PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpd29b5e86-fb4d-4d26-babe-17714a42b368-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpd29b5e86-fb4d-4d26-babe-17714a42b368-415x250-IndiaHerald.jpgఅత్యంత కీల‌క‌మైన వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయ‌న‌ను జ‌గ‌న్ నియ‌మించారు. ఆది నుంచి కూడా సైలెంట్‌గానే ఉన్న ఆళ్ల‌కు గ‌డిచిన ఏడాదిన్న‌ర నుంచి అనేక స‌వాళ్లు ఎదుర‌య్యాయి. ముఖ్యంగా తొలిద‌శ క‌రోనా.. రెండో ద‌శ క‌రోనా.. ఈ క్ర‌మంలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. మ‌ర‌ణాలు.. ఆక్సిజ‌న్ కొర‌త‌.. ఇలా అనేక స‌మ‌స్య‌లు వెంటాయి. వీటికితోడు ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఆయ‌న‌ను చుట్టుముట్టాయి. అయిన‌ప్ప‌టికీ.. ఎక్క‌డా రెచ్చిపోకుండా.. తన ప‌నితనంతోనే ఆయ‌న స‌మాధానం చెప్పారు. YSRCP{#}Eluru;Dookudu;AdiNarayanaReddy;YCP;Ministerఆ ఏపీ మంత్రి సైలెంట్ అయినా.. మంచి మార్కులే...!ఆ ఏపీ మంత్రి సైలెంట్ అయినా.. మంచి మార్కులే...!YSRCP{#}Eluru;Dookudu;AdiNarayanaReddy;YCP;MinisterWed, 14 Jul 2021 16:40:00 GMTజ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రులుగా చేరిన వారికి రెండేళ్లు పూర్త‌య్యాయి. ఈ రెండేళ్ల‌కాలంలో ఎక్కువ‌గా ప‌నిచేసిన వారు ఎవ‌రు?  క‌ష్ట‌ప‌డిన వారు?  అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. కొంద‌రు మాత్ర‌మే క‌నిపిస్తారు. ఇక‌, ఫైర్ బ్రాండ్ మంత్రులుగా కొంద‌రు దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. త‌ర్వాత .. సైలెంట్ అయ్యారు. కానీ, ఆది నుంచి కూడా ఫుల్లు సైలెంట్‌గా ఉంటూ.. త‌న స‌త్తాను ప‌నిలో చూపించిన మంత్రిగా మంచి మార్కులు సంపాయించుకున్నారు.. మంత్రి ఆళ్ల నాని. ఏలూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న ఆళ్ల‌నాని.. సామాజిక స‌మీక‌ర‌ణ‌లో భాగంగా మంత్రి వ‌ర్గంలో చోటు సంపాయించుకున్నారు.

అత్యంత కీల‌క‌మైన వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయ‌న‌ను జ‌గ‌న్ నియ‌మించారు. ఆది నుంచి కూడా సైలెంట్‌గానే ఉన్న ఆళ్ల‌కు  గ‌డిచిన ఏడాదిన్న‌ర నుంచి అనేక స‌వాళ్లు ఎదుర‌య్యాయి. ముఖ్యంగా తొలిద‌శ క‌రోనా.. రెండో ద‌శ క‌రోనా.. ఈ క్ర‌మంలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. మ‌ర‌ణాలు.. ఆక్సిజ‌న్ కొర‌త‌.. ఇలా అనేక స‌మ‌స్య‌లు వెంటాయి. వీటికితోడు ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఆయ‌న‌ను చుట్టుముట్టాయి. అయిన‌ప్ప‌టికీ.. ఎక్క‌డా రెచ్చిపోకుండా.. తన ప‌నితనంతోనే ఆయ‌న స‌మాధానం చెప్పారు.

అంతే త‌ప్ప‌.. ఎక్క‌డా ప్ర‌తిప‌క్షాల‌కు కౌంట‌ర్లు ఇచ్చేందుకు నోరు పారేసుకున్న‌ది లేదు. అదేస‌మ‌యంలో చేతులు ఎత్తేసింది కూడా క‌నిపించ‌లేదు. మ‌రీ ముఖ్యంగా ఏలూరులో వింత వ్యాధి వ‌చ్చిన‌ప్పుడు.. ఆళ్ల‌కు మ‌రో పెద్ద స‌వాల్ ఎదురైంది. దీని అంతు చిక్క‌క‌పోవ‌డంతో ఆయ‌న రేయింబ‌వ‌ళ్లు అధికారుల‌తో స‌మీక్ష‌లు చేయ‌డం అందరికీ తెలిసిందే. ఎక్క‌డా సంయ‌మ‌నం కోల్పోకుండా.. త‌న విధుల‌ను నిర్వ‌హించ‌డంలో నిర్ల‌క్ష్యం చూపించ‌కుండా.. వ్య‌వ‌హ‌రించిన ఆళ్ల నానికి.. మంచి మార్కులు ప‌డ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, రాజ‌కీయంగా చూసుకున్నా.. ఆయ‌న ఎప్పుడూ వివాదాల జోలికి పోలేదు. త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు కూడా అప్పాయింట్ మెంట్ ఇచ్చి.. వారి ద‌గ్గ‌ర కూడా మార్కులు సంపాయించుకున్నారు. ఈ క్ర‌మంలోనే వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు రాకుండా జాగ్ర‌త్త‌ ప‌డ్డారు. ఇలా.. జ‌గ‌న్ కేబినెట్‌లో ఉన్న మంత్రుల్లో ఉత్త‌మ మంత్రుల్లో ఆళ్ల తొలిస్థానంలో నిలిచార‌ని.. వైసీపీ నేత‌లే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.





ఈటెలపై కేటీఆర్ విమర్శలు.. ఏమన్నారో తెలుసా?

నేను తనని అనలేదు.. అంటూ వీడియో విడుదల చేసిన పృథ్వి రాజ్ !

తెలుగు భాష‌పై వారిది ముస‌లిక‌న్నీరు... ? - ఏపీ మంత్రి

నాగార్జునకి అర్జెంటుగా హిట్టు స్టోరీ కావాలి..!

జబర్దస్త్ షో కి వెళ్లాలనుకునే వారు ఇలా చేస్తే సరి..

తండ్రి రాజ‌కీయంతో న‌లిగిపోతున్న త‌న‌యుడు..!

సైలెంట్‌గాను మంచి మార్కులేయించుకుంటోన్న ఆళ్ల నాని ?

హుజూరాబాద్‌లో కేసీఆర్ "క‌ట్ట‌ప్ప" ఎవ‌రు?

ముగ్గురు నేత‌లు మూడు పార్టీలు... ఒకే కుటుంబం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>