PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-ex-mla-updates-in-ycpdd0ad6db-235c-4e7f-86ca-717420688f25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-ex-mla-updates-in-ycpdd0ad6db-235c-4e7f-86ca-717420688f25-415x250-IndiaHerald.jpgఈ క్ర‌మంలో ఎంపీగా విజ‌యంద‌క్కించుకున్నారు. అదేస‌మ‌యంలో రాజ‌కీయంగా టీడీపీ నేత‌లు.. కేఈ కుటుంబంతో ఢీ అంటే ఢీ అనేలా వ్య‌వ‌హ‌రించారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న‌త ర్వాత కాంగ్రెస్ పూర్తిగా దెబ్బ‌తిన‌డంతో కోట్ల కుటుంబం సైలెంట్ అయిపోయింది ఇక‌, దాదాపు నాలుగేళ్ల‌పాటు మౌనంగా ఉన్న ఈ కుటుంబం గత ఎన్నిక‌ల‌కుముందు .. టీడీపీ తీర్థం పుచ్చుకుంది. వాస్త‌వానికి ఈ కుటుంబానికి వైసీపీ నుంచి ఆహ్వానం అందింది. అయిన‌ప్ప‌టికీ.. వీరు ఆ పార్టీవైపు చూడ‌కుండా.. టీడీపీ తీర్థం పుచ్చుకుని ద‌శాబ్దాలుగా వివాదాలు ఉన్న కేఈ కుటుంబంతో TDP{#}Dookudu;Alur;surya sivakumar;MP;Congress;Father;local language;CM;TDP;YCPఆ కుటుంబం టీడీపీలో ఉందా లేదా ? అస‌లు రాజ‌కీయాలే వ‌దిలేశారా ?ఆ కుటుంబం టీడీపీలో ఉందా లేదా ? అస‌లు రాజ‌కీయాలే వ‌దిలేశారా ?TDP{#}Dookudu;Alur;surya sivakumar;MP;Congress;Father;local language;CM;TDP;YCPWed, 14 Jul 2021 15:20:00 GMTక‌ర్నూలు జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం.. కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి, సుజాత‌మ్మలు.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు?  ఏం చేస్తున్నారు? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం వారు లైవ్‌లో లేక‌పోవ‌డం.. అయినా.. ఉన్న‌ట్టుగా వారి అనుచ‌రులు ప్ర‌చారం చేయ‌డం.. వంటివి ఒకింత విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. స‌దీర్ఘ‌రాజ‌కీయ అనుభ‌వం ఉన్న కోట్ల ఫ్యామిలీ.. కాంగ్రెస్‌లో ఉండ‌గా.. కోట్ల విజ‌య‌భాస్క‌ర‌రెడ్డి సీఎం స‌హా అనేక ప‌ద‌వులు అలంక‌రించారు. ఆయ‌న వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి.. తండ్రి రేంజ్‌లో రాజ‌కీయం చేయ‌క‌పోయినా.. త‌న‌కంటూ.. ప్రత్యేక‌త‌ను చాటుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ క్ర‌మంలో ఎంపీగా విజ‌యంద‌క్కించుకున్నారు. అదేస‌మ‌యంలో రాజ‌కీయంగా టీడీపీ నేత‌లు.. కేఈ కుటుంబంతో ఢీ అంటే ఢీ అనేలా వ్య‌వ‌హ‌రించారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న‌త ర్వాత కాంగ్రెస్ పూర్తిగా దెబ్బ‌తిన‌డంతో కోట్ల కుటుంబం సైలెంట్ అయిపోయింది ఇక‌, దాదాపు నాలుగేళ్ల‌పాటు మౌనంగా ఉన్న ఈ కుటుంబం గత ఎన్నిక‌ల‌కుముందు .. టీడీపీ తీర్థం పుచ్చుకుంది. వాస్త‌వానికి ఈ కుటుంబానికి వైసీపీ నుంచి ఆహ్వానం అందింది. అయిన‌ప్ప‌టికీ.. వీరు ఆ పార్టీవైపు చూడ‌కుండా.. టీడీపీ తీర్థం పుచ్చుకుని ద‌శాబ్దాలుగా వివాదాలు ఉన్న కేఈ కుటుంబంతో రాజీ చేసుకున్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో ఆలూరు నుంచి పోటీ చేసిన సుజాత‌మ్మ‌, క‌ర్నూలు ఎంపీగా పోటీ చేసిన‌, సూర్య ప్ర‌కాశ్‌రెడ్డి లు ఇద్ద‌రూ ఓడిపోయారు.

