంది అవార్డులు అందుకోవడం విశేషం. ఇక దాదాపు 600 చిత్రాలకు పైగా నటించి, మంచి గుర్తింపు పొందాడు. ఇక టీడీపీ తరపున కూడా ప్రచారం నిర్వహించారు. ఇక చివరిగా చాలాకాలంపాటు మూత్రపిండాల వ్యాధికి గురై  హైదరాబాదులో 2018 ఫిబ్రవరి 19వ తేదీన మరణించారు.



నేడు టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క క‌మిటీతో కేటీఆర్ మీటింగ్‌

ఆ జిల్లా టీడీపీలో 'ఒక్క మగాడు'!

సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తున్న పాన్ ఇండియా డైరెక్టర్!

రవితేజా నిర్ణయంతో షాక్ లో నందమూరి ఫ్యామిలీ !

మీరెంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా అయితే ఇలా చేయండి ?

టిడిపి అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే?

కేసీఆర్‌తో చంద్రబాబు అవగాహనకు వచ్చారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీకి ఛాన్స్ ఇవ్వని బాషా...

షాకింగ్: వైసీపీ కంచుకోటలో టీడీపీకి ఛాన్స్ దొరికిందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>