PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cheating6ada4f73-cda7-4800-bdb4-59a081dd697e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cheating6ada4f73-cda7-4800-bdb4-59a081dd697e-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ తీవ్రతను ఆయుర్వేద మూలికలు.. తైలాలు గణనీయంగా తగ్గిస్తాయని ప్రపంచ దేశాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని తమకు అనుగుణంగా మార్చుకున్న నైజీరియన్లు.. ఆయుర్వేదిక్ డాక్టర్లు, ఫార్మా కంపెనీల ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. తైలాలు, ఆయుర్వేద మూలికల మిశ్రమ సూత్రాలను తాము కొనుగోలు చేస్తామని వైద్యులకు, ఉద్యోగులకు ఫోన్లు చేసి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. కేవలం పది రోజుల వ్యవధిలో ఇద్దరి భారతీయులను చాకచక్యంగా మోసం చేసి అక్షరాల 52 లక్షల రూపాయలు కాజేశారు. అయితే 11 లక్షల రూపాయలుcheating{#}coronavirusగింగో తైలం పేరుతో అన్ని లక్షల రూపాయల మోసం..!గింగో తైలం పేరుతో అన్ని లక్షల రూపాయల మోసం..!cheating{#}coronavirusTue, 13 Jul 2021 12:00:00 GMTకరోనా వైరస్ తీవ్రతను ఆయుర్వేద మూలికలు.. తైలాలు గణనీయంగా తగ్గిస్తాయని ప్రపంచ దేశాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని తమకు అనుగుణంగా మార్చుకున్న నైజీరియన్లు.. ఆయుర్వేదిక్ డాక్టర్లు, ఫార్మా కంపెనీల ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. తైలాలు, ఆయుర్వేద మూలికల మిశ్రమ సూత్రాలను తాము కొనుగోలు చేస్తామని వైద్యులకు, ఉద్యోగులకు ఫోన్లు చేసి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. కేవలం పది రోజుల వ్యవధిలో ఇద్దరి భారతీయులను చాకచక్యంగా మోసం చేసి అక్షరాల 52 లక్షల రూపాయలు కాజేశారు.




అయితే 11 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఒక బాధితుడు హైదరాబాద్ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి నైజీరియన్లు ముంబయి, ఢిల్లీ లలో ఉంటూ మోసాలకు పాల్పడుతున్నారని కనుగొన్నారు. తైలాలు, మూలికలు, ఆయుర్వేద మందులు అని ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు ఇస్తామని ఆఫర్ ఇస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని, వాట్సాప్ నంబర్ (‌‌9490616555) కి గుర్తుతెలియని వ్యక్తుల ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.



అయితే కొద్ది నెలల క్రితం మెహిదీపట్నంలో నివసిస్తున్న ఒక ఆయుర్వేద వైద్యురాలికి జేమ్స్‌ మారియా అనే వ్యక్తి ఫోన్‌ చేసి.. తాను లండన్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ప్రతినిధిగా పనిచేస్తున్నానని.. తమ కంపెనీ ఆయుర్వేద మూలికలతో కరోనా విరుగుడు మందులు అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోందని.. మీ మూలికల మిశ్రమ ఫార్ములా తమకు చెబుతే ఇండియన్ కరెన్సీ లో ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని నమ్మబలికాడు. దీంతో మోసగాడి మాటలు నమ్మి ఆమె మొదటగా 25 లక్షల ఒక బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. అలాగే ఇంకోసారి రూ.16 లక్షలు ఆమె మోసగాడి బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు.



బర్కత్‌పురలో నివసిస్తున్న ఒక ఫార్మా ప్రతినిధిని కూడా నైజీరియన్ మోసగాళ్లు బురిడీ కొట్టించి లక్షల రూపాయలు కాజేశారు. గింగో తైలం పేరుతో ఒకసారి 1.80 లక్షల రూపాయలు, మరోసారి 7.20 లక్షల రూపాయలు కాజేశారు. మరో ఏసీపీ పేరుతో ఫోన్ చేసి తైలం అమ్మడం నిషేధం అని.. నీపై కేసు నమోదు అయిందని రెండు లక్షల రూపాయలు కాజేశారు. అనంతరం 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి బెదిరింపులతో విసిగిపోయిన సదరు బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. 



గింగో తైలం పేరుతో అన్ని లక్షల రూపాయల మోసం..! సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ పాలిటిక్స్ కేటగిరీలో చూడండి.

ఒలంపిక్స్ పై ఇంట్రెస్ట్ లేదు.. దిగ్గజ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్?

కరోనా నుంచి కోలుకున్నారా.. ఈ విషయాల్లో జాగ్రత్త..?

కొవాగ్జిన్‌ టీకాకి త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం..?

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు?

గుడ్ న్యూస్ : సత్ఫలితాలిస్తున్న మరో వ్యాక్సిన్?

అలా చేయడం ప్రమాదమే.. వ్యాక్సిన్ ఫై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు?

పోలీసుకు బై... బై..ఇక కలెక్టర్ పాత్రలో స్టార్ హీరో?

కరోనా సర్వేలో షాకింగ్ విషయాలు.. తప్పక తెలుసుకోండి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>