LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/bodinkalu-home9c80221e-3107-4330-b595-08e0525290bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/bodinkalu-home9c80221e-3107-4330-b595-08e0525290bc-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఈ బొద్దింకల బెడద ఎక్కువైందని, పలువురు గృహిణులు వాపోతున్నారు. ముఖ్యంగా ఈ బొద్దింకలు వివిధ రకాల బ్యాక్టీరియాలకు వాహకాలుగా మారుతాయి. ఎక్కువగా కిచెన్ లో, కబోర్డులలో, మ్యాన్ హోల్స్ లో ఇవి నివాసం ఏర్పరచుకొని, మనం తిని పడేసే ఆహారాలను ఇవి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. వేగంగా సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు, మన ఇళ్లల్లో అందరికీ అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ జబ్బుల బారిన పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఈ బొద్దింకలను మనం వీలైనంత త్వరగా వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలBODINKALU HOME{#}Rasam;garlic;Coffee;Cheque;Shakti;Manamలైఫ్ స్టైల్ : ఇలా చేస్తే ఇంట్లో బొద్దింకలు పరార్..లైఫ్ స్టైల్ : ఇలా చేస్తే ఇంట్లో బొద్దింకలు పరార్..BODINKALU HOME{#}Rasam;garlic;Coffee;Cheque;Shakti;ManamWed, 14 Jul 2021 19:00:00 GMT
ఇటీవల కాలంలో ఈ బొద్దింకల బెడద ఎక్కువైందని, పలువురు గృహిణులు వాపోతున్నారు. ముఖ్యంగా ఈ బొద్దింకలు వివిధ రకాల బ్యాక్టీరియాలకు వాహకాలుగా మారుతాయి. ఎక్కువగా కిచెన్ లో, కబోర్డులలో, మ్యాన్ హోల్స్ లో ఇవి నివాసం ఏర్పరచుకొని, మనం తిని పడేసే ఆహారాలను ఇవి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. వేగంగా సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు, మన ఇళ్లల్లో అందరికీ అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ జబ్బుల బారిన పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఈ బొద్దింకలను మనం వీలైనంత త్వరగా వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి.


ఈ బొద్దింకల నుండి మన ఇంటిని , మనల్ని మనం కాపాడుకోవాలి అంటే కొన్ని రకాల సహజ సిద్ధమైన పదార్థాలతో వీటికి చెక్ పెట్టవచ్చు. అదేమిటంటే, బొద్దింకలను నాశనం చేసే శక్తి కాఫీకి ఉంది. ఈ కాఫీ సువాసనకు బొద్దింకలు ఆకర్షింపబడతాయి. వెంటనే దానిని రుచి చూసిన వెంటనే , అందులో ఉన్న కెఫిన్ వీటిని నాశనం చేస్తుంది. కాబట్టి స్వచ్ఛమైన కాఫీ గింజలు తీసుకొచ్చి, పొడిచేసి ఎక్కడైతే బొద్దింకలు నివాసం  ఏర్పరుచుకున్నాయి అని తెలిసిందో అక్కడ ఈ కాఫీ పొడిని చల్లాలి. ఫలితంగా ఈ బొద్దింకలు నాశనమవుతాయి.


బేకింగ్ పౌడర్ లో కొద్దిగా చక్కెర కలిపి, బొద్దింకలు ఉండే ప్రాంతంలో చల్లడం వల్ల బొద్దింకలు చనిపోతాయి. చక్కెర రుచిని ఇష్టపడి తిన్న బొద్దింకలు,  ఇందులో ఉండే బేకింగ్ సోడా ను జీర్ణం చేసుకోలేక చనిపోతాయి. బొద్దింకలు పుదీన సువాసనను కూడా తట్టుకోలేవు. కాబట్టి ఇవి తిరిగే ప్రాంతాలలో పుదీనా రసం చల్లడం వల్ల ఇవి త్వరగా చనిపోతాయి. అంతే కాదు వంటింట్లో దొరికే బిర్యాని ఆకులు సువాసనను కూడా ఇవి భరించలేవు. కాబట్టి బిర్యానీ ఆకు పొడి చల్లడం వల్ల ఇవి దూరమవుతాయి. వెల్లుల్లి ,ఉల్లిపాయ రసాల సువాసనలను  కూడా బొద్దింకలు తట్టుకోలేవు. ఇక వీటిని నీటిలో ఉడికించి, ఆ రసాన్ని చల్లడం వల్ల కూడా బొద్దింకలు నాశనం అవుతాయి.





పోర్న్‌స్టార్లకు హెచ్ఐవి ఎందుకు రాదో తెలుసా..?

ఈ కాలం పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?

జబర్దస్త్ షో కి వెళ్లాలనుకునే వారు ఇలా చేస్తే సరి..

రిచర్డ్ బ్రాన్సన్ అంతరిక్ష యాత్రను ముందుగానే ఊహించిన టీవీ సిరీస్..?

కథంతా పోస్టర్లోనే... ఫ్రీ పబ్లిసిటీ !?

బిగ్ బ్రేకింగ్: జగన్ కు మోడీ అపాయింట్మెంట్...? ఎల్లుండే ఢిల్లీకి...?

మంత్రి పెద్దిరెడ్డి, రోజా ఆధిప‌త్య పోరు?

సీఎం జగన్ చేసిన పనికి బాధేసింది : రఘురామ

దోమలు ఎక్కువగా వీరినే టార్గెట్ చేస్తాయట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>