PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan53711386-7899-4e75-b6e1-5b208f1d16c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan53711386-7899-4e75-b6e1-5b208f1d16c9-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముగ్గురు నానీలకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారా? వాళ్ళని ఐదేళ్ల పాటు మంత్రులుగా కొనసాగించనున్నారా? అంటే వైసీపీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. ఏపీ కేబినెట్‌లో ముగ్గురు నానీలు మంత్రులుగా ఉన్నారు. పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి వెంకటేశ్వరరావు(నాని), ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని)లు జగన్ మంత్రివర్గంలో ఉన్నారు. ఈ ముగ్గురు జగన్‌తో సన్నిహితంగానే ఉంటారు. ఇలా సన్నిహితంగా ఉండే నానీల మంత్రి పదవులు ఐదేళ్ల పాటు కంటిన్యూ అవ్వనున్నాయని తెలుస్తోంది. jagan{#}Nani;krishna;Amarnath Cave Temple;CM;Department of transportation;MLA;Alla Ramakrishna Reddy;Eega;Eluru;SV Mohan Reddy;Jagan;YCP;Andhra Pradesh;TDP;Minister;Coronavirusముగ్గురు నానీలకు బంపర్ ఆఫర్...?ముగ్గురు నానీలకు బంపర్ ఆఫర్...?jagan{#}Nani;krishna;Amarnath Cave Temple;CM;Department of transportation;MLA;Alla Ramakrishna Reddy;Eega;Eluru;SV Mohan Reddy;Jagan;YCP;Andhra Pradesh;TDP;Minister;CoronavirusWed, 14 Jul 2021 02:00:00 GMTఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముగ్గురు నానీలకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారా? వాళ్ళని ఐదేళ్ల పాటు మంత్రులుగా కొనసాగించనున్నారా? అంటే వైసీపీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. ఏపీ కేబినెట్‌లో ముగ్గురు నానీలు మంత్రులుగా ఉన్నారు. పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి వెంకటేశ్వరరావు(నాని), ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని)లు జగన్ మంత్రివర్గంలో ఉన్నారు. ఈ ముగ్గురు జగన్‌తో సన్నిహితంగానే ఉంటారు. ఇలా సన్నిహితంగా ఉండే నానీల మంత్రి పదవులు ఐదేళ్ల పాటు కంటిన్యూ అవ్వనున్నాయని తెలుస్తోంది.

మచిలీపట్నం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన పేర్ని నాని, జగన్ కేబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మంత్రిగా మంచి మార్కులే తెచ్చుకుంటున్న నాని, ప్రభుత్వానికి అండగా ఉండటంలో ముందున్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ అదరగొడతారు. అటు గుడివాడ నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని, కేబినెట్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు.

ఇక మంత్రిగా నాని దూకుడు ఏంటో అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష టీడీపీ అంటే ఒంటికాలి మీద వెళ్తారు. జగన్ మీద ఈగ వాలనివ్వకుండా చూసుకుంటారు. అలాగే ఏలూరు నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ళ నాని, జగన్ కేబినెట్‌లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కాస్త మృదుస్వభావిగా పేరొందిన నాని, తనదైన శైలిలో పనిచేస్తూ ముందుకెళుతున్నారు. కరోనా సమయంలో మంత్రిగా బాగానే కష్టపడ్డారు.

ఇలా ముగ్గురు నానీలు జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. పైగా వీరు జగన్‌తో చాలా సన్నిహితంగా ఉంటారు. గతంలో తమ ఎమ్మెల్యే పదవులని సైతం త్యాగం చేసి జగన్‌కు మద్ధతుగా నిలబడ్డారు. ఇలా జగన్‌కు అండగా నిలబడిన ఈ ముగ్గురు నానీలకు బంపర్ ఆఫర్ ఉంటుందని తెలుస్తోంది. వీరి మంత్రి పదవులు ఐదేళ్ల పాటు కంటిన్యూ అవ్వడం ఖాయమని తెలుస్తోంది. మరి చూడాలి నానీలని జగన్ మంత్రివర్గంలో ఐదేళ్ల పాటు కొనసాగిస్తారో లేదో?    



జనసేనకు వాళ్ళే పెద్ద మైనస్..పవన్ సెట్ చేయాల్సిందే...!

బాబోయ్‌.. అక్కడ రెచ్చిపోతున్న కరోనా.. రికార్డు స్థాయి మరణాలు..

ఆ జగన్‌ను చూసి ఫాలో అవ్వండి.. కేసీఆర్‌ ఆదేశం..?

పెంపుడు పిల్లి మిస్సింగ్.. ఆచూకీ తెలిపితే నగదు..

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వేర్వేరు కంపెనీలు తయారీ చేసిన కరోనా టీకాలను వేర్వేరు డోసుల్లో తీసుకోవడం ప్రమాదకరమని తేల్చి చెప్పింది.

ఒలింపిక్స్ కు ముఖ్య అతిథిగా..!

రష్యాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రష్యాలో కొత్తగా రికార్డుస్థాయిలో మళ్లీ 780 వరకూ కరోనా మరణాలు సంభవించాయి. కోవిడ్ మహమ్మారి మొదలైన నాటి నుంచి ఒక్క రోజులో నమోదైన మరణాల్లో ఇదే అత్యధికంగా అక్కడి నిపుణులు చెబుతున్నారు.

కడప జిల్లా రాజంపేట పార్లమెంట్....వైసీపీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ వైసీపీ హవా పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ సత్తా చాటింది. అయితే మొదట నుంచి రాజంపేటలో టీడీపీకి పెద్ద బలం లేదు. 1984, 1999 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. ఇక ఎక్కువగా కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించింది.

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముగ్గురు నానీలకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారా? వాళ్ళని ఐదేళ్ల పాటు మంత్రులుగా కొనసాగించనున్నారా? అంటే వైసీపీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. ఏపీ కేబినెట్‌లో ముగ్గురు నానీలు మంత్రులుగా ఉన్నారు. పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి వెంకటేశ్వరరావు(నాని), ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని)లు జగన్ మంత్రివర్గంలో ఉన్నారు. ఈ ముగ్గురు జగన్‌తో సన్నిహితంగానే ఉంటారు. ఇలా సన్నిహితంగా ఉండే నానీల మంత్రి పదవులు ఐదేళ్ల పాటు కంటిన్యూ అవ్వనున్నాయని తెలుస్తోంది.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>