PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/avinash530a2627-b05b-4f89-a18f-2448c7f72994-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/avinash530a2627-b05b-4f89-a18f-2448c7f72994-415x250-IndiaHerald.jpgబెజ‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ.. ప్ర‌త్యేక గుర్తింపు సాధించుకున్న యువ నేత‌, వైసీపీ నాయ‌కుడు దేవినేని అవినాష్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డం దాదాపు ఖ‌రారైంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మ‌రింత దూకుడు పెంచారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి ఎదురైన అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా ప‌రిస్థితులు త‌నకు వ్య‌తిరేకంగా రాకుండా చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నట్టు తెలుస్తోంది. avinash{#}Vijayawada;devineni avinash;Dookudu;East;Yuva;YCPఅవినాష్ త్రిముఖ వ్యూహం...!అవినాష్ త్రిముఖ వ్యూహం...!avinash{#}Vijayawada;devineni avinash;Dookudu;East;Yuva;YCPTue, 13 Jul 2021 04:00:00 GMTబెజ‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ.. ప్ర‌త్యేక గుర్తింపు సాధించుకున్న యువ నేత‌, వైసీపీ నాయ‌కుడు దేవినేని అవినాష్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డం దాదాపు ఖ‌రారైంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మ‌రింత దూకుడు పెంచారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి ఎదురైన అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా ప‌రిస్థితులు త‌నకు వ్య‌తిరేకంగా రాకుండా చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నట్టు తెలుస్తోంది.

ప్ర‌ధానంగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన య‌ల‌మంచిలి ర‌వి.. స‌హా ప‌లువురు నేతలను అవినాష్ క‌లు స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించిన య‌ల‌మంచిలి ర‌వి.. స్‌సబ్దుగా ఉన్నారు. త‌న‌కు టికెట్ ఇవ్వ‌లేదనే కార‌ణంగా.. గ‌త ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న క‌మ్మ వ‌ర్గాన్ని ఐక్యం చేయ‌లేద‌నే వాద‌న ఉంది. అదే స‌మయంలో రాజ‌కీయ ప‌రంగా కూడా నియోజ‌క‌వ‌ర్గంలో అసంతృప్తులు పెల్లుబికాయి. అయిన‌ప్పటికీ.. ర‌వి.. వాటిని స‌ర్దుబాటు చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న య‌ల‌మంచిలి ర‌విని క‌లిసి.. ప‌రిస్థితుల‌ను త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌కు రెండో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక‌వైపు గ‌త ప్ర‌భుత్వంలో నిలిచిపోయిన ప్రాజెక్టుల‌ను కొన‌సాగించ‌డంతోపాటు.. ఇప్పుడు ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారో.. తెలుసుకుని దానికి అనుగుణంగా అవినాష్ దూసుకుపోతున్నారు. ఇక‌, యువ‌త‌ను ఐక్యం చేసి.. త‌న‌వైపు తిప్పుకోవ‌డంలోనూ అవినాష్ ముందున్నారు. ప్ర‌స్తుతం ఇక్క‌డ రాజ‌కీయ ప‌రిణామాలు స్త‌బ్దుగా ఉన్నాయి.

టీడీపీ త‌ర‌ఫున గెలిచిన గ‌ద్దె రామ్మోహ‌న్ వివాదాస్ప‌ద నాయ‌కుడు కాన‌ప్ప‌టికీ.. చురుగ్గా మాత్రం వ్య‌వ‌హ‌రించ‌లేక పోతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటంతో నిధులు అందడం లేదు. అందుకే నియోజకవర్గంలో సరిగ్గా పనిచేయలేకపోతున్నారు. మొదట్లో కాస్త నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరిగిన గద్దె, ఇటీవల విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలో టీడీపే ఘోరంగా ఓడిపోయాక సైలెంట్ అయ్యారు.  దీంతో ఈ గ్యాప్‌ను ఫిల్ చేయ‌డంతోపాటు.. మూడు వ్యూహాల‌తో అవినాష్‌.. దూసుకుపోతుండ‌డం విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.



హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జగన్ మేనమామకు చెక్ పెట్టడం కష్టమేనా?

రేవంత్‌ని టార్గెట్ చేసిన జగన్ పార్టీ...బెనిఫిట్ ఎవరికో?

ఆ నానికి పవన్‌తో కష్టమేనా?

పవన్ మునుగుతున్నారు...బాబుని ముంచుతున్నారు...!

బెజ‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ.. ప్ర‌త్యేక గుర్తింపు సాధించుకున్న యువ నేత‌, వైసీపీ నాయ‌కుడు దేవినేని అవినాష్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డం దాదాపు ఖ‌రారైంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మ‌రింత దూకుడు పెంచారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి ఎదురైన అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా ప‌రిస్థితులు త‌నకు వ్య‌తిరేకంగా రాకుండా చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నట్టు తెలుస్తోంది.

తనకు తానే పోటీగా నిలుస్తున్న థమన్..!!

రెబెల్ ఎంపీ పై ప్రక్రియ మొదలైందా... ?

పెట్రోల్ ధరల పెరుగుదలపై స్పందించిన నిఖిల్.. ఏమన్నాడంటే.

క్లీవేజ్ షాతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రాజ్ తరుణ్ హీరోయిన్....



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>