PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jil-biden-tokyo-olympicsbd76165f-34f7-4a70-aef0-da9533028436-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jil-biden-tokyo-olympicsbd76165f-34f7-4a70-aef0-da9533028436-415x250-IndiaHerald.jpgఈ సారి జరుగబోయే టోక్యో ఒలింపిక్స్ కు ముఖ్య అతిథి రాబోతున్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సతీమణి.. జిల్ బైడెన్ ఒంటరిగా ఈ వేడుకలకు హాజరుకానున్నారు. కరోనా ప్రభావంతో ప్రేక్షకులను ఎవరినీ ఈ ఈవెంట్ కు పర్మీషన్ ఇవ్వకపోగా.. అతి తక్కువ మందికే అవకాశం కల్పిస్తున్నారు. jil biden tokyo olympics{#}Japan;American Samoa;Jil;Husband;Tokyo;Coronavirus;Audienceఒలింపిక్స్ కు ముఖ్య అతిథిగా..!ఒలింపిక్స్ కు ముఖ్య అతిథిగా..!jil biden tokyo olympics{#}Japan;American Samoa;Jil;Husband;Tokyo;Coronavirus;AudienceTue, 13 Jul 2021 22:42:55 GMTఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, ఆ దేశ ప్రథమ మహిళ జిల్ బైడెన్ టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకకు హాజరుకానున్నారు. తన భర్త బైడెన్ లేకుండానే ఈమె ఈ మెగా క్రీడలకు వెెళ్లనున్నారు. కరోనా కారణంగా జపాన్ లో ఎమర్జెన్సీ విధించగా.. ప్రేక్షకులు లేకుండా ఈ సారి ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఈ మెగా క్రీడలకు దాదాపుగా 11వేల మంది క్రీడాకారులు హాజరుకానున్నారు.

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అతలాకుతలమయ్యాయి. గతేడాది క్రీడాభిమానులకు ఉర్రూతలూగించాల్సిన ఒలింపిక్స్ ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. అయితే  ఎట్టకేలకు ఈ నెల అనగా జులై 23న టోక్యో ఒలింపిక్స్ అట్టహాసంగా మొదలు కానున్నాయి.  అమెరికా ప్రథమ మహిళగా ఇతర దేశాలకు వెళ్లడం జిల్ బైడెన్ కు ఇది మొదటిసారి. గతంలో 2010లో ఒలింపిక్స్ కు వెళ్లారు.అవి అప్పట్లో జో బైడెన్ అధ్యక్షతన జరిగాయి. కెనడాలోని వాంకోవర్ లో జరిగిన వింటర్ ఒలింపిక్స్ కు ఆ దంపతులు అ హాజరయ్యారు.

మరోవైపు టోక్యో ఒలింపిక్స్ కు సర్వం సిద్ధమైంది. మరోవైపు ప్రపంచ దేశాలు తమ క్రీడాకారులను పోటీలో దింపేందుకు రెడీగా ఉన్నాయి. మన దేశం నుంచి అయితే దాదాపు 117మంది అథ్లెట్లు ఆ క్రీడా సంగ్రామంలో పాల్గొనున్నారు. ఇక మన పొరుగు దేశం అయిన చైనా కూడా అదే విధంగా అథ్లెట్లను సిద్ధం చేసిందని సమాచారం. వీలైనంత ఎక్కువ మందిని తమదేశం నుండి ప్రాతినిథ్యం వహించేలా చేసి ప్రపంచలో కీర్తికెక్కాలని చూస్తోంది. అయితే 224ఈవెంట్స్ కోసం 318మంది ఎంపికయినట్టు సమాచారం.

ఇక ఈ సంవత్సరం ఆటల్లో కరాటే, సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్ లు కొత్తగా వచ్చిచేరాయి. మరోవైపు ఒలింపిక్ టార్చ్ రిలే ఫుకుషిమాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ప్రోగ్రామ్ కు ప్రేక్షకులను ఆహ్వానించడం లేదు. కేవలం ఇళ్లలోనే ఉండి తమ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిందే. కరోనా విజృంభిస్తోన్న దృష్ట్యా ఒలింపిక్స్ నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి టోక్యో ఒలింపిక్స్ కు ఈ సారి అమెరికా ప్రథమ మహిళ రావడంతో ఆ దేశవాసులు సంబరపడిపోతున్నారు.

 

 





పెంపుడు పిల్లి మిస్సింగ్.. ఆచూకీ తెలిపితే నగదు..

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వేర్వేరు కంపెనీలు తయారీ చేసిన కరోనా టీకాలను వేర్వేరు డోసుల్లో తీసుకోవడం ప్రమాదకరమని తేల్చి చెప్పింది.

రష్యాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రష్యాలో కొత్తగా రికార్డుస్థాయిలో మళ్లీ 780 వరకూ కరోనా మరణాలు సంభవించాయి. కోవిడ్ మహమ్మారి మొదలైన నాటి నుంచి ఒక్క రోజులో నమోదైన మరణాల్లో ఇదే అత్యధికంగా అక్కడి నిపుణులు చెబుతున్నారు.

వరుణ్ తేజ్ మొదటి సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

ముఖ్యనేత మృతి !

బాస్ ఈజ్ బ్యాక్.. తెలుగు తమ్ముళ్లలో జోష్

ఆ బాలీవుడ్ హీరోని తెగ వాడేస్తున్న మంచు బ్రదర్స్..!!

పర్యటక ప్రాంతానికి అనుమతించటం థార్డ్ వేవ్ ను ఆహ్వానించటమే..!!

ఒలంపిక్స్ ఆటగాళ్లతో మోడీ మీటింగ్... ఏం చెప్పారంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>