PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagandcfe8626-9288-48fc-80b4-8f1fd6bad303-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagandcfe8626-9288-48fc-80b4-8f1fd6bad303-415x250-IndiaHerald.jpgఇక విశాఖ సౌత్ లో గణేష్ సామాజికవర్గం కూదా పెద్ద ఎత్తున ఉన్నారు. దాంతో ఆయన అక్కడ గట్టి పట్టు సంపాదించారు. ఎవరు వచ్చి సాయమడిగినా కూడా చేతికి ఎముక లేకుండా తోచింది ఇస్తూ వారిని ఆదుకోవడంలో వాసుపల్లి ముందుంటారు. విశాఖ అర్బన్ టీడీపీని ఆయన తన సొంత ఖర్చుతో నడిపేవారు. ఆయన ఉన్నపుడు విశాఖ టీడీపీలో ఎన్నో కార్యక్రమాలు జరిగేవి. ఇపుడు ఆ సందడి లేదు. ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వడానికి వైసీపీ రెడీగా ఉంది. గత రెండు ఎన్నికల్లో సౌత్ లో వైసీపీ ఓడడానికి సరైన లీడర్ షిప్ లేకపోవడమే అన్న అJagan Mohan Reddy{#}GANESH KUMAR VASUPALLI;Leader;Yevaru;Vishakapatnam;District;MLA;TDP;YCPఆ జంపింగ్‌ ఎమ్మెల్యే జ‌గన్ ఆశ‌లు తీర్చేస్తారా ?ఆ జంపింగ్‌ ఎమ్మెల్యే జ‌గన్ ఆశ‌లు తీర్చేస్తారా ?Jagan Mohan Reddy{#}GANESH KUMAR VASUPALLI;Leader;Yevaru;Vishakapatnam;District;MLA;TDP;YCPWed, 14 Jul 2021 14:45:00 GMTవిశాఖ సౌత్ మీదనే ఇపుడు టీడీపీ దృష్టి పెట్టింది. ఇక్కడ నుంచి రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ గా రెండు సార్లు చేసిన  వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. మత్స్య కార సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లి డిఫెన్స్ లో పనిచేసి వచ్చారు. మంచి విద్యాధికుడు, యూత్ లో చక్కని ఫాలోయింగ్ ఉన్న నేత వాసుపల్లి.  పైగా సేవా భావం కూడా ఆయనకు మెండు. ఆయన ఎమ్మెల్యే కాక ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున వితరణ చేస్తూ జనాల్లో పేరు తెచ్చుకున్నారు. ఆ విధంగా చూస్తే వాసుపల్లికి పార్టీలతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్ ఉంది.

ఇక విశాఖ సౌత్ లో గణేష్ సామాజికవర్గం కూదా పెద్ద ఎత్తున ఉన్నారు. దాంతో ఆయన అక్కడ గట్టి పట్టు సంపాదించారు. ఎవరు వచ్చి సాయమడిగినా కూడా చేతికి ఎముక లేకుండా తోచింది ఇస్తూ వారిని ఆదుకోవడంలో వాసుపల్లి ముందుంటారు. విశాఖ అర్బన్ టీడీపీని ఆయన తన సొంత ఖర్చుతో నడిపేవారు. ఆయన ఉన్నపుడు విశాఖ టీడీపీలో ఎన్నో కార్యక్రమాలు జరిగేవి. ఇపుడు ఆ సందడి లేదు. ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వడానికి వైసీపీ రెడీగా ఉంది. గత రెండు ఎన్నికల్లో సౌత్ లో వైసీపీ ఓడడానికి సరైన లీడర్ షిప్ లేకపోవడమే అన్న అంచనాకు వచ్చిన తరువాతనే వాసుపల్లిని వైసీపీలోకి తీసుకున్నారు.

అక్కడ ఆయనకు అంతా బాగానే ఉంది కాబట్టి వెనక్కు వస్తారన్న ఆశలైతే తమ్ముళ్లకు లేవు. ఈ నేపధ్యంలో టీడీపీ కొత్త నాయకులను సౌత్ లో తయారు చేసుకోవాల్సి ఉంది. ఇక మైనారిటీ నాయకులను తెచ్చి పెట్టి ప్రయోగం చేద్దామనుకున్నా కూడా వాసుపల్లి ముందు కుదిరే వ్యవహారం కాదని తేలిపోతోంది. ఆయన స్ట్రాంగ్ లీడర్ షిప్ ముందు టీడీపీ ఈసారి పల్టీ కొట్టాల్సిందే అంటున్నారు. జ‌గ‌న్ అక్క‌డ వైసీపీ జెండా ఎగ‌ర‌వేసే ప్లాన్ లో ఆయ‌న్ను పార్టీలో చేర్చుకున్న నేప‌థ్యంలో వాసుప‌ల్లి ఆ కోరిక తీర్చేసేలా ఉన్నారు.

మొత్తం మీద చూసుకుంటే వరసగా రెండు సార్లు టీడీపీని గెలిపించిన వాసుపల్లి మొదటిసారిగా సౌత్ లో వైసీపీ జెండా ఎగరేయించే పనిలో బిజీగా ఉన్నారు. ఆయన సాటి నాయకులను రెడీ  చేయడం టీడీపీకి కష్టమైన విషయమే. ఎంతో మంది నాయకులను తయారు చేశామని చెప్పుకుంటున్న టీడీపీకి వాసుపల్లి ఇచ్చిన బిగ్ షాక్ తేరుకోకుండా చేస్తోంది.

 



బాల‌య్య ఇలాకాలో అంతుచిక్క‌ని ర‌హ‌స్యం ?

ఆ మంత్రికి జ‌గ‌న్ భారీ షాక్ త‌ప్ప‌దా...!

పార్లమెంట్ లో ఏం చేద్దాం...? జగన్ ఆలోచనలు...!

బాబు ప‌ర్య‌ట‌న వెన‌క కృష్ణా మంత్రి హ‌స్తం... !

గోదావరికి భారీ వరద...? అలెర్ట్ అయిన జగన్ సర్కార్...?

వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడికి... గవర్నమెంట్ ఆఫీసర్ షాకింగ్ ఆన్సర్...?

ఏపీలో ఆగని ఐపిఎస్ బదిలీలు... ఈ ఒక్క రోజే ఏకంగా...?

బ్రేకింగ్: వైసీపీ ఎమ్మెల్యేకి హైకోర్ట్ షాక్

వైసీపీలోకి జంప్ అయిన తెలుగు తమ్ముళ్ల పరిస్థితి ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>