MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya86112f8a-0351-4969-ad5d-53790d61bd27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya86112f8a-0351-4969-ad5d-53790d61bd27-415x250-IndiaHerald.jpgతమిళ్, తెలుగు ప్రేక్షకులను సూర్య అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన తమిళ్ లో నటించిన సూరరై పొట్రు ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు సరైన హిట్ లేక సతమతమవుతున్న సూర్యాకు ఈ సినిమా మంచి ఘన విజయాన్ని ఇచ్చింది.surya{#}Shahid Kapoor;dr rajasekhar;jyothika;Yevaru;Jersey;surya sivakumar;Reddy;Coronavirus;Remake;Telugu;bollywood;Tamil;Hindi;Cinemaఆ హీరో నిర్మాతగా హిందీలో ఆకాశమే హద్దురా రీమేక్..!ఆ హీరో నిర్మాతగా హిందీలో ఆకాశమే హద్దురా రీమేక్..!surya{#}Shahid Kapoor;dr rajasekhar;jyothika;Yevaru;Jersey;surya sivakumar;Reddy;Coronavirus;Remake;Telugu;bollywood;Tamil;Hindi;CinemaTue, 13 Jul 2021 08:00:00 GMTతమిళ్, తెలుగు ప్రేక్షకులను సూర్య అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన తమిళ్ లో నటించిన సూరరై పొట్రు ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు సరైన హిట్ లేక సతమతమవుతున్న సూర్యాకు ఈ సినిమా మంచి ఘన విజయాన్ని ఇచ్చింది. అంతేకాదు.. ఈ చిత్రాన్ని తెలుగులో ఆకాశమే హద్దురా పేరుతో డబ్బింగ్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ బయోపిక్ గా తెరకెక్కించారు.

దేశంలో కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లను మూసివేయడంతో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. ఈ మూవీ భారీ స్థాయిలో వ్యూస్ సాధించింది. ఈ మూవీ ఇప్పటికే ఉత్తమ చిత్రంగా పలు అవార్డులను కూడా కైవసం చేసుకుంది. అయితే తమిళంలో ఈ సినిమాను నిర్మించిన సూర్య, జ్యోతిక దీనిని హిందీలో నిర్మిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇక రాజశేఖర్ పాండియన్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాను అబన్ డంతియ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై  నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాతో నిర్మాతగా సూర్య హిందీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

అంతేకాదు.. తమిళంలో ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సుధా కొంగర హిందీ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తున్నారని విషయమై ఇంకా తెలుపలేదు. కాగా.. అతి త్వరలోనే ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇటీవల బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ వరుసగా సౌత్ సినిమాలను రీమేక్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే తెలుగు అర్జున్ రెడ్డి సినిమా తీసి విజయం సాధించిన షాహిద్ కపూర్ ప్రస్తుతం జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేశాడు. అయితే ఆయనే ఈ సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.



నీళ్ల పంచాయతీ : కెసిఆర్ తో ఢీ అంటున్న జగన్ ?

తెలంగాణ‌లో ఇప్పుడు ఆ కులం చుట్టూనే రాజ‌కీయం ?

చైనాకు చెక్ పెట్టేందుకు ఆ దేశాల సరికొత్త ఐడియా..?

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్.. మరో రెండ్రోజుల పాటు?

ఆర్ ఆర్ ఆర్ పోరాటాల పై బుర్రా సాయి మాధవ్ లీకులు !

ఇల్లు సీల్... హీరో సీరియస్ రియాక్షన్ !

పుష్ప తర్వాత అల్లు అర్జున్ అదిరిపోయే ప్లాన్..!

కోవిడ్ హాస్పిటల్ లో ఘోర అగ్నిప్రమాదం.. 50 మంది మృతి?

వైఎస్‌ సమాధిపై అన్న, చెల్లెళ్ల రాజకీయాలు..గమ్ముగున్న విజయమ్మ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>