PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababuc4e01692-558f-4745-8738-07260c02f2d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababuc4e01692-558f-4745-8738-07260c02f2d1-415x250-IndiaHerald.jpgరాజ‌కీయాల్లో ఎప్పుడు ? ఏం జ‌రుగుతుందో ? ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒకే ఫార్ములాతో ఒక‌రు స‌క్సెస్ కావ‌చ్చు.. మ‌రొక‌రు ఫెయిల్ కావ‌చ్చు. తెలంగాణ ఉద్య‌మం జోరుగా ఉన్న స‌మ‌యంలో రెండు రాష్ట్రాలూ త‌న‌కు ముఖ్య‌మ‌ని చెబుతూ.. ఏ రాష్ట్రానికీ ఆయ‌న ఓటు వేయ‌కుండా త‌ట‌స్థంగా ఉన్నారు. అయితే ఇదే ఆయ‌న‌కు త‌ర్వాత మైన‌స్ అయ్యింది. బాబును రెండు క‌ళ్ల సిద్ధాంతం పేరుతో తెలంగాణ నేత‌లు తీవ్ర‌స్థాయిలో దుమ్ము దులిపారు. ఇప్ప‌ట‌కి బాబుకు ఆ పేరు చిర‌స్తాయిగా నిలిచిపోయింది. అయితే ఇదే బాబుకు ఏపీ విష‌యా నికి వ‌చ్చే స‌రికి బాchandra babu jagan{#}KCR;Jaggery;Telugu;Telangana;Andhra Pradesh;CBNనాడు బాబు స‌క్సెస్‌.. నేడు జ‌గ‌న్ ప్లాప్‌.. ఒకే ఫార్ములా..!నాడు బాబు స‌క్సెస్‌.. నేడు జ‌గ‌న్ ప్లాప్‌.. ఒకే ఫార్ములా..!chandra babu jagan{#}KCR;Jaggery;Telugu;Telangana;Andhra Pradesh;CBNTue, 13 Jul 2021 18:21:00 GMTరాజ‌కీయాల్లో ఎప్పుడు ? ఏం జ‌రుగుతుందో ? ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒకే ఫార్ములాతో ఒక‌రు స‌క్సెస్ కావ‌చ్చు.. మ‌రొక‌రు ఫెయిల్ కావ‌చ్చు. తెలంగాణ ఉద్య‌మం జోరుగా ఉన్న స‌మ‌యంలో రెండు రాష్ట్రాలూ త‌న‌కు ముఖ్య‌మ‌ని చెబుతూ.. ఏ రాష్ట్రానికీ ఆయ‌న ఓటు వేయ‌కుండా త‌ట‌స్థంగా ఉన్నారు. అయితే ఇదే ఆయ‌న‌కు త‌ర్వాత మైన‌స్ అయ్యింది. బాబును రెండు క‌ళ్ల సిద్ధాంతం పేరుతో తెలంగాణ నేత‌లు తీవ్ర‌స్థాయిలో దుమ్ము దులిపారు. ఇప్ప‌ట‌కి బాబుకు ఆ పేరు చిర‌స్తాయిగా నిలిచిపోయింది. అయితే ఇదే బాబుకు ఏపీ విష‌యా నికి వ‌చ్చే స‌రికి బాబుకు కొంత ప్ల‌స్ అయ్యింది. ఇదే 2014లో బాబు అధికారంలోకి వ‌చ్చేలా చేసింద‌ని కూడా అంటారు.

అయితే ఇప్పుడు జ‌గ‌న్ సైతం ఇదే సిద్ధాంతంతో ముందుకు వెళుతోన్న ప‌రిస్థితి ఉందా ? అంటే అవున‌నే అంటున్నారు.  రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం విష‌యంలో జ‌గ‌న్ పైకి ఆచితూచి స్పందిస్తున్నట్టు ఉన్నారు. తెలంగాణ‌తో త‌న‌కు వివాదం వ‌ద్ద‌ని చెపుతున్నా... ఇది ఏపీ జ‌నాల్లో న‌మ్మం క‌ల‌గించ‌డం లేదు. ఎందుకంటే తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు  తెలంగాణ ప్ర‌భుత్వం దూకుడుగా ముందుకు వెళుతున్నా జ‌గ‌న్ నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లే వ‌స్తున్నాయి.

నాడు చంద్ర‌బాబు చేసిన ప‌నికి ఆయ‌న‌పై రెండు క‌ళ్ల సిద్ధాంతం నేత‌గా ముద్ర ప‌డిపోయింది. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయాయి. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం వారు ఫైట్ చేయాలి. ఇప్పుడు జ‌గ‌న్ మౌనంగా ఉండ‌డంపై సొంత రాష్ట్రంలో సామాన్యుల్లోనూ అనేక సందేహాలు వ‌స్తున్నాయి. జ‌గ‌న్‌కు హైద‌రాబాద్‌లో ఉన్న ఆస్తుల నేప‌థ్యంలోనే ఇలా చేస్తున్నార‌నే టాక్ బ‌య‌ట బాగా స్ప్రెడ్ అవుతుండ‌డం కూడా జ‌గ‌న్ కు మైన‌స్ గా మారింది. ఏదేమైనా నాడు చంద్ర‌బాబు నాడు రెండు స్టేట్‌లు కావాల‌ని ప్ల‌స్ అయితే.. ఇప్పుడు జ‌గ‌న్‌కు అదే మైన‌స్ అయ్యేలా ఉంది.





హైద‌రాబాద్ ఆస్తుల‌తోనే జ‌గ‌న్ జ‌ల వివాదంలో మౌనంగా ఉన్నారా ?

సిగ్గు ఉండాలి మనకి... సిఎస్ పై బాబు ఫైర్...?

యంగ్ టైగర్ కోసం వెయిటింగ్ తప్పదా?

ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన నారప్ప..?

ధూళిపాళ్ల న‌రేంద్ర‌పై చెయ్యేస్తేనా?

మాకు బు'ర్ర'న్న కధలొద్దు!

రామ్ చేసేది తెలుగు సినిమా నా..? తమిళ సినిమా నా?

బ్రేకింగ్: కేసిఆర్ తో బీజేపీ ఎమ్మెల్యే భేటీ...?

నీరసంగా ఉన్న వారికి బలమైన ఆహారాన్ని ఇచ్చే పదార్థాలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>