MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sureshbabu0324b5fa-3d74-4361-a5c2-4db9c9a4524a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sureshbabu0324b5fa-3d74-4361-a5c2-4db9c9a4524a-415x250-IndiaHerald.jpgసురేష్ ప్రొడక్షన్స్ అంటే చాలా వాల్యూ ఉన్న బేనర్. ఎపుడో ఎర్లీ సిక్స్టీస్ లో ఈ బ్యానర్ ఏర్పాటు అయింది. ఈ బ్యానర్ మీద వచ్చిన సినిమాలు చరిత్రనే సృష్టించాయి. టాప్ స్టార్స్ ఎంతో మంది నటించారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకున్న వారు అంతా ఈ బ్యానర్ లో పనిచేసిన వారే. sureshbabu{#}Sureshసురేష్ బాబు దోవ చూపించాడా... ?సురేష్ బాబు దోవ చూపించాడా... ?sureshbabu{#}SureshTue, 13 Jul 2021 19:01:38 GMTసురేష్ ప్రొడక్షన్స్ అంటే చాలా వాల్యూ ఉన్న బేనర్. ఎపుడో ఎర్లీ సిక్స్టీస్ లో ఈ బ్యానర్ ఏర్పాటు అయింది. ఈ బ్యానర్ మీద వచ్చిన సినిమాలు చరిత్రనే సృష్టించాయి. టాప్ స్టార్స్ ఎంతో మంది నటించారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకున్న వారు అంతా ఈ బ్యానర్ లో పనిచేసిన వారే.

ఇక కొత్తరకం వ్యాపారం మెలకువలు టాలీవుడ్ కి నేర్పించడంతోనూ ఈ బ్యానర్ చాలా ముందుంటుంది. వస్తున్న మార్పులను ముందే గమనించి దానికి తగినట్లుగా మారడం అన్నది రామానాయుడుకు అలావాటు. అలా ఆయన బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి వచ్చి తాను చనిపోయేంతవరకూ ధీటైన పోటీ ఇచ్చారు అంటే మార్పును అడాప్ట్ చేసుకోవడం వల్లనే.

ఇపుడు ఆయన తనయుడు సురేష్ బాబు కూడా తండ్రి లాగానే ఆలోచిస్తున్నారు. అందుకే ఆయన ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. తాను నిర్మించిన చిత్రాలను ఆయన నేరుగా ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్, పైగా చరిత్ర కలిగిన బ్యానర్ ఇలా చేయడమేంటి అన్న చర్చ అయితే ఉంది. కానీ సురేష్ బాబు మాత్రం దీని మీద తన రూట్ కరెక్ట్ అన్న ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే ఆయన సినిమా పక్కా బిజినెస్ అంటున్నారు. ఇక్కడ తప్పొప్పులు ఉండవని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు.

ఇక థియేటర్లు తెరచుకున్నా జనాలు మెచ్చి చూసినా లాభాలు వస్తాయన్న గ్యారంటీ లేదు. అందుకే మంచి రేటు వచ్చినపుడు ఓటీటీకి ఇవ్వడమే బెటర్ అని ఆలోచిస్తున్నారు. మరోవైపు చూస్తే కరోనా రాకపోయిన థియేటర్లకు సినీ గోయర్స్ సంఖ్య తగ్గిపోయింది. ఇది ఫ్యూచర్ లో దెబ్బ తీసే అవకాశం ఉంది. అందుకే ముందే సురేష్ బాబు ఒక దోవ చూపిస్తున్నారు. ఇవాళ రాంగ్ అన్న వారే రేపు రైట్ అంటారని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.








అందుకే నారప్ప ఓటీటీ రిలీజ్.. అసలు గుట్టు ఇది!!

క‌త్తి మహేశ్ మ‌ర‌ణంపై సీఎం విచార‌ణ జరిపిస్తారా.. ?

రానా మొహమాటం... రంగంలోకి సురేష్ బాబు !

అప్పటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో నారప్ప..!?

రెండు సినిమాలు 75 కోట్లు.. సురేష్ బాబా మజాకా..?

ధియేట‌ర్ అవ‌స‌ర‌మైన‌ప్పుడు మీ సంగ‌తి చూస్తాం..?

హాట్ టాపిక్ గా మారిన నారప్ప డబల్ గేమ్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>