PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/etala-rajender110e7134-cc1c-4418-89d4-927171a93383-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/etala-rajender110e7134-cc1c-4418-89d4-927171a93383-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవి రాజీనామా అనంతరం తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావటం... తదనంతరం భారతీయ జనతా పార్టీ లోకి వెళ్లడం లాంటి ఎపిసోడ్... తెలంగాణ రాజకీయాలను ఓ మలుపు తిప్పింది. ఇక ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే... హుజూరాబాద్ నియోజకవర్గం లో అన్ని పార్టీలు... పాగా వేశాయి. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషetalarajendhar{#}G Kishan Reddy;Telangana Rashtra Samithi TRS;Yevaru;MLA;Amith Shah;Huzurabad;central government;Eatala Rajendar;Elections;Bharatiya Janata Party;రాజీనామా;Minister;Delhi;Party;News;Telanganaఢిల్లీ టూర్ : ఈటలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన అమిత్ షా ?ఢిల్లీ టూర్ : ఈటలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన అమిత్ షా ?etalarajendhar{#}G Kishan Reddy;Telangana Rashtra Samithi TRS;Yevaru;MLA;Amith Shah;Huzurabad;central government;Eatala Rajendar;Elections;Bharatiya Janata Party;రాజీనామా;Minister;Delhi;Party;News;TelanganaWed, 14 Jul 2021 19:12:00 GMTమాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవి రాజీనామా అనంతరం తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావటం... తదనంతరం భారతీయ జనతా పార్టీ లోకి వెళ్లడం లాంటి ఎపిసోడ్... తెలంగాణ రాజకీయాలను ఓ మలుపు తిప్పింది. ఇక ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎన్నిక అనివార్యమైన సంగతి   తెలిసిందే. అయితే ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే... హుజూరాబాద్ నియోజకవర్గం లో అన్ని పార్టీలు... పాగా వేశాయి. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అడుగు ముందే ఉంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ బిజెపి నాయకులు ఢిల్లీ బాట పట్టారు. ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు ఈటల రాజేందర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ పరిస్థితులు మరియు ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నిక పై సుదీర్ఘ చర్చలు జరిపారు. అంతేకాదు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ కు అమీత్ షా ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారట. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఓడిపోతే... పార్టీలో ఓ  కీలక పదవి ఇస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. కుదిరితే ఏదైనా రాష్ట్రానికి ఇన్చార్జిగా పంపిస్తామని కూడా అమీత్ షా  నచ్చ చెప్పారట.

ఇది ఇలా ఉండగా ఈ భేటీ అనంతరం  ఈటల రాజేందర్ మాట్లాడుతూ..  అమిత్ షా ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులు వివరించామన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని ఆయన అన్నారని చెప్పిన ఈటల రాజేందర్ ... ఇందు కోసం ఎన్ని సార్లైనా తెలంగాణ వస్తానని  అన్నారని తెలిపారు.  ఎవరు ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలిచేది బీజేపీ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు ఈటల. హుజురాబాద్ మాత్రమే కాదు ఇకపై తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచేది బీజేపీ పార్టీ  మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు ఈటల.



త్రివిక్రమ్ కోసం మెగా హీరో ట్రయల్స్..?

సారు... చాలా మారారు..?

కత్తి మహేష్ మరణానికి రీజన్ అదేనా...?

ఇండియాలో ఇదే మొదటిసారి!

మోడలింగ్ మానేసి మొదటి ప్రయత్నంతోనే ఐఏఎస్..

ఆ పథకంపై సీరియస్ గా జగన్, ముగ్గురు మంత్రులకు బిగ్ టాస్క్...?

ప్రభుత్వాన్ని వదలని పయ్యావుల...!

బ్రేకింగ్: విజయశాంతికి హైకోర్ట్ షాక్

అఖండ నుండి త్వరలో అదిరిపోయే అప్డేట్.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>