MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bad-luck-heroins-8cda4e35-b793-4cb8-8ff0-3fe87ddaba87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bad-luck-heroins-8cda4e35-b793-4cb8-8ff0-3fe87ddaba87-415x250-IndiaHerald.jpgకొందరు హీరోయిన్లకు అందం ఉంది. అభినయం ఉంది. అంతకు మించి టాలెంట్ ఉంది. కానీ ఏం లాభం.. ఏమని సినిమా మొదలు పెట్టారో బ్యాడ్ లక్ వెంటాడుతోంది. కొన్ని సినిమాలు షూటింగ్ కు వెళ్లకపోగా.. మరికొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ కు నోచుకులేదు. దీంతో వాళ్లు చాలా డిసప్పాయింట్ లో ఉన్నారు. bad luck heroins {#}Ravi;adivi sesh;ravi teja;Haryana;NagaShaurya;karthikeya;kartikeya;Mumbai;puri jagannadh;Heroine;Coronavirus;BEAUTY;Cinema;Indiaప్చ్.. బ్యాడ్ లక్..!ప్చ్.. బ్యాడ్ లక్..!bad luck heroins {#}Ravi;adivi sesh;ravi teja;Haryana;NagaShaurya;karthikeya;kartikeya;Mumbai;puri jagannadh;Heroine;Coronavirus;BEAUTY;Cinema;IndiaWed, 14 Jul 2021 06:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అదృష్టం ఉండాలి. సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్ అనే ఇమేజ్‌ వస్తేనే స్టార్ హీరోయిన్‌ అవుతారు. అదే తొలి సినిమానే ఆలస్యంగా నడుస్తుంటే.. హీరోయిన్స్‌పై నెగటివ్ ఇమేజ్ వస్తుంది. సోషల్‌ మీడియాలో సూపర్ క్రేజ్ ఉన్న బ్యూటీ కేతిక శర్మ. ఈ ఫాలోయింగ్‌తోనే ఆకాశ్ పూరి 'రొమాంటిక్' సినిమాలో ఆఫర్ అందుకుంది. రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కరోనాతో వాయిదాపడుతూ వస్తోంది. ఇక ఈ మూవీ సెట్స్‌లో ఉండగానే నాగశౌర్య 'లక్ష్య'కి సైన్ చేసింది. అయితే కరోనాతో ఈ సినిమాకి బ్రేకులు పడ్డాయి. అలాగే వైష్ణవ్‌ తేజ్, గిరీశాయ ప్రాజెక్ట్‌ కూడా కోవిడ్ ఎఫెక్ట్‌తో ఆలస్యమవుతోంది. దీంతో చేతిలో మూడు సినిమాలున్నా, కేతిక రిలీజ్‌ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.

మిస్‌ ఇండియా కాంపిటీషన్ నుంచి డైరెక్ట్ గా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి. సుశాంత్‌ 'ఇచ్చట వాహనములు నిలపరాదు' సినిమాతో టీటౌన్‌కి వచ్చిన మీనాక్షికి ఆ వెంటనే రవితేజ 'ఖిలాడి', అడివి శేష్ 'హిట్2'లో అవకాశాలు వచ్చాయి. అయితే ఈ మూడిటిలో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. సమ్మర్‌లోనే రావాల్సిన 'ఖిలాడి'కి సెకండ్‌ వేవ్‌తో బ్రేకులు పడ్డాయి. ఇక 'హిట్2' షూటింగ్ స్టార్ట్ చెయ్యాల్సి ఉంది.

సల్మాన్ ఖాన్ 'దబాంగ్3'తో కెరీర్‌ మొదలుపెట్టిన సయీ మంజ్రేకర్‌, తెలుగులోనూ రెండు సినిమాలకి సైన్ చేసింది. అడివి శేష్‌ 'మేజర్'లో నటిస్తోంది. ఈ మూవీ జులై ఫస్ట్‌ వీక్‌లోనే రిలీజ్ కావాల్సింది. అయితే సెకండ్‌ వేవ్‌తో బ్రేకులు పడ్డాయి. అలాగే వరుణ్‌తేజ్‌తో కలిసి నటిస్తోన్న 'గని' సినిమా ఇంకా షూటింగ్‌ పూర్తి చేసుకోవాల్సి ఉంది.

హీరోయిన్‌ కెరీర్ స్పాన్ చాలా తక్కువ. పెరుగుతోన్న వయసుతో కెరీర్‌ తరిగిపోతుంటుంది. అందుకే తక్కువ టైమ్‌లో ఎక్కువ సినిమాలు చెయ్యాలని ట్రై చేస్తుంటారు హీరోయిన్లు. అయితే కరోనా వేవ్స్‌తో హీరోయిన్ల ఆశలకి బ్రేకులు పడుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా వస్తోన్న హీరోయిన్ల కెరీర్‌ స్పాన్‌ని దెబ్బతీస్తోంది.


కోలీవుడ్‌లో తక్కువ టైమ్‌లోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించిన హీరోయిన్ తాన్యా రవిచంద్రన్. ఈమె కార్తికేయ 'రాజా విక్రమార్క' సినిమాతో తెలుగుకి వస్తోంది. అయితే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తయ్యాక లాక్‌డౌన్ వచ్చింది. తాన్యాకి బ్రేకులు పడ్డాయి. అలాగే 'ఓ మై కడవులే' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతోన్న ముంబయి బ్యూటీ మిథిలా పార్కర్‌ పరుగులకి లాక్‌డౌన్‌తోబ్రేకులు పడ్డాయి. చూద్దాం వీళ్ల కెరీర్ ముందుముందు ఎలా సాగుతుందో.









ముగ్గురు నానీలకు బంపర్ ఆఫర్...?

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ నటి ఎవరో తెలుసా..?

ఈ తప్పులు చేస్తే మీ ముఖం నాశనమైనట్లే...

బాబోయ్‌.. అక్కడ రెచ్చిపోతున్న కరోనా.. రికార్డు స్థాయి మరణాలు..

ప్రశాంత్ నీల్ కు ఏమాత్రం తగ్గని బోయపాటి.. కాని తేడా ఎక్కడంటే..!

పెంపుడు పిల్లి మిస్సింగ్.. ఆచూకీ తెలిపితే నగదు..

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వేర్వేరు కంపెనీలు తయారీ చేసిన కరోనా టీకాలను వేర్వేరు డోసుల్లో తీసుకోవడం ప్రమాదకరమని తేల్చి చెప్పింది.

ఒలింపిక్స్ కు ముఖ్య అతిథిగా..!

రష్యాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రష్యాలో కొత్తగా రికార్డుస్థాయిలో మళ్లీ 780 వరకూ కరోనా మరణాలు సంభవించాయి. కోవిడ్ మహమ్మారి మొదలైన నాటి నుంచి ఒక్క రోజులో నమోదైన మరణాల్లో ఇదే అత్యధికంగా అక్కడి నిపుణులు చెబుతున్నారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>