MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-babu080b7196-69a2-4e27-80ca-4717d07d362e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-babu080b7196-69a2-4e27-80ca-4717d07d362e-415x250-IndiaHerald.jpgమెగా బ్రదర్ నాగబాబు ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. ఎవరో ఏదో అనుకుంటారని ఆయన సందేహించకుండా తన మనసులో ఉన్నది ఉన్నట్లు ఎప్పుడూ బయట పెడుతుంటారు. అయితే ఆ ముక్కుసూటితనం తోనే ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా మందికి విపరీతమైన కోపం కూడా తెప్పించాయి. ఒకానొక సమయంలో ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. అయితే ఇటువంటి వివాదాస్పద నటుడు నాగబాబు గురించి ఎవరికీ తెలియని ఒక కోణాన్ని లేడీ ఆర్టిస్ట్ అద్దంకి మోహన పద్మ అలియాస్ బొంబాయి పద్మ బయటపెట్టారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో naga babu{#}nagababuనాగబాబు అసలు రూపం బయటపెట్టిన లేడీ ఆర్టిస్ట్..?నాగబాబు అసలు రూపం బయటపెట్టిన లేడీ ఆర్టిస్ట్..?naga babu{#}nagababuTue, 13 Jul 2021 14:00:00 GMTఅద్దంకి మోహన పద్మ అలియాస్ బొంబాయి పద్మ బయటపెట్టారు.

ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగ బాబు వద్దకు వెళ్లిన వారెవరైనా సరే ఖాళీ చేతులతో తిరిగి రారని.. రిక్త హస్తాలతో పంపని పరమశివుడు నాగబాబు అని చెప్పుకొచ్చారు. ఆమె నాగబాబు ఔదార్యం గురించి ఇంకా మాట్లాడుతూ.. సినిమా అవకాశాలు లేక దుర్భేద్యమైన పరిస్థితులలో ఉన్నప్పుడు ఏదైనా అవకాశాలు ఇప్పించాలని తాను నాగబాబు ని సంప్రదించానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే సహాయం చేస్తారా అని అడిగిన వెంటనే నాగ బాబు తన పరిచయాల ద్వారా తనకు ఆఫర్స్ ఇప్పించారని ఆమె చెప్పుకొచ్చారు.

"నాకు సహాయం చేసినందుకు నాగ బాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వేషాలు లేవని వెళ్తే ఆయన నాకు వేషాలు ఇప్పించారు. నాకు ఒక్కరికే కాదు మాలాంటి చాలా మంది ఆర్టిస్టులకు వేషాలు ఇప్పించి వారి జీవితాలను నిలబెట్టారు. నాగ బాబు ఇతరులకు ఎంతలా సహాయం చేశారో నేను కూడా చూశాను. ఆయన ఒక వ్యక్తికి నా ముందే చాలా డబ్బులు దానం చేశారు. అయితే ఆయన పక్కన ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ 'నిజంగా మీరు అతనికి అంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. చూడ్డానికి బానే ఉన్నాడు. అతనికి అంత డబ్బు అవసరం ఉందని మేము అనుకోము' అని నాగబాబుతో అన్నారు. కానీ ఒక అబద్ధం చెప్తే చెప్పనివ్వండి. మన దగ్గరికి సహాయం అంటూ వచ్చిన వారు ఎవరూ కూడా ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళకూడదు. మనమేం కోట్ల రూపాయలు ఇవ్వడం లేదు కదా అని అన్నారు. అప్పుడే ఆయన లోని గొప్పతనం నాకు తెలిసింది. నాగ బాబు లాంటి వారు ఉండటం వల్లే మా లాంటి చిన్న వాళ్ళు జీవితాలను కొనసాగిస్తున్నారు” అని జూనియర్ ఆర్టిస్ట్ చెప్పారు.


హీరో వరుణ్ తేజ్ తండ్రి కన్న ఎంత ఎక్కువ ఆస్తులు సంపాదించాడో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>