అనూహ్యం: సీఎం జగన్ పర్యటన రద్దు -రేపు పోలవరం వెళ్లాల్సి ఉండగా, సీఎంఓ కీలక ప్రకటన

Andhra Pradesh

oi-Madhu Kota

|

ఆంధ్రప్రదేశ్ వరదాయిని పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న వైసీపీ ప్రభుత్వ ప్రకటనల నడుమ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందర్శన కీలకంగా మారింది. సీఎం జగన్ ఈనెల 14న(బుధవారం) పోలవరం వెళ్లాల్సి ఉండగా, ఆయన పర్యటన రద్దయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం నాడు కీలక ప్రకటన చేసింది.

కౌశిక్.. నువ్వో శ్రీరెడ్డివి -సీఎంతో 5 గం -టీపీసీసీగా రేవంత్ రెడ్డి తొలి విజయం -కాంగ్రెస్ టికెట్ పొన్నంకే!కౌశిక్.. నువ్వో శ్రీరెడ్డివి -సీఎంతో 5 గం -టీపీసీసీగా రేవంత్ రెడ్డి తొలి విజయం -కాంగ్రెస్ టికెట్ పొన్నంకే!

సీఎం జగన్ రేపు పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని భావించినప్పటికీ, అనూహ్య రీతిలో పర్యటన రద్దయింది. సీఎం పర్యటనకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరగ్గా, ఒక రోజు ముందు ఏకంగా షెడ్యూల్ రద్దు కావడం గమనార్హం. తొలుత సీఎం పర్యటన వాయిదా పడిందని, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మరోరోజు ఆయన పోలవరం వెళతారని వార్తలు వచ్చాయి. కానీ..

ap cm ys jagan Polavaram project visit cancelled due, says cmo

సీఎం పోలవరం పర్యటనపై ఆయన కార్యాలయం ఇచ్చిన అధికార ప్రకటనలో మాత్రం ఏకంగా పర్యటన రద్దయినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు, మూడు జిల్లాల కలెక్టర్లకు సమాచారాన్ని చేరవేసిన సీఎంవో.. పర్యటన రద్దుకు గల కారణాలను మాత్రం ప్రకటనలో పేర్కొనలేదు. హఠాత్తుగా పోలవరం పర్యటన రద్దు చేసుకున్న సీఎం.. రేపేదైనా మరో ముఖ్యమైన అంశంపై ఫోకస్ పెట్టే అవకాశముంది.

జగన్ సర్కారు ఖర్చులు: బ్లాక్, వైట్ బిల్లులా? -ఆ ప్రధానికి చంద్రబాబు భయపడలేదా?: సాయిరెడ్డి ధ్వజంజగన్ సర్కారు ఖర్చులు: బ్లాక్, వైట్ బిల్లులా? -ఆ ప్రధానికి చంద్రబాబు భయపడలేదా?: సాయిరెడ్డి ధ్వజం

పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేయాలని సీఎం జగన్ భావిస్తుండటం, వర్షాకాలం ఉపందుకోనున్న వేళ, ప్రాజెక్టును సందర్శించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. తాజా పర్యటన రద్దు కావడంతో సీఎం జగన్ పోలవరం షెడ్యూల్ మళ్లీ ఎప్పుడు ఉండబోయేది తేలాల్సి ఉంది.

English summary

Andhra Pradesh chief minister Jagan mohan reddy polavaram project visit has been cancelled. cm jagan is scheduled to visit polavaram polavaram on july 14th, i.e tomorrow. but his visit was unexpectedly cancelled, says Chief Minister’s Office on tuesday. the reason behind cancellation of jagan polavaram visit yet to known.

Story first published: Tuesday, July 13, 2021, 17:05 [IST]

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *