EducationMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/education-76476578-73f3-4f95-9759-d1f0ba7ba404-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/education-76476578-73f3-4f95-9759-d1f0ba7ba404-415x250-IndiaHerald.jpgతనకు మార్గదర్శిగా నిలిచినటువంటి డేక్స్రిటేరిటీ గ్లోబల్ సంస్థ సీఈవో శరత్ సాగర్ కు ఎప్పటికీ రుణపడి ఉంటానని శ్వేతారెడ్డి తెలియజేసింది. అలాగే శ్వేతారెడ్డి ఇంతటి ఘనత రావడం పట్ల డేక్స్రిటేరిటీ సీఈఓ శరత్ సాగర్ గారు హర్షం వ్యక్తం చేసినారు. రాబోయే తరాలకు మంచి నాయకులు సిద్ధం చేయడమే తమ లక్ష్యమని తెలియజేశారు. కెరీర్ కు సంబంధించి తమ సంస్థ ఇచ్చినటువంటి ట్రైనింగ్ తో చాలా మంది విద్యార్థులు ఎల్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, జార్జి టౌన్, టఫ్ట్స్, కేసు వెస్టర్న్, నార్త్ వెస్టర్న్, బోస్టన్ యూనివర్సిటీ, యూనివర్Education {#}Colombia;University;students;college;swetha;sharath;Sharrath Marar;Girl;American Samoa;Telangana;Teluguతెలుగు విద్యార్థికి యూఎస్ కాలేజ్ ఇన్ని కోట్ల స్కాలర్షిప్ ఇస్తుందా..?తెలుగు విద్యార్థికి యూఎస్ కాలేజ్ ఇన్ని కోట్ల స్కాలర్షిప్ ఇస్తుందా..?Education {#}Colombia;University;students;college;swetha;sharath;Sharrath Marar;Girl;American Samoa;Telangana;TeluguWed, 14 Jul 2021 08:05:00 GMTపట్టుదల ఉంటే మనకు సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని విద్యార్థి నిరూపించారని చెప్పవచ్చు. టాలెంట్ ఉంటే ఏది కూడా అడ్డుకాదని శ్వేతా రెడ్డి ని చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి  శ్వేతా రెడ్డి 17 సంవత్సరాల విద్యార్థినికి  అమెరికాలోని ప్రముఖ లేపాయేట్ కాలేజీలో ఒక అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కాలేజీకి ఆరుగురు విద్యార్థుల ఎంపిక అవ్వగా అందులో తెలంగాణ నుంచి ఈ అమ్మాయి ఎంపికైంది. ఆమె ఎవరో తెలుసుకుందామా..?

 తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్వేతా రెడ్డి అనే 17 సంవత్సరాల విద్యార్థిని అమెరికా నగరంలోని ప్రముఖ లపాయేట్ కళాశాల ఆమె ప్రతిభకు రెండు కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఆఫర్ ఇచ్చింది. ఈ విద్యార్థిని లపాయేట్ కాలేజీలో నాలుగు సంవత్సరాల  బ్యాచిలర్ డిగ్రీతో కంప్యూటర్ సైన్సు, మ్యాథ్స్ కోర్సులలో అడ్మిషన్ తో పాటుగా ఈ యొక్క స్కాలర్షిప్ ను వారు ఆఫర్ చేశారు. డైయ్యర్ ఫెలోషిప్ పేరుతో కళాశాల ఇచ్చే ఈ స్కాలర్షిప్ నకు ప్రపంచం మొత్తంలో కేవలం  ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఎంపికయ్యారు. అందులో మన తెలుగు విద్యార్థి ఒకరు. హైస్కూల్ స్థాయిలో  శ్వేతారెడ్డి కనబడినటువంటి ప్రతిభా మరియు నాయకత్వ లక్షణాలు బాగా నచ్చాయని  లాపాయట్ కాలేజీ యాజమాన్యం తెలియజేసింది. తెలుగు తేజానికి ఇంతటి అరుదైన గౌరవం రావడం పట్ల  శ్వేత ఆనందోత్సాహాల్లో మునిగి పోతుంది.  తనకి ఎంతో గర్వకారణమని తెలియజేస్తోంది. తనకు ఇంత ఘనత రావడానికి వెనుకనుంచి డేక్స్రిటేరిటీ అనే గ్లోబల్ సంస్థ ఇచ్చిన ప్రోత్సాహంతో తను ఈ ఘనత  సాధించానంది.

డేక్స్రిటేరిటీ గ్లోబల్  కళాశాల అనే కెరీర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా చేరిన శ్వేతా రెడ్డి నాలుగు సంవత్సరాలపాటు  శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణలో శ్వేతకు నాయకత్వ లక్షణాలతో పాటు, సమస్యను పరిష్కరించే నైపుణ్యాలను వీరు ఇచ్చిన శిక్షణ ద్వారా  పెంపొందించుకో గలిగానని శ్వేతా రెడ్డి పేర్కొన్నారు. తన లైఫ్లో తనకు మార్గదర్శిగా నిలిచినటువంటి డేక్స్రిటేరిటీ గ్లోబల్ సంస్థ సీఈవో శరత్ సాగర్ కు ఎప్పటికీ రుణపడి ఉంటానని శ్వేతారెడ్డి తెలియజేసింది. అలాగే శ్వేతారెడ్డి ఇంతటి ఘనత రావడం పట్ల డేక్స్రిటేరిటీ సీఈఓ శరత్ సాగర్ గారు హర్షం వ్యక్తం చేసినారు. రాబోయే తరాలకు మంచి నాయకులు సిద్ధం చేయడమే తమ లక్ష్యమని తెలియజేశారు. కెరీర్ కు సంబంధించి తమ సంస్థ ఇచ్చినటువంటి ట్రైనింగ్ తో చాలా మంది విద్యార్థులు ఎల్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, జార్జి టౌన్, టఫ్ట్స్, కేసు వెస్టర్న్, నార్త్ వెస్టర్న్, బోస్టన్ యూనివర్సిటీ, యూనివర్శిటీ ఆఫ్ టొరంటో, యూనివర్సిటీ ఆఫ్ లండన్, తదితర ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందగలరని హర్షం వ్యక్తం చేశారు.



ఇస్తామన్నా తీసుకోడానికేమి ఇబ్బందో?

టిడిపి అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే?

చిరంజీవి సాయంతో హీరోగా ఎదిగిన శరత్ కుమార్..

కేసీఆర్‌తో చంద్రబాబు అవగాహనకు వచ్చారా..?

ప్రశాంత్ నీల్ కు ఏమాత్రం తగ్గని బోయపాటి.. కాని తేడా ఎక్కడంటే..!

ఆ జగన్‌ను చూసి ఫాలో అవ్వండి.. కేసీఆర్‌ ఆదేశం..?

పెంపుడు పిల్లి మిస్సింగ్.. ఆచూకీ తెలిపితే నగదు..

ఒలింపిక్స్ కు ముఖ్య అతిథిగా..!

సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకోకుండా అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తస్మాత్ జాగ్రత్త లేకుంటే వారి వలలో పడక తప్పదు అంటున్నారు పోలీసులు. ఈరోజుల్లో స్మార్ట్ వాడని అమ్మాయిలు చాలా తక్కువ..అసలు ఉండరేమే. ఇప్పుడు అవే వారికి లేనిపోని ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>