PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp-bjp00011ef2-2c61-438e-a55c-634276ad2ad1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp-bjp00011ef2-2c61-438e-a55c-634276ad2ad1-415x250-IndiaHerald.jpgటీజీ వెంక‌టేశ్ కు రాజ‌కీయాలుకొత్త‌కాదు. మొద‌ట్లో టీడీపీలో ఉన్నఆయ‌న ఎక్క‌డ అవ‌కాశం చిక్కితే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తార‌నే పేరు తెచ్చుకున్నారు. ఇలానే ఆయ‌న గ‌తంలో కాంగ్రెస్‌లోకి చేరిపోయి.. మంత్రిప ద‌వి కూడా ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న‌తో మ‌ళ్లీ టీడీపీలోకి వ‌చ్చి ప‌ద‌వులు పొందారు. ఈ క్ర‌మంలోనే త‌న కుమారుడు టీజీ భ‌ర‌త్‌ను కూడా రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే గ‌త 2019 ఎన్నిక‌ల్లో భ‌ర‌త్‌కు టీడీపీ త‌ర‌ఫున అసెంబ్లీ టికెట్ కూడా ఇప్పించుకున్నారు. అయితే.. ఆయ‌న ఓడిపోయారు. ప్ర‌TDP BJP{#}Assembly;Hanu Raghavapudi;Father;politics;TDP;Bharatiya Janata Party;YCPతండ్రి రాజ‌కీయంతో న‌లిగిపోతున్న త‌న‌యుడు..!తండ్రి రాజ‌కీయంతో న‌లిగిపోతున్న త‌న‌యుడు..!TDP BJP{#}Assembly;Hanu Raghavapudi;Father;politics;TDP;Bharatiya Janata Party;YCPWed, 14 Jul 2021 16:57:00 GMTరాజ‌కీయాల్లో ఎక్క‌డైనా.. తండ్రి రాజ‌కీయాలు ప‌ట్టుకుని ఎదిగిన కుమారులు క‌నిపిస్తారు. తండ్రి వార‌స‌త్వంగా వ‌చ్చిన రాజ‌కీయా ల‌ను అందుకుని త‌మ ప్ర‌తిభ‌ను జోడించి పైకి వ‌చ్చే నేత‌లు కూడా ఉన్నారు. కానీ, దీనికి భిన్నంగా తండ్రి రాజ‌కీయాల‌తో న‌లిగిపోతున్న కుమారులు మాత్రం పెద్ద‌గా ఎవ‌రూ క‌నిపించ‌రు. కానీ, ఇప్పుడు ఇలాంటి ఘ‌ట‌న కూడా తెర‌మీదికి వ‌చ్చింది. క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ వెంక‌టేశ్ కుమారుడు.. టీడీ భ‌ర‌త్‌.. ఇప్పుడు రాజ‌కీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తండ్రి ఒక పార్టీలో ఉండ‌గా.. తాను ఒక పార్టీలో ఉంటూ.. రాజకీయాలు న‌డ‌ప‌లేని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు.

టీజీ వెంక‌టేశ్ కు రాజ‌కీయాలుకొత్త‌కాదు. మొద‌ట్లో టీడీపీలో ఉన్నఆయ‌న ఎక్క‌డ అవ‌కాశం చిక్కితే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తార‌నే పేరు తెచ్చుకున్నారు. ఇలానే ఆయ‌న గ‌తంలో కాంగ్రెస్‌లోకి చేరిపోయి.. మంత్రిప ద‌వి కూడా ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న‌తో మ‌ళ్లీ టీడీపీలోకి వ‌చ్చి ప‌ద‌వులు పొందారు. ఈ క్ర‌మంలోనే త‌న కుమారుడు టీజీ భ‌ర‌త్‌ను కూడా రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే గ‌త 2019 ఎన్నిక‌ల్లో భ‌ర‌త్‌కు టీడీపీ త‌ర‌ఫున అసెంబ్లీ టికెట్ కూడా ఇప్పించుకున్నారు. అయితే.. ఆయ‌న ఓడిపోయారు. ప్ర‌స్తుతం ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్‌గా కొన‌సాగుతున్నారు.

అయితే.. వెంక‌టేశ్ మాత్రం బీజేపీ తీర్థం పుచ్చుకుని రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉండ‌గానే.. ఆ పార్టీలో చేరిపోయారు. అయితే.. భ‌ర‌త్ మాత్రం టీడీపీలోనే ఉన్నారు. కానీ, తండ్రి బీజేపీలో, కుమారుడు టీడీపీలో ఉండ‌డంతో స్థానికంగా ప్ర‌జ‌లకు స‌రైన సంకేతాలు వెళ్ల‌డం లేదు. ఇద్ద‌రూ కూడా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పెద్ద ఎత్తున వైసీపీ నేత‌లు చేస్తున్న ప్ర‌చారం ప్ర‌జ‌ల్లోకి జోరుగా వెళ్తోంది. అంతేకాదు.. ప్ర‌జ‌ల‌కు కూడా ఈ ఇద్ద‌రి వైఖ‌రిపై తీవ్ర వ్య‌తిరేక‌త కూడా వ‌స్తోంది.

బీజేపీ త‌ర‌ఫున తండ్రి వాయిస్ వినిపిస్తుంటే.. భ‌ర‌త్ బ‌య‌ట‌కు వ‌చ్చి టీడీపీ త‌ర‌పున వాయిస్ వినిపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో రెండు క‌ళ్ల రాజ‌కీయాలు చేస్తున్నార‌ని.. ఈ కుటుంబాన్ని రాజ‌కీయంగా న‌మ్మ‌లేమ‌ని.. మేధావులు కూడా అబిప్రాయ‌ప‌డుతున్నారు. వెంక‌టేశ్ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. భ‌ర‌త్‌కు చాలా ఫ్యూచ‌ర్ ఉంది. ఈ నేప‌థ్యంలో తండ్రి నిర్ణ‌యంతో ఆయ‌న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.





ఈటెలపై కేటీఆర్ విమర్శలు.. ఏమన్నారో తెలుసా?

నేను తనని అనలేదు.. అంటూ వీడియో విడుదల చేసిన పృథ్వి రాజ్ !

ఎపిసోడ్ 2: మనాలి టూ లడఖ్, హిమాలయాలు ఎక్కడి నుంచి భయంకరం...?

తెలుగు భాష‌పై వారిది ముస‌లిక‌న్నీరు... ? - ఏపీ మంత్రి

తండ్రి బీజేపీలో... కొడుకు టీడీపీలో...!

ఆ ఏపీ మంత్రి సైలెంట్ అయినా.. మంచి మార్కులే...!

హుజురాబాద్ లో వెయ్యి మంది పోటీ చేస్తాం.. కేసిఆర్ కు వార్నింగ్?

ముగ్గురు నేత‌లు మూడు పార్టీలు... ఒకే కుటుంబం ?

బిగ్ బ్రేకింగ్: జగన్ కు మోడీ అపాయింట్మెంట్...? ఎల్లుండే ఢిల్లీకి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>