MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/annapoorna2fdc4ff9-f016-4dc1-817b-691d41f4a78d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/annapoorna2fdc4ff9-f016-4dc1-817b-691d41f4a78d-415x250-IndiaHerald.jpgతెలుగు సీనియర్ నటి అన్నపూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న నటి. సీనియర్ నటులకు తల్లి పాత్రల్లో ఇప్పుడు స్టార్ హీరోలకు బామ్మ పాత్రలో నటించిన ఇంకా నటిస్తున్న అన్నపూర్ణమ్మ ఎన్నో సినిమాల్లో నవ్వులు పూయించే పాత్రలు ఇంకా తల్లిగా గుండెలు పిండేసే పాత్రలు చేశారు. ఆమె ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తారు కాని నిజ జీవితంలో మాత్రం ఆమె చాలా సమస్యలు ఎదుర్కొన్నారట. ఆమె తల్లి అనే పిలుపు కోసం అమ్మాయిని చేరదీసి దత్తత తీసుకుంది. చిన్నప్పటి నుండే ఆ అమ్మాయిని అపుANNAPOORNA{#}poorna;Murder.;annapurna;Father;marriage;Teluguకూతురి సూసైడ్ గురించి స్పందించిన అన్నపూర్ణ...కూతురి సూసైడ్ గురించి స్పందించిన అన్నపూర్ణ...ANNAPOORNA{#}poorna;Murder.;annapurna;Father;marriage;TeluguWed, 14 Jul 2021 19:00:00 GMTతెలుగు సీనియర్ నటి అన్నపూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న నటి. సీనియర్ నటులకు తల్లి పాత్రల్లో ఇప్పుడు స్టార్ హీరోలకు బామ్మ పాత్రలో నటించిన ఇంకా నటిస్తున్న అన్నపూర్ణమ్మ ఎన్నో సినిమాల్లో నవ్వులు పూయించే పాత్రలు ఇంకా తల్లిగా గుండెలు పిండేసే పాత్రలు చేశారు. ఆమె ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తారు కాని నిజ జీవితంలో మాత్రం ఆమె చాలా సమస్యలు ఎదుర్కొన్నారట. ఆమె తల్లి అనే పిలుపు కోసం అమ్మాయిని చేరదీసి దత్తత తీసుకుంది. చిన్నప్పటి నుండే ఆ అమ్మాయిని అపురూపంగా పెంచుకొని అన్ని విధాలుగా కన్న కూతురుగా చూసుకుంటూ వచ్చింది. కన్న కూతురుగానే భావించి ఆమెకు మంచి జీవితాన్ని ఇచ్చింది.ఇక ఆమె కూతురికి చదువు అబ్బక పోవడంతో పెళ్లి చేసి అత్త వారింటికి పంపింది. అక్కడ ఆమె కూతురు సంతోషంగా ఉందని భావిస్తున్న తరుణంలో ఆత్మహత్య చేసుకోవడం అనేది అన్నపూర్ణ జీవితంలో కోలుకోలేని పెద్ద దెబ్బగా మిగిలింది.

ఇక అన్న పూర్ణ తన కూతురితో పాటు ఒకే అపార్ట్మెంట్ లో ఉండేవారట. కాని సడన్ గా ఏమైందో తెలీదు కాని ఆమె కూతరు తన ఇంటి బెడ్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకుందట. అసలు ఆమె కూతురు అలా ఆత్మ హత్య ఎందుకు చేసుకుందో ఇప్పటికి అన్నపూర్ణకి అర్ధం కాలేదట. పెళ్లి జరిగి ఒక కూతురు పుట్టాక కూడా ఆమె తన భర్తతో చాలా హ్యాపీగా ఉండేదట. కాని ఆమెకు ఎన్ని సమస్యలున్న ఎప్పుడు తనతో చెప్పుకోలేదని వాపోయారు అన్నపూర్ణ. అయితే మాత్రం ఆమె కూతురికి చిన్నప్పటి నుంచే చాలా కోపం ఉండేదట. బహుశా ఆ కోపం వల్ల తను ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అన్నపూర్ణ తెలిపారు. ఇక తన కూతురు బిడ్డని ఆమె చనిపోయాక తానే పెంచానని తెలిపారు. ఇక ఆ పాపకు 5 ఏళ్ళు రావడంతో వాళ్ళ నాన్న దగ్గరకి వెళ్ళిపోయిందట. ప్రస్తుతం వాళ్ళ నాన్నతో ఆ పాప చాలా హ్యాపిగానే ఉందని అన్నపూర్ణ గారు తెలిపారు.



షాకింగ్ : శుభలేఖ వల్ల పెళ్లి ఆగిపోయింది?

RAPO19 టీంకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన శంకర్....

అఖండ నుండి త్వరలో అదిరిపోయే అప్డేట్.. ?

చంద్రబాబు, లోకేష్ లపై.. లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్?

కీర్తీ సురేష్ త‌ల్లి చిరు ప‌క్క‌న హీరోయిన్ ?

ఆషాడ మాసంలో నవ దంపతులకు తప్పని తిప్పలు.. ఎందుకంటే..?

"మంచి రేట్ వచ్చినప్పుడు సినిమా అమ్ముకుంటే తప్పేంటి" : సురేష్ బాబు

తెలుగు భాష‌పై వారిది ముస‌లిక‌న్నీరు... ? - ఏపీ మంత్రి

రజినీ కాంత్ తొలి సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>