MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sr-kalyanamandapamb6288998-ce7e-46aa-9fbf-b6bc13043716-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sr-kalyanamandapamb6288998-ce7e-46aa-9fbf-b6bc13043716-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న సినిమాల జోరు కొనసాగుతుంది. సినిమా పెద్దదా చిన్నదా అని చూడకుండా ట్రైలర్, టీజర్ లు ఆకట్టుకునేలా ఉంటే సినిమా పై ఎన్నో అంచనాలు పెరుగుతున్నాయి. ఇక అలాగే ఇటీవల వచ్చిన చిన్న సినిమా ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా టీజ‌ర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీధర్ గాదె దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించారు. అంతేకాకుండా ఈ సినిమాకు కథను కూడా హీరోగా నటించిన కిరణ్ అబ్బవరsr kalyanamandapam{#}rani;Taxiwala;Romantic;kiran;Chaitanya;cinema theater;sridhar;Posters;tara;Heroine;Tollywood;Cinemaఎస్ఆర్ కళ్యాణమండపం జోరు మామూలుగా లేదుగా.. !ఎస్ఆర్ కళ్యాణమండపం జోరు మామూలుగా లేదుగా.. !sr kalyanamandapam{#}rani;Taxiwala;Romantic;kiran;Chaitanya;cinema theater;sridhar;Posters;tara;Heroine;Tollywood;CinemaWed, 14 Jul 2021 15:55:08 GMTప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న సినిమాల జోరు కొనసాగుతుంది. సినిమా పెద్దదా చిన్నదా అని చూడకుండా ట్రైలర్, టీజర్ లు ఆకట్టుకునేలా ఉంటే సినిమా పై ఎన్నో అంచనాలు పెరుగుతున్నాయి. ఇక అలాగే ఇటీవల వచ్చిన చిన్న సినిమా ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా టీజ‌ర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీధర్ గాదె దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించారు. అంతేకాకుండా ఈ సినిమాకు కథను కూడా హీరోగా నటించిన కిరణ్ అబ్బవరం అందించడం విశేషం. ఇక ఈ చిత్రంలో టాక్సీవాలా సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్న అందాల తార ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. 

మరో వైపు ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా సినిమా నుండి విడుదలైన టీజర్ మరియు పాటలే సినిమాకు ప్రమోషన్ గా నిలిచాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన చుక్కల చున్నీతో నన్ను పక్కకు లాగా వే అనే పాట సూపర్ హిట్ గా నిలిచింది. ఈ పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సినిమా గురించి భాగా ప్ర‌చారం జ‌రింగింది. ఇది ఇలా ఉండగా కిరణ్ అబ్బవరం ఇప్పటికే రాజావారు రాణి వారు అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరోవైపు ఎస్ ఆర్ కళ్యాణమండపం టీజ‌ర్ లో యూత్ ను అట్రాక్ట్ చేసే డైలాగులు మరియు ఫైట్ లతో అదరగొట్టారు.

ఇక ఈ సినిమా చిన్న సినిమా అయినప్పటికీ లాక్ డౌన్ కాలంలో ఓటీటీ ఆఫ‌ర్లు వ‌చ్చినా రిలీజ్ చేయ‌కుండా థియేటర్ రిలీజ్ కోస‌మే వేచి చూసారు. ఇక ప్ర‌స్తుతం క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గిన‌ నేపథ్యంలో ఆగస్ట్ 6న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరోవైపు సినిమా ప్రమోషన్ల లో భాగంగా ప్రస్తుతం సినిమా నుండి పోస్టర్లు విడుదల చేస్తూ చిత్ర యూనిట్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా కిరణ్ అబ్బ‌వ‌రం పుట్టినరోజు సందర్భంగా మరో టీజర్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇక ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి మరి.



నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్న యువ హీరో... ?

తనికెళ్ళ భరణి సినీ ప్రవేశం ఎలా జరిగిందో తెలుసా ?

త్రివిక్రమ్ కోసం మెగా హీరో ట్రయల్స్..?

RRR ఆఖరి పాటకి అన్ని కోట్ల ఖర్చు..!

ఈ వీకెండ్ ఓటిటిలో రిలీజ్ కానున్న మూవీస్ ఇవే !

అక్కాచెళ్లెల్ల‌తో జోడీ క‌ట్టిన రికార్డు వెంక‌టేష్‌దే ?

బిగ్ షాక్‌: ప‌వ‌న్ సినిమా నుంచి ఆయ‌న అవుట్ ?

RAPO19 టీంకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన శంకర్....

అఖండ నుండి త్వరలో అదిరిపోయే అప్డేట్.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>