PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_analysis/ktr3c3119a2-fa31-489e-80a7-49b9d7a248c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_analysis/ktr3c3119a2-fa31-489e-80a7-49b9d7a248c5-415x250-IndiaHerald.jpgపార్టీ కార్యాల‌యాల పురోగ‌తిపై స‌మీక్ష పార్టీ స‌భ్యత్వ న‌మోదుపై చ‌ర్చించ‌డానికి ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు అధ్యక్షతన టీఆర్ఎస్ కార్య‌నిర్వాహక సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అభివృద్ధి ప‌నులు, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లడం, పార్టీ సభ్యత్వాల డిజిటలైజేషన్‌, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాల పురోగతి వంటి అంశాలపై ఈ స‌మావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీకి రావాల్సిందిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను ఆయ‌న‌ ఆహ్వానించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కtrs{#}Vihar;Siddipet;Akkineni Nagarjuna;local language;Telangana Rashtra Samithi TRS;District;CM;tuesday;Party;Februaryనేడు టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క క‌మిటీతో కేటీఆర్ మీటింగ్‌నేడు టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క క‌మిటీతో కేటీఆర్ మీటింగ్‌trs{#}Vihar;Siddipet;Akkineni Nagarjuna;local language;Telangana Rashtra Samithi TRS;District;CM;tuesday;Party;FebruaryWed, 14 Jul 2021 08:31:47 GMT పార్టీ కార్యాల‌యాల పురోగ‌తిపై స‌మీక్ష పార్టీ స‌భ్యత్వ న‌మోదుపై చ‌ర్చించ‌డానికి ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు అధ్యక్షతన టీఆర్ఎస్ కార్య‌నిర్వాహక సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అభివృద్ధి ప‌నులు, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లడం, పార్టీ సభ్యత్వాల డిజిటలైజేషన్‌, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాల పురోగతి వంటి అంశాలపై ఈ స‌మావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీకి రావాల్సిందిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను ఆయ‌న‌ ఆహ్వానించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుద‌ల చేశారు.


 గులాబీ బాస్‌, సీఎం కేసీఆర్‌ ఆదేశాల‌తో 2021-23కి సంబంధించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ సంవ‌త్స‌రం ఫిబ్రవరి 12న ప్రారంభమైంది. ఫిబ్ర‌వ‌రి చివ‌రి వ‌ర‌కు స‌భ్య‌త్వ న‌మోదును పూర్తి చేయాల‌నుకున్నారు. ఆ త‌రువాత గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వ‌ర‌కు సంస్థ‌గ‌త క‌మిటీల‌ను ఏర్పాటు చేసి, ఏప్రిల్ 27న పార్టీ అధ్య‌క్షుడిని ఎన్నుకునేలా షెడ్యూల్ ను నిర్మాణం చేశారు. కానీ అది పూర్తి కాలేదు దీనికి కార‌ణం శాస‌న‌మండ‌లి ఎమ్మెల్సీ ఎన్నిక‌లు, నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌, క‌రోనా సెకండ్‌వేవ్ త‌రువాత లాక్‌డౌన్ ఇలాంటి ఇత‌ర కార‌ణాల‌తో సంస్థాగ‌త క‌మిటీల నిర్మాణం, పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం సగంలోనే నిలిచిపోయాయి.


  జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాల‌నుకున్న టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యా నిర్మాణాలు స‌గం శాతం కూడా పూర్తి కాలేదు. వాటి నిర్మాణానికి 27 జులై 2019న భూమి పూజ చేసిన‌ప్ప‌టికి ఒక్క సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాల‌యం మిన‌హా మిగ‌తా జిల్లాల కార్యాల‌యాలు ప్రారంభం కాలేవు.



 ఇదే క్ర‌మంలో సీఎం కేసీఆర్ ఢీల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని నిర్మించ త‌ల‌పెట్టాడు. నిర్మ‌ణానికి వ‌సంత్ విహార్ ఏరియాలో భూమి కేటాయించిన‌ప్ప‌టికీ అనివార్య కార‌ణాల వ‌ల్ల శంకుస్థాప‌న వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. అయితే రాష్ట్ర రాజకీయ ప‌రిణామాల గురించి కూడా చ‌ర్చ జ‌ర‌గనుంద‌ని తెలుస్తోంది. అదే విధంగా పార్టీ మార్పులు పెరుగుతున్న నేప‌థ్యంలో త‌మ కార్య‌క‌ర్త‌ల‌ను ఎలా కాపాడుకోవాలో స్థానిక నేత‌ల‌కు టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్ష‌డు కె.తార‌క‌రామారావు దిశానిర్దేశం చేయ‌నున్నాడ‌ని స‌మాచారం.





కంగనా రనౌత్: అవన్నీ నిజం కాదు... నమ్మకండి ?

ఏపీ రాజధాని విషయంలో మళ్లీ కేంద్రం షాక్..?

ఇస్తామన్నా తీసుకోడానికేమి ఇబ్బందో?

ఆ జిల్లా టీడీపీలో 'ఒక్క మగాడు'!

స్మరణ: మిఠాయి వ్యాపారం నుంచి హాస్య నటుడిగా గుర్తింపు..

టిడిపి అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే?

రాహుల్ మీద ప్రశాంత్ స్పెషల్ లవ్, టార్గెట్ అదే..?

కరోనా కలకలం : రెండ్రోజుల సంపూర్ణ లాక్ డౌన్!

కేసీఆర్‌తో చంద్రబాబు అవగాహనకు వచ్చారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>