PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/cm-jagand25b39bd-e68a-48b0-9090-028eb02a2058-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/cm-jagand25b39bd-e68a-48b0-9090-028eb02a2058-415x250-IndiaHerald.jpgఇప్పటికే జీతాలు ఆలస్యం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అల్లాడిపోతున్నారు. అటు పీఆర్సీ అమలు కూడా వాయిదాలమీద వాయిదాలు పడుతూ పోతోంది. మరోవైపు సీపీఎస్ రద్దు కూడా ఎప్పుడో తెలియడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం జగన్, ప్రభుత్వ ఉద్యోగులకు మరో షాక్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా టీడీపీకి చెందిన మీడియా, సోషల్ మీడియా విభాగాల్లో ఈ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. cm jagan{#}job;Andhra Pradesh;TDP;YCP;Jagan;Government;media;Newsఉద్యోగులకు జగన్ మరో షాక్ ఇవ్వబోతున్నారా..?ఉద్యోగులకు జగన్ మరో షాక్ ఇవ్వబోతున్నారా..?cm jagan{#}job;Andhra Pradesh;TDP;YCP;Jagan;Government;media;NewsTue, 13 Jul 2021 07:09:00 GMTఇప్పటికే జీతాలు ఆలస్యం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అల్లాడిపోతున్నారు. అటు పీఆర్సీ అమలు కూడా వాయిదాలమీద వాయిదాలు పడుతూ పోతోంది. మరోవైపు సీపీఎస్ రద్దు కూడా ఎప్పుడో తెలియడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం జగన్, ప్రభుత్వ ఉద్యోగులకు మరో షాక్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా టీడీపీకి చెందిన మీడియా, సోషల్ మీడియా విభాగాల్లో ఈ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.

రిటైర్మెంట్ వయసు తగ్గించేస్తున్నారా..?
ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుని 60ఏళ్లనుంచి 57ఏళ్లకు తగ్గించబోతున్నారనేది ఆ వార్తల సారాంశం. రిటైర్మెంట్ వయసు తగ్గించి, ఉద్యోగులకు జగన్ మేలు చేయబోతున్నారని, ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నవారిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని, జగన్ కి పాజిటివ్ గానే ఆర్టికల్స్ పడుతున్నాయి. అదే సమయంలో ఆయనను ఇరుకున పెట్టేలా ఈ వ్యవహారం మలుపు తిరుగుతోంది. పాజిటివ్ గా వార్త ఇస్తూనే, జగన్ కి ఇబ్బంది కలిగేలా ప్రచారం చేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో జాబ్ క్యాలెండర్ గొడవ ముదిరిపోయింది. ఖాళీల సంఖ్య తక్కువగా చూపుతున్నారని, వాలంటీర్ పోస్టుల్ని కూడా ఉద్యోగాలంటున్నారని వివిధ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తున్నాయి. ఈ దశలో జగన్ రిటైర్మెంట్ వయసు తగ్గించి కొత్తగా 2లక్షల పోస్ట్ లు సృష్టిస్తారంటూ కథనాలు వస్తున్నాయి. అంటే ఉద్యోగులకు అన్యాయం చేసి, నిరుద్యోగులకు మేలు చేస్తారనే అర్థం వచ్చేలా ఈ వార్తలు వండివారుస్తున్నారు.

అధికారికంగా దీనిపై ఎక్కడా ప్రభుత్వం తరపున క్లారిటీ లేదు. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జగన్ ఉద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నారంటూ టీడీపీ సోషల్ మీడియా విభంగా వీటిని సర్క్యులేట్ చేస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, ఏపీ ఉద్యోగుల్లో మాత్రం రిటైర్మెంట్ వయసు కుదిస్తారనే భయం మొదలైంది. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం కానీ, వైసీపీ నేతలు కానీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది.





నీళ్ల పంచాయతీ : కెసిఆర్ తో ఢీ అంటున్న జగన్ ?

యూపీ సీఎంకి మరో షాక్.. ఈసారి కష్టమే..

ఇల్లు సీల్... హీరో సీరియస్ రియాక్షన్ !

వైఎస్‌ సమాధిపై అన్న, చెల్లెళ్ల రాజకీయాలు..గమ్ముగున్న విజయమ్మ ?

టాప్ హీరోల ఆలోచనలను ప్రభావితం చేస్తున్న నాగార్జున ఆలోచనలు !

కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలు వెనుక అంతర్యం !

పాయల్ సైడ్ బిజినెస్.. అలా కూడా సంపాదిస్తున్న ఆరెక్స్ భామ..!

అప్పటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో నారప్ప..!?

హీరోలపై కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>