PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona-survey-lo-shocking-vastavalu25b66bb9-8372-42f8-966e-f79f3507634f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona-survey-lo-shocking-vastavalu25b66bb9-8372-42f8-966e-f79f3507634f-415x250-IndiaHerald.jpgకరోనా గురించి మన అవగాహన రోజురోజుకు పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే.. దీని గురించి రోజుకో అప్‌డేట్ వస్తోంది. కొత్త వ్యాధి కావడంతో దీని గురించి పూర్తి అవగాహన ఇంకా నిపుణులకే లేదు. ఈ సమయంలో దీన్ని అవగాహన చేసుకునేందుకు కొన్ని సర్వేలు ఉపయోగ పడతాయి. ఇటీవల దేశంలోనే మొదటిసారిగా కొవిడ్‌ చికిత్సానంతర సమస్యలపై నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో అనేక షాకింగ్ వాస్తవాలు తెలిశాయి. దాదాపు 5 వేల మందికి పైగా ఈ సర్వేలో పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నారు. ఈ సర్వేలో తేలిందేమిటంటే.. కొవిడ్‌ నుంచి కోలుకోవడానికCORONA{#}oxygen;Coronavirusకరోనా సర్వేలో షాకింగ్ విషయాలు.. తప్పక తెలుసుకోండి..!కరోనా సర్వేలో షాకింగ్ విషయాలు.. తప్పక తెలుసుకోండి..!CORONA{#}oxygen;CoronavirusTue, 13 Jul 2021 10:11:18 GMTకరోనా గురించి మన అవగాహన రోజురోజుకు పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే.. దీని గురించి రోజుకో అప్‌డేట్ వస్తోంది. కొత్త వ్యాధి కావడంతో దీని గురించి పూర్తి అవగాహన ఇంకా నిపుణులకే లేదు. ఈ సమయంలో దీన్ని అవగాహన చేసుకునేందుకు కొన్ని సర్వేలు ఉపయోగ పడతాయి. ఇటీవల దేశంలోనే మొదటిసారిగా కొవిడ్‌ చికిత్సానంతర సమస్యలపై నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో అనేక షాకింగ్ వాస్తవాలు తెలిశాయి.


దాదాపు 5 వేల మందికి పైగా ఈ సర్వేలో పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నారు. ఈ సర్వేలో తేలిందేమిటంటే.. కొవిడ్‌ నుంచి కోలుకోవడానికి సగం మందికి ఒక నెల నుంచి 3 నెలల సమయం పట్టిందట. మూడోవంతు మందికి మాత్రం 3 నెలలు దాటిందట. కేవలం ఐదో శాతం మంది మాత్రం నెలలోనే కోలుకున్నారట. ఇక కరోనా వచ్చిన వారిలో 38 శాతం మంది ఆసుపత్రిలో చికిత్స పొందారు. కరోనా వచ్చిన వారిలో 34 శాతం మందికి ఆక్సిజన్‌ సేవలు అవసరమయ్యాయట. అంటే దాదాపు మూడో వంతు మందికి ఆక్సిజన్ అవసరమైందన్నమాట.


కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరి కోలుకున్న వారిలో మళ్లీ సగం మంది ఏదో ఒక అనారోగ్య సమస్య బారిన పడ్డారట. ఆసుపత్రిలో చేరకుండానే కరోనా నుంచి  కోలుకున్న వారిలోకూడా  37 శాతం మందిలో ఏదో ఒక ఆరోగ్య సమస్య కనిపించిందట. కొవిడ్‌ చికిత్స అనంతరం సమస్యలపై సరైన రీతిలో చికిత్స లభించలేదని 40 శాతం మంది చెప్పారట. ఇక కరోనా చికిత్స సమయంలో ఆక్సిజన్‌ చికిత్స, స్టెరాయిడ్‌ ఔషధాలను వినియోగించిన వారిలో ఎక్కువ మందికి మళ్లీ సమస్యలు వచ్చాయట.


ఇక ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందినవారిలో 75 శాతం మంది స్టెరాయిడ్‌ మందులు ఇచ్చారట. ఆక్సిజన్‌ అవసరం లేని వారి కూడా స్టెరాయిడ్‌ మందులు వాడారట. 2 శాతం మంది ఇప్పటికీ స్టెరాయిడ్స్ వాడుతున్నారట. కరోనా నుంచి కోలుకున్న వారిలో 65 శాతం మంది నీరసం, నిస్సత్తువతో బాధపడ్డారట. ఇక 30 శాతం మంది ఒళ్లునొప్పులతో బాధపడ్డారట.





కరోనా కొత్త వ్యాధి కావడంతో దీని గురించి పూర్తి అవగాహన ఇంకా నిపుణులకే లేదు. ఈ సమయంలో దీన్ని అవగాహన చేసుకునేందుకు కొన్ని సర్వేలు ఉపయోగ పడతాయి. ఇటీవల దేశంలోనే మొదటిసారిగా కొవిడ్‌ చికిత్సానంతర సమస్యలపై నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో అనేక షాకింగ్ వాస్తవాలు తెలిశాయి.

రామ్ చరణ్ డ్రైవర్ నెల జీతం అంతనా..!

రానా మొహమాటం... రంగంలోకి సురేష్ బాబు ! 10 AM

ఈ ఏడాది కూడా ఆన్లైన్ లోనే అడ్మిషన్స్?

కొవిడ్‌ నుంచి కోలుకున్నా ఏమాత్రం ఏమరుపాటు తగదంటున్నారు నిపుణులు. ఎందుకంటే కరోనా నుంచి కోలుకున్న 41.8 శాతం మందిలో ఏదొక సమస్య ఉంటోందని గుర్తు చేస్తున్నారు. సరైన సమయంలో చికిత్స అందించడం అవసరమంటున్నారు.

కేబినెట్ భేటీ..ఉద్యోగాల గురించి కీలక ప్రకటన?

అన్ని కోట్లు దానం చేసిన తెలుగు ప్రవాసులు..?

కరోనా కాటుకు బాలింతలు విల విల... కారణం ఇదే ?

చైనాకు చెక్ పెట్టేందుకు ఆ దేశాల సరికొత్త ఐడియా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>