ఇక‌, అప్ప‌టి నుంచి వీరిద్ద‌రూ రాజ‌కీయంగా సైలెంట్ అయ్యారు. కానీ, ఇటీవ‌ల స్థానిక స‌మ‌రంలో .. సుజాత‌మ్మ వ‌ర్గం.. ఒకింత దూకుడు ప్ర‌ద‌ర్శించింది. అయినా ఆత‌ర్వాత మ‌ళ్లీ సైలెంట్ అయిపోయింది. ఇదిలావుంటే.. ఇప్పుడు.. కోట్ల కుటుంబానికి ఎస‌రు పెడుతూ.. కేఈ కుటుంబం వ్యూహాత్మ‌కంగా ముందుకు వ‌స్తోంది. కేఈ సోద‌రుడు ప్ర‌తాప్‌.. ఇటీవ‌ల మ‌ళ్లీ పుంజుకున్నారు. త‌మ రాజ‌కీయ కోట‌లోకి ఎవ‌రినీ రానిచ్చేది లేద‌ని.. ఆయ‌న బ‌హిరంగ వ్యాఖ్య‌లే చేశారు. క‌ర్నూలు ఎంపీ స‌హా.. డోన్‌, ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ‌కు ఉన్న ఓటు బ్యాంకు ఇప్ప‌టికీ చెక్కుచెద‌ర‌లేద‌ని.. మ‌ళ్లీ పుంజుకుంటామ‌ని.. ద‌శాబ్దాల పాటు.. టీడీపీపై పోరాటం చేసిన వారికి అవ‌కాశం ఇవ్వ‌డ‌మే.. పెద్ద త‌ప్ప‌ని.. ప‌రోక్షంగా ఆయ‌న చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

అయితే.. ఇది జ‌రిగి కూడా నెల అవుతోంది. అయితే.. కేఈ ప్ర‌తాప్ కామెంట్ల‌పై కోట్ల కుటుంబం ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. పైగా.. తాము టీడీపీలో ఉన్నామో.. లేమో.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. గ‌తంలో ఇంటి ముందు.. కాంగ్రెస్ జెండా ఎగుర‌వేసిన కుటుంబం.. త‌ర్వాత టీడీపీ జెండా క‌ట్టుకున్నారు. కానీ, ఇటీవ‌ల దీనిని తొల‌గించారు. మొత్తంగా చూస్తే.. కోట్ల కుటుంబం ఏ పార్టీలో ఉన్నారో.. అస‌లు రాజ‌కీయాల్లో ఉన్నారో .. లేదో కూడా తెలియ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, టీడీపీని కాదంటే.. కాంగ్రెస్‌లోకి లేదా బీజేపీలోకి వెళ్లాలి త‌ప్ప‌.. వైసీపీలోకి మాత్రం అవ‌కాశం లేద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.





నేను తనని అనలేదు.. అంటూ వీడియో విడుదల చేసిన పృథ్వి రాజ్ !

కోర్టుతో మైండ్‌గేమ్ ఆడుతోన్న సీబీఐ?

తెలుగు భాష‌పై వారిది ముస‌లిక‌న్నీరు... ? - ఏపీ మంత్రి

నాగార్జునకి అర్జెంటుగా హిట్టు స్టోరీ కావాలి..!

తండ్రి రాజ‌కీయంతో న‌లిగిపోతున్న త‌న‌యుడు..!

మోడీవి మాటలే.. చేతల్లేవ్ : రాహుల్

ఆ ఏపీ మంత్రి సైలెంట్ అయినా.. మంచి మార్కులే...!

ముగ్గురు నేత‌లు మూడు పార్టీలు... ఒకే కుటుంబం ?

బిగ్ బ్రేకింగ్: జగన్ కు మోడీ అపాయింట్మెంట్...? ఎల్లుండే ఢిల్లీకి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>