Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hujurabad-lo-veyyi-mandi-kcr-ki-warning-4c9b1af2-95a5-4b9c-87f5-711b3740dbfb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hujurabad-lo-veyyi-mandi-kcr-ki-warning-4c9b1af2-95a5-4b9c-87f5-711b3740dbfb-415x250-IndiaHerald.jpgగతంలో నిజాంబాద్ పార్లమెంటు ఎన్నికలు జరిగిన సీన్ గురించి దాదాపుగా తెలంగాణ ప్రజలు ఎవరూ మర్చిపోలేరు. పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదు అన్న కారణంతో ఏకంగా కెసిఆర్ కూతురు అయినప్పటికీ కవితను ఘోరంగా ఓడించారు నిజాంబాద్ పార్లమెంట్ ప్రజలు. అంతేకాదు భారీగా పసుపు రైతులందరూ కవిత కు వ్యతిరేకంగా ఇక పార్లమెంటు ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడం కూడా అప్పట్లో సంచలనం గా మారిపోయింది. చివరికి పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవిత ఓడిపోయి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధించాడు. అయితే మరికొన్ని రోజుల్లో Kcr{#}kavitha;Turmeric;రాజీనామా;Avunu;Huzurabad;MLA;Government;Parliament;Parliment;Allu Aravind;Telangana Rashtra Samithi TRS;Bharatiya Janata Party;KCR;Telanganaహుజురాబాద్ లో వెయ్యి మంది పోటీ చేస్తాం.. కేసిఆర్ కు వార్నింగ్?హుజురాబాద్ లో వెయ్యి మంది పోటీ చేస్తాం.. కేసిఆర్ కు వార్నింగ్?Kcr{#}kavitha;Turmeric;రాజీనామా;Avunu;Huzurabad;MLA;Government;Parliament;Parliment;Allu Aravind;Telangana Rashtra Samithi TRS;Bharatiya Janata Party;KCR;TelanganaWed, 14 Jul 2021 16:36:00 GMTగతంలో నిజాంబాద్ పార్లమెంటు ఎన్నికలు జరిగిన సీన్ గురించి దాదాపుగా తెలంగాణ ప్రజలు ఎవరూ మర్చిపోలేరు. పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదు అన్న కారణంతో ఏకంగా కెసిఆర్ కూతురు అయినప్పటికీ కవితను ఘోరంగా ఓడించారు నిజాంబాద్ పార్లమెంట్ ప్రజలు.  అంతేకాదు భారీగా పసుపు రైతులందరూ కవిత కు వ్యతిరేకంగా ఇక పార్లమెంటు ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడం కూడా అప్పట్లో సంచలనం గా మారిపోయింది. చివరికి పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్  కూతురు కవిత ఓడిపోయి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధించాడు.



 అయితే మరికొన్ని రోజుల్లో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కూడా ఇలాంటి సీన్ రిపీట్  కాబోతుందా అంటే ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవును అనే సమాధానం చెప్పక మానరు ఎవరైనా.  టిఆర్ఎస్ నుండి తప్పుకుని బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటికే బిజెపి తరఫున ఈటెల రాజేందర్ పోటీ చేస్తుండగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇంక అభ్యర్థిని కూడా ఖరారు చేయలేదు. ఈటలపై పోటీకి టీఆర్ఎస్ ఎవరిని రంగంలోకి దింపుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో అటు టీఆర్ఎస్ పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది.



 ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగించింది.అయితే ఇటీవలే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు అందరు నిరసన తెలిపారు. ఇక వారందరూ హుజురాబాద్ ఉప ఎన్నికకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల లోపు దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఏకంగా ఉప ఎన్నికల్లో తమ సంఘం నుంచి వెయ్యి మంది పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని టిఆర్ఎస్ పార్టీని హెచ్చరించారు. ఈ పరిస్థితులు చూస్తుంటే మళ్లీ నిజాంబాద్ ఎన్నిక రిపీట్ అవుతుందేమో అని అనిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు.



ఆ పథకంపై సీరియస్ గా జగన్, ముగ్గురు మంత్రులకు బిగ్ టాస్క్...?

ప్రభుత్వాన్ని వదలని పయ్యావుల...!

బ్రేకింగ్: విజయశాంతికి హైకోర్ట్ షాక్

చంద్రబాబు, లోకేష్ లపై.. లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్?

అమిత్ షా వస్తానన్నారు.. గెలుపు బీజేపీదే : బండి సంజయ్

సినీ ఇండస్ట్రీని కంట్రోల్ చేసున్న సీఎం జగన్..?

సీఎం పదవికి అడ్డొస్తారనే కవితకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు: ధర్మపురి అరవింద్ దుమారం

బీజేపీ నా పార్టీ కాదు: తెలంగాణా బీజేపీ సంచలన కామెంట్స్

ఈటెలపై కేటీఆర్ విమర్శలు.. ఏమన్నారో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>