MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kruthi-sanan-movie-gossipc1cfd90d-ad9e-449f-a842-d7329ee97c1b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kruthi-sanan-movie-gossipc1cfd90d-ad9e-449f-a842-d7329ee97c1b-415x250-IndiaHerald.jpgక్రికెట్ అంటే యువతకు ప్రత్యేకమైన అభిమానం. ఇక తమ ఫేవరెట్ క్రికెటర్ లను దేవుళ్లతో సమానంగా ఆరాధిస్తుంటారు అభిమానులు. వారు వాడే వస్తువులకు దానికదే బ్రాండ్ ఏర్పడుతుంది, అంత క్రేజ్ ఉంది క్రికెటర్స్ కి, ఇక క్రికెటర్స్ బయోపిక్ లు తెరపై కనబడబోతున్నాయి అంటే ఆ క్రేజే వేరు. KRUTHI SANAN MOVIE GOSSIP{#}jeevitha rajaseskhar;kriti sanon;seetha;Saina Nehwal;sourav ganguly;silver screen;Cricket;Prabhas;Yevaru;Heroine;bollywood;Cinemaగంగూలీ బయోపిక్ లో ప్రభాస్ హీరోయిన్ ?గంగూలీ బయోపిక్ లో ప్రభాస్ హీరోయిన్ ?KRUTHI SANAN MOVIE GOSSIP{#}jeevitha rajaseskhar;kriti sanon;seetha;Saina Nehwal;sourav ganguly;silver screen;Cricket;Prabhas;Yevaru;Heroine;bollywood;CinemaWed, 14 Jul 2021 11:00:00 GMTక్రికెట్ అంటే యువతకు ప్రత్యేకమైన అభిమానం. ఇక తమ ఫేవరెట్ క్రికెటర్ లను దేవుళ్లతో సమానంగా ఆరాధిస్తుంటారు అభిమానులు. వారు వాడే వస్తువులకు దానికదే బ్రాండ్  ఏర్పడుతుంది, అంత క్రేజ్ ఉంది  క్రికెటర్స్ కి, ఇక క్రికెటర్స్ బయోపిక్ లు తెరపై కనబడబోతున్నాయి అంటే ఆ క్రేజే వేరు. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్ల బయోపిక్ లు బాలీవుడ్ ఇండస్ట్రీలో రూపుదిద్దుకోగా, అవి పలు భాషల్లో విడుదలై అన్ని చోట్లా మంచి విజయాలను సాధించాయి. మిల్కా సింగ్,  ఎంఎస్ ధోని, సైనా నెహ్వాల్ లపై చిత్రీకరించిన చిత్రాలు ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరో క్రికెటర్ బయోపిక్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ క్రికెటర్ మరెవరో కాదు. ఒకప్పుడు టీమిండియాకు కెప్టెన్ గా ముందుండి సారథ్యం వహించిన సౌరవ్ గంగూలీ. 
ఇప్పుడు ఈయన జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని ఓ సినిమా రూపుదిద్దుకోబోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన బయోపిక్ త్వరలో తెరకెక్కబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. మొదట ముగ్గురు నటులను పరిశీలించగా వారిలో రన్ బీర్ కపూర్ అయితే తన పాత్రకు సరిగ్గా సూట్ అవుతాడు అని అభిప్రాయపడ్డారు.  ఈ విషయం విన్న క్రికెట్ అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు అయింది.  సిల్వర్ స్క్రీన్ పై స్టేడియం కనపడబోతోంది అంటే  ఇక ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ అంతా సిద్ధంగా ఉండగా, నటీనటులు ఎవరు అన్న వివరాలను త్వరలోనే అధికారకంగా ప్రకటించనుంది ప్రొడక్షన్ హౌస్. ఇప్పటికే ఈ బయోపిక్ కి సంబంధించి కీలక  నటీమణులను ఎంపిక చేసినట్లు సమాచారం. 
ఇదిలా ఉంటే ఈ చిత్రంపై ఒక వార్త హల్ చల్ చేస్తోంది. సౌరవ్ గంగూలీ బయోపిక్ లో ఆయన భార్యగా ఒక ప్రముఖ నటి నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. కృతి సనన్ ను ఎంపిక చేయనున్నట్లు అనుకుంటున్నారట...మారి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే, చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికే కృతి సనన్ ఆది పురుష్ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా సీత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.



తెరాస నేతలకు కేటీఆర్ ఫోన్ లు...?

వేషాలు కావాలంటే హీరోతో పడుకోవాల్సిందే: హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..!

సినీ ప్రేక్షకులకు వినాయక చవితి వరకు నిరీక్షణ తప్పదా?

పవన్ సినిమాల అంకెల గారడీ.. అయోమయంలో ఫ్యాన్స్!!

ఇంతకాలానికి సినిమా మొదలెడితే... అది కూడా ఆగిపోయిందా ?

సింధు.. మనం ఐస్ క్రీమ్ తిందాం : మోడీ

పానిపురి బండి వాడితో సెటిల్ అవ్వాలనుకున్న తెలుగు హీరోయిన్

సోనూసూద్‌ కోసం ఆ బాలుడు ఏం చేశాడంటే...?

మనీ: అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>