PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag36515310-5538-4fac-80c2-fb036adb3333-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag36515310-5538-4fac-80c2-fb036adb3333-415x250-IndiaHerald.jpgకేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తాపార్టీతో పొత్తు పెట్టుకొని కూడా నిరాశాజ‌న‌కంగా మాట్లాడుతుండ‌టంతో జ‌న‌సేనానిపై ఆ పార్ట కార్య‌క‌ర్త‌లు ఆశ‌లు వ‌దిలేసుకున్న‌ట్లే క‌న‌ప‌డుతోంది. య‌థేచ్ఛ‌గా, విశృంఖ‌లంగా రాష్ట్రాల ఎన్నిక‌ల్లో విజ‌య‌బావుటా ఎగ‌ర‌వేసిన న‌రేంద్ర‌మోడీ, అమిత్ షా ద్వ‌యం ఉండి కూడా ప‌వ‌న్ ఎందుకు నిరాశ‌గా మాట్లాడి వ‌చ్చింది? అందుకు కార‌ణాలేంటి? భ‌విష్య‌త్తు ప‌రిణామాలేంటి? అని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. పంచాయితీ ఎన్నిక‌ల్లో చెప్పుకోద‌గ్గ స‌ర్పంచ్ స్థానాల‌ను కైtag{#}Amith Shah;Telugu Desam Party;Air;Party;MP;Teluguఆత్మ‌విశ్వాసం లోపించిన జ‌న‌సేనాని?ఆత్మ‌విశ్వాసం లోపించిన జ‌న‌సేనాని?tag{#}Amith Shah;Telugu Desam Party;Air;Party;MP;TeluguTue, 13 Jul 2021 15:47:00 GMT


కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తాపార్టీతో పొత్తు పెట్టుకొని కూడా నిరాశాజ‌న‌కంగా మాట్లాడుతుండ‌టంతో జ‌న‌సేనానిపై ఆ పార్ట కార్య‌క‌ర్త‌లు ఆశ‌లు వ‌దిలేసుకున్న‌ట్లే క‌న‌ప‌డుతోంది. య‌థేచ్ఛ‌గా, విశృంఖ‌లంగా రాష్ట్రాల ఎన్నిక‌ల్లో విజ‌య‌బావుటా ఎగ‌ర‌వేసిన న‌రేంద్ర‌మోడీ, అమిత్ షా ద్వ‌యం ఉండి కూడా ప‌వ‌న్ ఎందుకు నిరాశ‌గా మాట్లాడి వ‌చ్చింది?  అందుకు కార‌ణాలేంటి? భ‌విష్య‌త్తు ప‌రిణామాలేంటి? అని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. పంచాయితీ ఎన్నిక‌ల్లో చెప్పుకోద‌గ్గ స‌ర్పంచ్ స్థానాల‌ను కైవ‌సం చేసుకొని పునాదిని బ‌ల‌పేతం చేసుకుంటూ వ‌స్తోన్న క్ర‌మంలో జ‌న‌సేన అధిప‌తి మాట‌ల వెన‌క మ‌ర్మ‌మేమైనా ఉంటుందా? అని రాజ‌కీయ విశ్లేష‌కులు విశ్లేషిస్తున్నారు.

విస్మ‌యం క‌లిగించిన వ్యాఖ్య‌లు
గెలుపోట‌ములు ఏ పార్టీకైనా సాధార‌ణంగా ఉంటాయి. ప్ర‌జాద‌ర‌ణ ఉంద‌ని అనుకుని లెక్క‌లు వేసుకున్న నాయ‌కులు కూడా గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన విష‌యం తెలిసిందే. ఫ్యాను గాలి వీచింద‌నుకున్నా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ నేత‌లు ఓట‌మి పాల‌య్యారు. ఒక‌రు ఓడినంత‌మాత్రాన‌, ఒక‌రు గెలిచినంత‌మాత్రాన ఎవ‌రినీ త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీలులేదు. ఈ సారి ఎన్నిక‌ల్లో ఎలా గెల‌వాలి? ఎలా మ‌న జెండా పాతాలి? అనే కోణంలో ముందుకు సాగాలేకానీ నిరాశాజ‌న‌కంగా ఉంటే అది పార్టీపై పెనుప్ర‌భావం చూప‌డ‌మేకాకుండా రాజ‌కీయాల‌కు కూడా ఒక మ‌లుపు తిప్పే అవ‌కాశం ఉంటుంది. అది చెడైనా కావ‌చ్చు.. మంచైనా కావ‌చ్చు.

