MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balu2617fce3-a2ee-4d85-b830-eefb05853e32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balu2617fce3-a2ee-4d85-b830-eefb05853e32-415x250-IndiaHerald.jpgఅద్భుతమైన గాయకుడు బాలు. అసలు ఈ మాట చెప్పడం కూడా అనవసరం. బాలు అంటే చాలు అందరికీ ఆ మాధుర్యమైన గొంతు మదిలో మెదులుతుంది. సుమధుర భావాలను హృదయాన నింపేస్తుంది. బాలు ఏడు పదుల వయసులోనూ పాటలు పాడుతూనే ఆలా ఈ లోకాన్ని వీడారు. balu{#}Jandhyala Ravishankar;Sangeetha;Singer;Music;Telugu;Darsakudu;Director;Cinemaఆ దర్శకుడు అంటే బాలూకి అంత ఇష్టం... ?ఆ దర్శకుడు అంటే బాలూకి అంత ఇష్టం... ?balu{#}Jandhyala Ravishankar;Sangeetha;Singer;Music;Telugu;Darsakudu;Director;CinemaWed, 14 Jul 2021 20:00:00 GMTఅద్భుతమైన గాయకుడు బాలు. అసలు ఈ మాట చెప్పడం కూడా అనవసరం. బాలు అంటే చాలు అందరికీ ఆ మాధుర్యమైన గొంతు మదిలో మెదులుతుంది. సుమధుర భావాలను హృదయాన నింపేస్తుంది. బాలు ఏడు పదుల వయసులోనూ పాటలు పాడుతూనే ఆలా ఈ లోకాన్ని వీడారు.

అందులో అచ్చంగా అయిదున్నర పదుల కాలం సినీ సంగీతానికే అంకితం చేశారు. అందువల్ల బాలు గురించి చెప్పుకున్నపుడల్ల తెలుగు సినిమా చరిత్రను ఎక్కడో ఒక చోట అలా చదువుతూనే ఉన్నట్లుగా ఉంటుంది. ఇక బాలు గాయకుడిగా లెక్కలేనంతమంది దర్శకులతో పనిచేశారు. ఇక సంగీతదర్శకుడిగా ఆయన రికార్డు ఉంది. నలభై నుంచి యాభై సినిమాల దాకా బాలూ మ్యూజిక్ అందించారు. అందులో బాలుని సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన దాసరికి కూడా కొన్ని సినిమాలు చేశారు.

అయితే దర్శకుడు జంధ్యాలకు బాలు ఎక్కువ సినిమాలు సంగీతం అందించారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా ముద్దుల మనవరాలు. ఈ మూవీలో క్లాసిక్ మ్యూజిక్ ఇచ్చి బాలు ఆకట్టుకున్నారు. ఆ తరువాత పడమటి సంధ్యారాగం సినిమాకు కూడా బాలు చక్కని సంగీతమే అందించారు. ఈ మూవీ తనకు ఎంతో ఇష్టమైనది అని బాలు ఎపుడూ చెబుతూ ఉంటారు. ఇదే వరసలో వివాహ భోజనంబు, చూపులు కలసిన శుభవేళ. నీకూ నాకూ పెళ్ళంట వంటి సినిమాలకు కూడా బాలు సంగీతం అందించి జంధ్యాల మెప్పు పొందారు. అయితే జంధ్యాలకు బాలు చేసిన పడమటి సంధ్యారాగం సినిమాలో ఒక విశేషం ఉంది. అమెరికాలో ఫస్ట్ సంగీతం చేసిన సినిమా కూడా ఇదే. అంతే కాదు. రెండు మూడు సంగీత పరికరాలతో పిబరే రామరసం పాటకు బాలు చేసిన సంగీతం ఎప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ మూవీ మొత్తానికి ఈ సాంగ్ హైలెట్ గా చెప్పుకోవాలి. బాలు  భక్తిగా ఆ శ్రీరాముడికి అంకితం ఇచ్చిన పాట కూడా ఇదే అని చెబుతారు.







బీడి కట్టలపై ఫుట్‌ బాల్‌ ఆటగాళ్ల సిత్రాలు...?

అద్భుతమైన గాయకుడు బాలు. అసలు ఈ మాట చెప్పడం కూడా అనవసరం. బాలు అంటే చాలు అందరికీ ఆ మాధుర్యమైన గొంతు మదిలో మెదులుతుంది. సుమధుర భావాలను హృదయాన నింపేస్తుంది. బాలు ఏడు పదుల వయసులోనూ పాటలు పాడుతూనే ఆలా ఈ లోకాన్ని వీడారు.

నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్న యువ హీరో... ?

తనికెళ్ళ భరణి సినీ ప్రవేశం ఎలా జరిగిందో తెలుసా ?

త్రివిక్రమ్ కోసం మెగా హీరో ట్రయల్స్..?

RRR ఆఖరి పాటకి అన్ని కోట్ల ఖర్చు..!

కూతురి సూసైడ్ గురించి స్పందించిన అన్నపూర్ణ...

ఈ వీకెండ్ ఓటిటిలో రిలీజ్ కానున్న మూవీస్ ఇవే !

అక్కాచెళ్లెల్ల‌తో జోడీ క‌ట్టిన రికార్డు వెంక‌టేష్‌దే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>