PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-ex-mla-updates-in-ycpdd0ad6db-235c-4e7f-86ca-717420688f25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-ex-mla-updates-in-ycpdd0ad6db-235c-4e7f-86ca-717420688f25-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నాయకుల పరిస్థితి ఏమిటో తెలిసిందే. పార్టీకి అధికారం లేకపోవడంతో కిక్కురుమనకుండా ఉన్నారు. ఇక సాధారణ కార్యకర్తల పరిస్థితి సరేసరి. వీరిని పట్టించుకునే నాధుడే లేడు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలతో చంద్రబాబు పోటీ చేసినా ప్రజలు తన పాలనపై విసిగిపోయి, దారుణంగా చరిత్రలో గుర్తుండిపోయే ఓటమిని ఇచ్చారు.TDP EX MLA UPDATES IN YCP{#}bhavana;politics;CBN;Assembly;Andhra Pradesh;Reddy;Telangana;TDP;Jagan;Doctor;Party;Teluguవైసీపీలోకి జంప్ అయిన తెలుగు తమ్ముళ్ల పరిస్థితి ఏంటి .. ?వైసీపీలోకి జంప్ అయిన తెలుగు తమ్ముళ్ల పరిస్థితి ఏంటి .. ?TDP EX MLA UPDATES IN YCP{#}bhavana;politics;CBN;Assembly;Andhra Pradesh;Reddy;Telangana;TDP;Jagan;Doctor;Party;TeluguWed, 14 Jul 2021 12:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నాయకుల పరిస్థితి ఏమిటో తెలిసిందే. పార్టీకి అధికారం లేకపోవడంతో కిక్కురుమనకుండా ఉన్నారు. ఇక సాధారణ కార్యకర్తల పరిస్థితి సరేసరి. వీరిని పట్టించుకునే నాధుడే లేడు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలతో చంద్రబాబు పోటీ చేసినా ప్రజలు తన పాలనపై విసిగిపోయి, దారుణంగా చరిత్రలో గుర్తుండిపోయే ఓటమిని ఇచ్చారు. దీనితో మొహం చెల్లక ఆంధ్రప్రదేశ్ లోనే లేకుండా తెలంగాణ రాష్ట్రంలో తల దాచుకుంటున్నాడు. అయితే సాధారణంగా పార్టీ నుండి ఇంకొక పార్టీకి జంప్ అయ్యే అలవాటున్న లీడర్స్ కొందరు టీడీపీ ఓడిపోగానే, ప్రత్యామ్నాయంగా అధికార వైసీపీలోకి జంప్ అయ్యారు. వారిలో ముఖ్యంగా ఇప్పుడు పరిపాలనా రాజధానిగా మార్చాలి అనుకుంటున్న విశాఖపట్నానికి చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు. అయితే వీరు అనుకున్నట్లు మాకేదో ప్రయోజనం కలుగుతుందని భావించినా అసలుకే మోసం వచ్చేలా ఉంది.

వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏడాది కావస్తున్నా వీరికి పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత కనిపించడం లేదు. ఎందుకు వైసీపీలోకి వచ్చామురా అని లోలోపలే బాధపడుతున్నారు. వారెవరో కాదు డాక్టర్ ఎస్ ఏ రహమాన్, పంచకర్ల రమేష్ బాబు, తిప్పల గురుమూర్తి రెడ్డి మరియు పిన్నింటి లక్ష్మిలు. అయితే వీరెక్కడ ఉన్నారనేది కూడా తెలియని పరిస్థితి. ఒక్క అధికార పార్టీలో ఉన్నామనే భావన తప్ప, ఇంకెటువంటి ప్రయోజనం లేదనే చెప్పాలి. జగన్ ఏదో చేస్తాడని నమ్మి వచ్చిన వీరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విషయం తెలిసిపోయినట్టుంది. పైగా జగన్ ఎవరికి ఎటువంటి పదవులు ఇవ్వాలి ? ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాలపై మంచి పట్టుంది. కాబట్టి వీరి ఆశలకు తెరపడినట్లే అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

ఇప్పటికే పార్టీలో సంవత్సరాలుగా విశ్వాసంగా ఉన్న వారిని వదిలి వీరికి పదవులు కట్టబెడతాడా అంటే కష్టమే ? పైగా వీరికేమైనా పార్టీకి సంబంధించి పదవులిచ్చినా వచ్చే ఎన్నికల్లో పార్టీ మారని గ్యారంటీ లేదు. కాబట్టి వీరు ప్రస్తుతానికి పార్టీలు ఒక శిలా విగ్రహంగా ఉండడం తప్పితే పెద్దగా చేసేదేమీ లేదు. మరి ముందు ముందు ఈ తెలుగు తమ్ముళ్ల పరిస్థితి ఏమి అవుతుందో చూడాలి. ఏమైనా పదవులు ఇస్తారా అని ఆశతో ఉన్నారు. అందుకే పెద్దలు ఒక మాట చెబుతుంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా నమ్మిన పార్టీని, మనల్ని రాజకీయంగా ఆదరించిన పార్టీని వదలకూడదు అని, కానీ ఇప్పుడు అంతా స్వార్ధ రాజకీయాలు అయిపోయాయి. ఒక ఎమ్మెల్సీ పదవి లేదా ఏదైనా పార్టీ పదవి ఇస్తే చాలు, వెంటనే పార్టీ మారిపోతున్నారు. ఇలాంటి రాజకీయాలకు స్వస్తి పలకాలి. మరి ఈ తెలుగు తమ్ముళ్ల పరిస్థితి ఏమి అవుతుందో చూడాలి.  

 


 

 



వైయస్ అభిమానులు షర్మిల వెంట నడుస్తారా..?

ఆ విషయంలో ఏపీ టాప్!

నాగార్జున హర్ట్ అవుతాడని తెలిసినా ఏజెంట్ కోసం సురేందర్ రెడ్డి అలా!!

సీమలో మళ్ళీ నాటు బాంబులు...?

బ్రేకింగ్: దీక్షకు వైసీపీ ఎంపీ...?

బిగ్ బ్రేకింగ్ : జల వివాదంలో జగన్ కీలక నిర్ణయం

విద్యార్థులకు గుడ్ న్యూస్..డిగ్రీలో ద్విభాషా పుస్తకాలు.. !

తెరాస నేతలకు కేటీఆర్ ఫోన్ లు...?

రాజస్థాన్ లో `క‌ప్పా`వేరియంట్ క‌ల‌కం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>