PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpd29b5e86-fb4d-4d26-babe-17714a42b368-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpd29b5e86-fb4d-4d26-babe-17714a42b368-415x250-IndiaHerald.jpgకడప జిల్లా కమలాపురం....వైసీపీకి కంచుకోట. ఇక్కడ గత రెండు పర్యాయాలు నుంచి వైసీపీ సత్తా చాటుతుంది. వైసీపీ తరుపున సీఎం జగన్ మేనమామ పి. రవీంద్రనాథ్ రెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే మొదట నుంచి కమలాపురంలో టీడీపీకి అనుకూలంగా లేదు. ఇక్కడ ఎక్కువ సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. వైఎస్సార్ ఎఫెక్ట్‌తో నియోజకవర్గంలో టీడీపీకి ఎక్కువగా గెలిచే అవకాశాలు రాలేదు. ysrcp{#}District;Kollu Ravindra;Gandikota;Y. S. Rajasekhara Reddy;local language;Congress;CM;Reddy;Coronavirus;Cheque;YCP;Jagan;TDPహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జగన్ మేనమామకు చెక్ పెట్టడం కష్టమేనా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జగన్ మేనమామకు చెక్ పెట్టడం కష్టమేనా?ysrcp{#}District;Kollu Ravindra;Gandikota;Y. S. Rajasekhara Reddy;local language;Congress;CM;Reddy;Coronavirus;Cheque;YCP;Jagan;TDPTue, 13 Jul 2021 05:00:00 GMTకడప జిల్లా కమలాపురం....వైసీపీకి కంచుకోట. ఇక్కడ గత రెండు పర్యాయాలు నుంచి వైసీపీ సత్తా చాటుతుంది. వైసీపీ తరుపున సీఎం జగన్ మేనమామ పి. రవీంద్రనాథ్ రెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే మొదట నుంచి కమలాపురంలో టీడీపీకి అనుకూలంగా లేదు. ఇక్కడ ఎక్కువ సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. వైఎస్సార్ ఎఫెక్ట్‌తో నియోజకవర్గంలో టీడీపీకి ఎక్కువగా గెలిచే అవకాశాలు రాలేదు.

వైఎస్సార్ చనిపోవడం, కాంగ్రెస్ కనుమరుగవ్వడంతో వైసీపీ సత్తా చాటుతుంది. గత రెండు ఎన్నికల్లో కూడా వైసీపీనే విజయం సాధించింది. ఇక వైసీపీ తరుపున గెలుస్తున్న జగన్ మేనమామ రవీంద్ర రెడ్డికి కమలాపురంలో బలం ఎక్కువగానే ఉంది. ఈయనకు చెక్ పెట్టడం టీడీపీ వల్ల కావడం లేదు. పైగా ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో రవీంద్రకు తిరుగులేకుండా పోయింది. ప్రభుత్వ పథకాలు ఈయనకు ప్లస్. కమలాపురంలో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న కాలనీలు పేరిట పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతుంది.

అలాగే నియోజకవర్గంలో తాగునీటి కొరత తీర్చేందుకు రవీంద్ర కష్టపడుతున్నారు. గండికోట నుంచి ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. నాడు-నేడు ద్వారా కమలాపురంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయి. కరోనా సమయంలో ప్రజలకు రవీంద్ర అండగా నిలబడ్డారు.

ఇక రాజకీయంగా చూసుకుంటే కమలాపురంలో రవీంద్రకు చెక్ పెట్టడం టీడీపీకి సాధ్యం కాదనే చెప్పొచ్చు. నియోజకవర్గంలో పూర్తిగా వైసీపీకి లీడింగ్ కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసేసింది. ఇక్కడ టీడీపీ తరుపున పుత్తా నరసింహారెడ్డి బాగానే కష్టపడుతున్నారు. ఈయన గత మూడు పర్యాయాల నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఈసారైనా కమలాపురంలో టీడీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. కానీ రవీంద్ర దెబ్బకు పుత్తాకు పుంజుకునే ఛాన్స్ రావడం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ రవీంద్రకు తిరుగుండదనే తెలుస్తోంది.    





అవినాష్ త్రిముఖ వ్యూహం...!

రేవంత్‌ని టార్గెట్ చేసిన జగన్ పార్టీ...బెనిఫిట్ ఎవరికో?

ఆ నానికి పవన్‌తో కష్టమేనా?

బాబు....ఓట్లు తెచ్చే బ్యాచ్ ఎక్కడా?

పవన్ మునుగుతున్నారు...బాబుని ముంచుతున్నారు...!

వాళ్లకు జగన్ బంపర్ ఆఫర్.. నెలకు రూ. 3000..?

ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే వాహనాల లబ్దిదారులకు వాహన రుణంపై సబ్సీడీ పెంచేశారు. ఇలా సబ్సిడీ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 60 శాతంగా ఉన్న రుణ సబ్సిడీని 90 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి దూకుడుగా రాజకీయాలు చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎలాగైనా కేసీఆర్‌ని గద్దె నుంచి దింపేస్తామని అంటున్నారు. కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకోస్తానని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పోరాటాలు చేయడం మొదలుపెట్టేశారు.

రాజ‌కీయ‌ స‌భ‌ల్లో టాలెంట్ చూపిస్తున్న పిక్ పాకెట‌ర్స్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>