వైసీపీ, తెలుగుదేశంకు ప్ర‌త్యామ్నాయంగా..
ఏపీలో వైసీపీ, తెలుగుదేశంకు ప్ర‌త్యామ్నాయంగా జ‌న‌సేన పార్టీ మార‌డానికి అనేక అవ‌కాశాలున్నాయి. ఈ రెండుపార్టీల్లో
ఇమ‌డ‌లేనివారు ప్ర‌త్యామ్నాయం వైపు దృష్ట‌సారిస్తున్నారు. ఇలాంటివారికి జ‌న‌సేన ఒక ఆశాదీప‌మ‌వుతోంది. పార్టీని బ‌లోపేతం చేయాల్సిన దిశ‌గా సాగాల్సిన ప‌వ‌న్ నిరాశాజ‌న‌క‌మైన వ్యాఖ్య‌లు చేస్తుండ‌టంతో ఆ పార్టీలో చేరాల‌నుకునేవారు కూడా వెన‌క్కి త‌గ్గుతున్నారు. తెలుగుదేశం పార్టీక‌న్నా ఎస్సీ, ఎస్టీలు జ‌న‌సేన‌వైపే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. వారి మ‌ద్ద‌తును కూడా పోగొట్టుకోవాల్సి వ‌స్తోంది. ఓడిపోయినా పోటీచేస్తూ ఉండే పార్టీని ప్ర‌జ‌లు ఆద‌రిస్తారుకానీ త‌న‌పై తాను న‌మ్మ‌కం కోల్పోతూవుండే పార్టీపై ఎవ‌రికీ న‌మ్మ‌కం క‌ల‌గ‌దు. జ‌న‌సేన విష‌యంలో కూడా ఇదే ప‌రిస్థితి క‌న‌ప‌డుతోంది. త‌నంత‌ట తానే అంత‌రించిపోవాల‌నుకుంటోందంటూ ఇటీవ‌లే ఒక ఎంపీ కూడా జ‌న‌సేన‌ను విమ‌ర్శంచారు. జ‌న‌సేన‌లో వ్యూహం లేక‌పోవ‌డ‌మా?  లేదంటే వ్యూహాత్మ‌కంగా వ్య‌హ‌రిస్తున్నారా? అనేదానిపై ఒక స్ప‌ష్ట‌త రావాలంటే వేచిచూడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.





నాడు బాబు స‌క్సెస్‌.. నేడు జ‌గ‌న్ ప్లాప్‌.. ఒకే ఫార్ములా..!

బ్రేకింగ్: ఇష్టమైన అధికారికి జగన్ రిలీవ్...?

ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన నారప్ప..?

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, సంగం డెయిరీ చైర్మ‌న్ ధూళిపాళ్ల న‌రేంద్ర‌కు తెలుగుదేశం పార్టీ అండ‌గా ఉంటుంద‌ని, ఆయ‌న జోలికొస్తే ఖ‌బ‌డ్దార్‌! అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు హెచ్చ‌రించారు. పోలీసులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఇది మంచి ప‌ద్ధ‌తి కాద‌ని, మార్చుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని, వీట‌న్నింటినీ గుర్తుంచుకుంటామ‌న్నారు. రాయ‌ల‌సీమ‌లో ముఠాక‌క్ష‌ల‌ను త‌మ ప్ర‌భుత్వం అణచివేసి శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడింద‌ని, ఇప్ప‌టి ప్ర‌భుత్వం మ‌ళ్లీ హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని ఆరోపించారు.

ధూళిపాళ్ల న‌రేంద్ర‌పై చెయ్యేస్తేనా?

రామ్ చేసేది తెలుగు సినిమా నా..? తమిళ సినిమా నా?

బ్రేకింగ్: కేసిఆర్ తో బీజేపీ ఎమ్మెల్యే భేటీ...?

ఒక్క వీడియో తో మంచు విష్ణు అందరినీ పడగొట్టేశాడా!!

ఏపీలో నామినేటెడ్ ప‌ద‌వుల జాత‌ర‌...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>