PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/strong-bad-impression-on-jagan-crieated-by-babu6e023ae7-f988-4202-9de6-d5addbfd0fc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/strong-bad-impression-on-jagan-crieated-by-babu6e023ae7-f988-4202-9de6-d5addbfd0fc7-415x250-IndiaHerald.jpgజగన్ సర్కార్ మీద చంద్రబాబు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. జూమ్ యాప్ బంధనాలు తొలగించుకుని వచ్చిన బాబు ఫ్రెష్ గా ఉన్నారు. లైవ్ లో జనాలను చూస్తే ఆయన ఎలా ధాటీగా మాట్లాడతారో తెలిసిందే. ముందుగా పార్టీ నాయకులను కలుసుకుంటూ తమ్ముళ్ళతో ఆయన మాట్లాడుతున్న మాటలు వైసీపీ సర్కార్ కి తూటాలుగా మారుతున్నాయి. babu{#}Sea;Aqua;YCP;CM;Jagan;CBN;Coronavirus;Smart phone;Andhra Pradesh;Partyజగన్ మీద ఆ ముద్ర బలంగా వేస్తున్న బాబు ... ?జగన్ మీద ఆ ముద్ర బలంగా వేస్తున్న బాబు ... ?babu{#}Sea;Aqua;YCP;CM;Jagan;CBN;Coronavirus;Smart phone;Andhra Pradesh;PartyWed, 14 Jul 2021 19:58:34 GMTజగన్ సర్కార్ మీద చంద్రబాబు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. జూమ్ యాప్ బంధనాలు తొలగించుకుని వచ్చిన బాబు ఫ్రెష్ గా ఉన్నారు. లైవ్ లో జనాలను చూస్తే ఆయన ఎలా ధాటీగా మాట్లాడతారో తెలిసిందే. ముందుగా పార్టీ నాయకులను కలుసుకుంటూ తమ్ముళ్ళతో ఆయన మాట్లాడుతున్న మాటలు వైసీపీ సర్కార్ కి తూటాలుగా మారుతున్నాయి.

ఇదిలా ఉంటే జగన్ కి ఏమీ తెలియదు అని మొదటి నుంచి చంద్రబాబు గట్టి నమ్మకం. ఆ మాటకు వస్తే చంద్రబాబు తానే చక్కని పాలకుడిని అని కూడా విశ్వసిస్తారు. తనను మించిన  ఆడ్మినిస్ట్రేటర్  ఎక్కడా లేడు అని కూడా ఆయన భావిస్తారు. కరోనా తన టైమ్  లో వచ్చి ఉంటే ఈ పాటికి దాని అంతు చూసేవాణ్ణి అని చంద్రబాబు చెబుతున్నారు. జగన్ కరోనాను ఎదుర్కోవడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారని అంటున్నారు.

అదే విధంగా జల వివాదాలు కూడా జగన్ చేతకాని తనం వల్లనే వస్తున్నాయని అంటున్నారు. పొరుగు రాష్ట్రం సీఎం తో జగన్ చర్చించవచ్చు కదా. కనీసం ఫోన్ లో అయినా మాట్లాడవచ్చు కదా అని చంద్రబాబు విమర్శిస్తున్నారు. క్రిష్ణా జలాలు, రైతులకు అందాల్సిన జలాలు పూర్తిగా సముద్రం పాలు అవుతూంటే వాటిని కాపాడుకోవాల్సిన జగన్ పూర్తిగా అసమర్ధ సీఎం గా మిగిలిపోయారని కూడా గట్టిగానే సెటైర్లు వేస్తున్నారు.

మొత్తానికి చంద్రబాబు జగన్ని విమర్శిస్తున్నట్లుగానే బయటకు  కనిపిస్తూనే తాను ఏపీ సీఎం కాకపోవడం వల్ల ఎంత నష్టం వాటిల్లిందో ప్రజలకు నేరుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ కి ఏమీ చేత కాదు, ఆయన మంచి పాలకుడు కాదు అంటూ బాబు గట్టిగానే ముద్ర వేస్తున్నారు. మరి దీనిని జనాలు ఎంతమేరకు నమ్ముతారు అన్నది చూడాల్సిందే. ఏపీ అభివృద్ధి ఆగిపోయిందని, ప్రస్తుత పాలకులకు ఏమీ తెలియదు అన్న నినాదాన్ని జనంలోకి బలంగా పంపించాలన్న‌దే బాబు వ్యూహం.







రాష్ట్రపతి రేసులో పవార్.. క్లారిటీ ఇచ్చేశారు!

పార్లమెంట్ సమావేశాలకి కాంగ్రెస్ స్కెచ్ రెడీ

జగన్ సర్కార్ మీద చంద్రబాబు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. జూమ్ యాప్ బంధనాలు తొలగించుకుని వచ్చిన బాబు ఫ్రెష్ గా ఉన్నారు. లైవ్ లో జనాలను చూస్తే ఆయన ఎలా ధాటీగా మాట్లాడతారో తెలిసిందే. ముందుగా పార్టీ నాయకులను కలుసుకుంటూ తమ్ముళ్ళతో ఆయన మాట్లాడుతున్న మాటలు వైసీపీ సర్కార్ కి తూటాలుగా మారుతున్నాయి.

బిజినెస్ : ముత్యాల సాగుతో రూ. లక్షల్లో ఆదాయం..

నెట్టింట నవ్వులు పూయిస్తున్న ట్రాఫిక్ పోలీసుల మీమ్...

ఢిల్లీ టూర్ : ఈటలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన అమిత్ షా ?

అవును నిజమే.. జాగ్రత్తగా ఉండండి.. హెచ్చరించిన ఎస్బిఐ?

ఇప్పుడు నా టార్గెట్ అదే.. ధావన్ కామెంట్స్?

ఇండియాలో ఇదే మొదటిసారి!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>