PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp60c18411-dc11-47dd-a148-cb67f4aefc57-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp60c18411-dc11-47dd-a148-cb67f4aefc57-415x250-IndiaHerald.jpgకడప జిల్లా రాజంపేట పార్లమెంట్....వైసీపీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ వైసీపీ హవా పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ సత్తా చాటింది. అయితే మొదట నుంచి రాజంపేటలో టీడీపీకి పెద్ద బలం లేదు. 1984, 1999 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. ఇక ఎక్కువగా కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించింది. tdp{#}Mithoon;Parliment;Assembly;Abhimanyu Mithun;Narasimha;Rajampet;Nallari Kishore Kumar Reddy;shankar;District;TDP;YCP;Congressషాకింగ్: వైసీపీ కంచుకోటలో టీడీపీకి ఛాన్స్ దొరికిందా?షాకింగ్: వైసీపీ కంచుకోటలో టీడీపీకి ఛాన్స్ దొరికిందా?tdp{#}Mithoon;Parliment;Assembly;Abhimanyu Mithun;Narasimha;Rajampet;Nallari Kishore Kumar Reddy;shankar;District;TDP;YCP;CongressWed, 14 Jul 2021 06:54:00 GMTకడప జిల్లా రాజంపేట పార్లమెంట్....వైసీపీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ వైసీపీ హవా పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ సత్తా చాటింది. అయితే మొదట నుంచి రాజంపేటలో టీడీపీకి పెద్ద బలం లేదు. 1984, 1999 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. ఇక ఎక్కువగా కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగయ్యాక ఇక్కడ వైసీపీ సత్తా చాటుతుంది. వైసీపీ తరుపున మిథున్ రెడ్డి భారీ మెజారిటీలతో విజయం సాధిస్తూ వస్తున్నారు. భవిష్యత్‌లో ఇక్కడ వైసీపీకి తిరుగులేదని తెలుస్తోంది. ఎన్నికలై రెండేళ్ళు అయినా సరే ఇక్కడ టీడీపీ పుంజుకోలేదు. రానున్న రోజుల్లో టీడీపీ సత్తా చాటడం కష్టమని తెలుస్తోంది. అసలు ఇక్కడ టీడీపీకి ఛాన్స్ దొరకడం కష్టమే.

అటు రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కూడా వైసీపీకి తిరుగులేకుండా పోయింది.  పార్లమెంట్ పరిధిలో ఉన్న రైల్వే కోడూరు, రాయచోటి, తంబళ్ళపల్లే, పీలేరు, మదనపల్లె, పుంగనూరు, రాజంపేట స్థానాలు ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ ఏడు స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఇప్పుడు కూడా ఆ ఏడు చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గా ఉన్నారు. దీంతో ఆయా స్థానాల్లో టీడీపీ నేతలు పుంజుకోలేకపోతున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బకు టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది. రాజంపేటలో సైతం టీడీపీకి పెద్ద ఛాన్స్ లేదు. టీడీపీ తరుపున చెంగల్రాయుడు పనిచేస్తున్నారు. కానీ ఆయన రెండేళ్లలో పుంజుకోలేదు.

రైల్వే కోడూరులో నరసింహ ప్రసాద్ పరిస్తితి అలాగే ఉంది. రాయచోటిలో టీడీపీ జెండానే కనిపించడం లేదు. తంబళ్ళపల్లెలో శంకర్ యాదవ్ అడ్రెస్ లేరు. మదనపల్లెలో రమేష్ బలపడలేదు. పీలేరులో మాత్రం నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికైతే రాజంపేటలో టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ దొరకట్లేదనే చెప్పొచ్చు. ఇక్కడ వైసీపీ ఆధిక్యం ఫుల్‌గా ఉంది.  



నేడు టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క క‌మిటీతో కేటీఆర్ మీటింగ్‌

ఆ జిల్లా టీడీపీలో 'ఒక్క మగాడు'!

స్మరణ: మిఠాయి వ్యాపారం నుంచి హాస్య నటుడిగా గుర్తింపు..

టిడిపి అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే?

ఏడాది తరువాత డైరెక్ట్ గా...అసలు రీజన్ అదేనా?

రాహుల్ మీద ప్రశాంత్ స్పెషల్ లవ్, టార్గెట్ అదే..?

పెట్రోల్ ధరలు అక్కడ పెరిగాయ్.. కానీ ?

కేసీఆర్‌తో చంద్రబాబు అవగాహనకు వచ్చారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీకి ఛాన్స్ ఇవ్వని బాషా...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>