PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/amaravati2aa65aef-25d0-446d-bc53-85b582a3d073-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/amaravati2aa65aef-25d0-446d-bc53-85b582a3d073-415x250-IndiaHerald.jpgఏపీ రాజధాని ఏది.. ఇప్పుడు ఇదో మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఏపీ ప్రభుత్వం రికార్డుల ప్రకారం అమరావతే ఏపీ రాజధాని.. కానీ.. ఏపీ సర్కారు విశాఖను రాజధాని చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చింది. ఈ వ్యవహారం కాస్త ఏపీ హైకోర్టులో ఉండిపోయింది. ఇంకా దీనిపై కోర్టు ఏమీ తేల్చలేదు. మరోవైపు అమరావతి నుంచి రాజధాని మర్చొద్దంటూ విపక్షాలు, రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ రాజధాని గురించి కేంద్రం ఏమనుకుంటోంది. ఏపీ రాజధానిగా కేంద్రం దేన్ని గుర్తిస్తుందనేది అంతుబట్amaravati{#}Amaravati;MP;Capital;Survey;Jagan;Letter;CM;Hyderabad;India;court;central government;Andhra Pradesh;News;Comedyఏపీ రాజధాని విషయంలో మళ్లీ కేంద్రం షాక్..?ఏపీ రాజధాని విషయంలో మళ్లీ కేంద్రం షాక్..?amaravati{#}Amaravati;MP;Capital;Survey;Jagan;Letter;CM;Hyderabad;India;court;central government;Andhra Pradesh;News;ComedyWed, 14 Jul 2021 09:00:00 GMTఏపీ రాజధాని ఏది.. ఇప్పుడు ఇదో మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఏపీ ప్రభుత్వం రికార్డుల ప్రకారం  అమరావతే ఏపీ రాజధాని.. కానీ.. ఏపీ సర్కారు విశాఖను రాజధాని చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చింది. ఈ వ్యవహారం కాస్త ఏపీ హైకోర్టులో ఉండిపోయింది. ఇంకా దీనిపై కోర్టు ఏమీ తేల్చలేదు. మరోవైపు అమరావతి నుంచి రాజధాని మర్చొద్దంటూ విపక్షాలు, రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు.


ఈ పరిస్థితుల్లో ఏపీ రాజధాని గురించి కేంద్రం ఏమనుకుంటోంది. ఏపీ రాజధానిగా కేంద్రం దేన్ని గుర్తిస్తుందనేది అంతుబట్టకుండా ఉంది.  కొన్నాళ్లక్రితం సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన ఇండియా మ్యాప్‌లో అసలు ఏపీకి రాజధానినే చూపించలేదు. దానిపై ఎంపీ గల్లా జయదేవ్ లేఖ రాస్తే అప్పుడు మళ్లీ కొత్త మ్యాప్ లో ఏపీ రాజధాని అమరావతిగా చూపారు. ఇటీవల కేంద్రం నుంచి వచ్చే లేఖలు ఇంకా హైదరాబాద్ పేరుతోనే వస్తున్నాయన్న వార్తలు కూడా వచ్చాయి.


కొన్నాళ్ల క్రితం ఏపీ రాజధాని గురించి ఆర్టీఐ ద్వారా సమాచరం అడిగితే.. ఏపీకి మూడు రాజధానులంటూ ఆర్టీఐ కార్యకర్త చైతన్యకుమార్‌రెడ్డికి  కేంద్రం సమాధానమిచ్చింది. అయితే..  కేంద్రం సమాధానంపై అమరావతి జేఏసీ అధ్యక్షుడు జీవీఆర్‌ శాస్త్రి హోంశాఖకు  కంప్లయింట్ చేశారు కూడా. దీంతో ఏపీ రాజధానిపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని ఓ  లేఖను కేంద్ర హోంశాఖ పంపింది.


అంటే ఏపీ రాజధానిపై కేంద్రం మరోసారి మాట మార్చిందన్నమాట. మొత్తానికి జగన్ సర్కారు పుణ్యమా అని ఏపీ రాజధాని అన్నది ఓ కామెడీ వ్యవహారంగా మారిపోయింది. ఏపీకి మూడు రాజధానులు ఉండాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని అమరావతి జేఏసీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. అమరావతి  రైతులు కూడా తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్రం మాత్రం రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెబుతోంది. మరి ఈ రాజధాని పంచాయతీ తేలేదెన్నడో.





కంగనా రనౌత్: అవన్నీ నిజం కాదు... నమ్మకండి ?

బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ళ గురించి ఈ విషయాలు తెలుసా ?

కత్తి మహేష్ మృతి : వదలని ఏపి సర్కార్ ?

నేడు టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క క‌మిటీతో కేటీఆర్ మీటింగ్‌

ఇస్తామన్నా తీసుకోడానికేమి ఇబ్బందో?

ఆ జిల్లా టీడీపీలో 'ఒక్క మగాడు'!

కొన్నాళ్ల క్రితం ఏపీ రాజధాని గురించి ఆర్టీఐ ద్వారా సమాచరం అడిగితే.. ఏపీకి మూడు రాజధానులంటూ ఆర్టీఐ కార్యకర్త చైతన్యకుమార్‌రెడ్డికి కేంద్రం సమాధానమిచ్చింది. అయితే.. కేంద్రం సమాధానంపై అమరావతి జేఏసీ అధ్యక్షుడు జీవీఆర్‌ శాస్త్రి హోంశాఖకు కంప్లయింట్ చేశారు కూడా. దీంతో ఏపీ రాజధానిపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని ఓ లేఖను కేంద్ర హోంశాఖ పంపింది.

సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తున్న పాన్ ఇండియా డైరెక్టర్!

రవితేజా నిర్ణయంతో షాక్ లో నందమూరి ఫ్యామిలీ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>