PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/inter-examsfd2c8004-524e-4113-993f-b7bfcbac54b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/inter-examsfd2c8004-524e-4113-993f-b7bfcbac54b7-415x250-IndiaHerald.jpgఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డ్ షాక్ ఇస్తోంది. గతంలో పరీక్షలు క్యాన్సిల్, ఆల్ పాస్ అని చెప్పిన అధికారులు, ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి కదా పరీక్షలు రాయండి అంటూ మెలికపెడుతున్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తుది అనుమతి రాగానే విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వస్తుందని అంటున్నారు. inter exams{#}september;students;Coronavirus;Governmentఇంటర్ విద్యార్థులకు షాక్.. పరీక్షలు రాయాల్సిందే..!ఇంటర్ విద్యార్థులకు షాక్.. పరీక్షలు రాయాల్సిందే..!inter exams{#}september;students;Coronavirus;GovernmentWed, 14 Jul 2021 09:00:00 GMTఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డ్ షాక్ ఇస్తోంది. గతంలో పరీక్షలు క్యాన్సిల్, ఆల్ పాస్ అని చెప్పిన అధికారులు, ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి కదా పరీక్షలు రాయండి అంటూ మెలికపెడుతున్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తుది అనుమతి రాగానే విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వస్తుందని అంటున్నారు.

ఇప్పుడెందుకీ పరీక్షలు..?
పరీక్షలు లేకుండా రిజల్ట్ ఇవ్వడం అంటే కత్తిమీద సామే. ఆల్ పాస్ అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చేయడం వేరు, ఆ తర్వాత ఒక్కొక్కరికి విడివిడిగా గ్రేడ్లు, పర్సంటేజ్ లు ఇవ్వడం వేరు. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు పెడితే.. ఒకవేళ పరిస్థితులు సహకరించక వారికి సెకండ్ ఇయర్ పరీక్షలు జరగకపోయినా ఇబ్బంది ఉండదు. ఫస్ట్ ఇయర్ మార్కులనే సెకండ్ ఇయర్ కి కూడా వేసి టోటల్ మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ వారికి కూడా ఇదే విధానం ఫాలో అయ్యారు. కరోనా వల్ల పరీక్షలు రద్దు చేసి, ఫస్ట్ ఇయర్ మార్కులను రెట్టింపు చేసి, సెకండ్ ఇయర్ మార్కుల లిస్ట్ ఇచ్చేశారు. అందులోనూ ఇంటర్మీడియట్ దశ చాలా కీలకం. ఏ పోటీ పరీక్షకు హాజరవ్వాలన్నా, సీటు తెచ్చుకోవాలన్నా ఇంటర్ పర్సంటేజీ అడుగుతారు. దీంతో తెంలగాణ ఇంటర్ బోర్డ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

పరీక్షలు రద్దు చేసే క్రమంలో అవకాశం వస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని గతంలోనే బోర్డు ప్రకటించింది. అందర్నీ ప్రమోట్ చేసినా, ఆగస్ట్ లో పరీక్షలు పెట్టి మార్కులు కేటాయిస్తామని చెబుతోంది. సెప్టెంబర్ తర్వాత మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉండటంతో అంతకంటే ముందుగానే పరీక్షలు జరపాలనుకుంటున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకోసం గతంలో 4,59,008మంది విద్యార్థులు ఫీజులు చెల్లించారు. ఇప్పుడు వీరందరికీ పరీక్షలు జరుపుతామంటోంది ఇంటర్ బోర్డ్. అయితే బోర్డ్ ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఒప్పుకుంటేనే పరీక్షలు జరుగుతాయి. గతంలో పరీక్షలు లేవని చెప్ప సరికి చాలామంది విద్యార్థులు సెకండ్ ఇయర్ కోర్స్ పై దృష్టిపెట్టారు. ఇప్పుడు వీరంతా మరోసారి ఫస్ట్ ఇయర్ పుస్తకాలతో కుస్తీ పట్టాల్సి రావొచ్చు.



కంగనా రనౌత్: అవన్నీ నిజం కాదు... నమ్మకండి ?

బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ళ గురించి ఈ విషయాలు తెలుసా ?

టాప్ లీడర్‌షిప్ పోస్ట్‌కు నామినేట్ అయిన ఎన్నారై సర్జన్‌..?

ఇస్తామన్నా తీసుకోడానికేమి ఇబ్బందో?

ఆ జిల్లా టీడీపీలో 'ఒక్క మగాడు'!

తెలుగు విద్యార్థికి యూఎస్ కాలేజ్ ఇన్ని కోట్ల స్కాలర్షిప్ ఇస్తుందా..?

ఆనందయ్యకి కోపమొచ్చింది..

ఏడాది తరువాత డైరెక్ట్ గా...అసలు రీజన్ అదేనా?

కరోనా కలకలం : రెండ్రోజుల సంపూర్ణ లాక్ డౌన్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>