MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mega-family-movie-gossipba3f7a7b-f269-4696-8e36-08ae2e03528d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mega-family-movie-gossipba3f7a7b-f269-4696-8e36-08ae2e03528d-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోల కిడ్స్ అంటే అభిమానులు ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తారు. తమ ప్రియతమ హీరోల వారుసులు సినీరంగంలోకి అడుగుపెట్టబోతున్నారు అంటే ఎక్కడలేని సంతోషంతో తడిసి ముద్దవుతారు. వారి అభిమాన తారలు తమ వారసులతో కలసి ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారు అంటే వారి ఆనందానికి అవధులు ఉండవు.MEGA FAMILY MOVIE GOSSIP{#}Gift;festival;Varasudu;Silver;Akkineni Nagarjuna;Audience;Manam;Ram Charan Teja;Chiranjeevi;Telugu;Hero;Success;Samantha;Anandam;Darsakudu;Director;Cinema"మనం" ఏకమవుదాం అంటున్న మెగా ఫ్యామిలీ ?"మనం" ఏకమవుదాం అంటున్న మెగా ఫ్యామిలీ ?MEGA FAMILY MOVIE GOSSIP{#}Gift;festival;Varasudu;Silver;Akkineni Nagarjuna;Audience;Manam;Ram Charan Teja;Chiranjeevi;Telugu;Hero;Success;Samantha;Anandam;Darsakudu;Director;CinemaTue, 13 Jul 2021 15:12:39 GMTస్టార్ హీరోల కిడ్స్ అంటే అభిమానులు ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తారు. తమ ప్రియతమ హీరోల వారుసులు సినీరంగంలోకి అడుగుపెట్టబోతున్నారు అంటే ఎక్కడలేని సంతోషంతో తడిసి ముద్దవుతారు. వారి అభిమాన తారలు తమ వారసులతో కలసి ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారు అంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఇక మొత్తం వారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే చిత్రంలో కనిపిస్తారు అంటే ఇక ఫాన్స్ కీ అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదేమో, అలాంటి మూవీ ఫ్యామిలీ ప్యాక్ ను తెలుగు ప్రేక్షకులకు గిఫ్ట్ గా అందించింది అక్కినేని ఫ్యామిలీ. ఒకప్పటి సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని నాగార్జున , నాగచైతన్య, అఖిల్‌ మరియు సమంత ఇలా ఒకే వంశానికి చెందిన వారంతా మనం సినిమాలో నటించి ప్రేక్షకుల్ని అబ్బురపరిచారు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుని కమర్షియల్ గా హిట్ ను సొంతం చేసుకుంది.
ఈ మూవీని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించి మ్యాజిక్ చేశారు దర్శకుడు విక్రమ్‌ కుమార్‌. మనం సినిమా తెలుగు సినీ ప్రేమికులకు ఒక మదుర జ్ఞాపకం. ఈ సినిమాను తెరకెక్కించిన విధానం ఒక అద్భుతం. అయితే ఇపుడు మెగా ఫ్యామిలీ కూడా  ఫ్యామిలీతో కలిసి వెండి తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఇది డైరెక్టర్ కి ఒక పెద్ద టాస్క్ అవుతుంది. ఎందుకంటే చిరుకి ఉన్న మెగా బ్రాండ్ కి ఈ సినిమా ఏమాత్రం తగ్గకూడదు. ఆయన వారసుడు రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే అగ్ర హీరోగా టాలీవుడ్లో రాణిస్తున్నారు. అల్లుడు కల్యాణ్ దేవ్ కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. కాబట్టి వీరి కాంబోలో మూవీ అంటే ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇక చిరు గారాల కుమార్తెలు శ్రీజ, సుస్మిత లు ఇప్పటి వరకు స్క్రీన్ పై కనిపించింది లేదు. కానీ ఫ్యామిలీ మూవీ కావడంతో ఈ చిత్రంలో గెస్ట్ రోల్స్ చేయబోతున్నట్లు సమాచారం.
 నటించాలనే ఉద్దేశం లేకపోయినప్పటికీ, తమ మెగా అభిమానుల ఆనందం కోసం వీరు సరే అన్నట్లు తెలుస్తోంది.  కాబట్టి శ్రీజ, సుస్మితల పాత్రలు అత్యంత జాగ్రత్తగా చిత్రీకరించాల్సి ఉంటుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ కాంబోలో అద్భుతమైన సినిమాలను ఎంజాయ్ చేశాం. అయితే ఇపుడు మెగా ఫ్యామిలీ కనుక నిజంగానే తెరపై ఒకటిగా కనిపిస్తే అది నిజంగా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇటు ఫ్యాన్స్ కి కూడా అంతకు మించిన పండుగ మరొకటి ఉండదు. అయితే ఈ గాసిప్ ఎంతవరకు నిజమౌతుందో తెలియాల్సి ఉండగా, అభిమానులు ఇలాంటి ఓ అద్బుతమైన శుభవార్త కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 


రామ్ చేసేది తెలుగు సినిమా నా..? తమిళ సినిమా నా?

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..!!

నీరసంగా ఉన్న వారికి బలమైన ఆహారాన్ని ఇచ్చే పదార్థాలు..

జయప్రద తన భర్తను తొలిసారి ఎలా కలిసింది.. ఎక్కడ ప్రేమలో పడింది ?

ఒక్క వీడియో తో మంచు విష్ణు అందరినీ పడగొట్టేశాడా!!

హీరోయిన్ ను విలన్ చేసి హిట్టు కొట్టాడు.. ఇదో పెద్ద సాహసమే..!

పవన్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోందా ?

'కార్తికేయ' సీక్వెల్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్..!!

పానీ పూరీ అమ్మే వాడిని చేసుకోవాలనుకున్నా : ఐస్క్రీం హీరోయిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>