ViralSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/nudist-villagefceca962-3a6d-4657-bc90-6e6fe838647d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/nudist-villagefceca962-3a6d-4657-bc90-6e6fe838647d-415x250-IndiaHerald.jpgసాధారణంగా కోటీశ్వరులు కొత్త డ్రస్సులు ధరిస్తూ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంటారు. వారు ధరించే బట్టలు చాలా క్వాలిటీ గా అందంగా కనిపిస్తుంటాయి. ఇక ఆడవారయితే ధగధగ మెరిసిపోతున్న నగలు ధరించి పట్టుచీరలు కట్టుకొని నిండుగా కనిపిస్తారు. ఇక విదేశీ ధనవంతులు కూడా మంచి కోట్స్ ధరించి నిండుగా కనిపిస్తుంటారు. కానీ యునైటెడ్ కింగ్డమ్ లోని ఒక ప్రాంతం లో నివసించే దంపతులు మాత్రం అస్సలు బట్టలు కట్టుకోరు. కనీసం లోదుస్తులు కూడా ధరించరు. వారు ఎప్పుడూ కూడా నగ్నంగా ఇళ్లల్లో తిరుగుతూనే ఉంటారు. బాగా చలి వేసినప్పుడు లేదా ఇతర ప్రnudist village{#}United Kingdom;Ishtam;Fatherకోటీశ్వరులే కానీ అసలు బట్టలు వేసుకోరు..?కోటీశ్వరులే కానీ అసలు బట్టలు వేసుకోరు..?nudist village{#}United Kingdom;Ishtam;FatherTue, 13 Jul 2021 18:00:00 GMTయునైటెడ్ కింగ్డమ్ లోని ఒక ప్రాంతం లో నివసించే దంపతులు మాత్రం అస్సలు బట్టలు కట్టుకోరు. కనీసం లోదుస్తులు కూడా ధరించరు. వారు ఎప్పుడూ కూడా నగ్నంగా ఇళ్లల్లో తిరుగుతూనే ఉంటారు. బాగా చలి వేసినప్పుడు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాత్రం బట్టలు వేసుకుంటారు. ఇతర ప్రాంతాల్లో నగ్నంగా తిరగడం నేరం కాబట్టి వారు బట్టలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక చలి వేసినప్పుడు వెచ్చదనం కోసం బట్టలు వేసుకోవాల్సిందే. ఈ రెండు సందర్భాల్లో తప్పించి వారికి బట్టలు వేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదట.

పూర్తి వివరాలు తెలుసుకుంటే.. హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని బ్రికెట్ వుడ్ లోని స్పీల్‌ప్లాట్జ్ గ్రామంలో 30-50 తెల్ల జాతీయుల కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే వారు గత 90 సంవత్సరాలుగా బట్టలు ధరించకుండా నగ్నంగా తిరుగుతూనే ఉన్నారు. స్పీల్‌ప్లాట్జ్‌లో ఐసెల్ట్ రిచర్డ్‌సన్(82) తండ్రి 1929 లో ఈ నగ్న ప్రజల సంఘాన్ని స్థాపించారు. ఇక అప్పటినుంచి ఈ సంఘం లోని ప్రజలు చాలా అరుదుగా బట్టలు ధరిస్తున్నారు. వీరి గ్రామంలో పబ్, స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్స్, బార్స్ ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చే వారంతా కూడా ఎటువంటి బట్టలు లేకుండానే ప్రత్యక్షం అవుతుంటారు.

బట్టలు ధరించకుండా అత్యంత సహజంగా ఉండటం వల్ల ప్రకృతికి చాలా దగ్గరయిన ఫీలింగ్ వస్తుందని వీరు భావిస్తుంటారు. అంతేకాకుండా తమ బాడీలోని లోపాలను మర్చిపోవడానికి నగ్నం గా ఉండటమే అసలైన మార్గమని విశ్వసిస్తుంటారు. వీరంతా కూడా ఉన్నత చదువులు చదువుకున్న వారే కావడం ఇంకొక విశేషం. అయితే బయట వ్యక్తులు ఈ గ్రామంలోకి ప్రవేశించాలంటే కచ్చితంగా నగ్నంగా మారాల్సిందే. ఈ నిబంధన పాటించనివారిని తమ గ్రామంలోకి అనుమతించరు.


కోటీశ్వరులే కానీ అసలు బట్టలు వేసుకోరు..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ వైరల్ కేటగిరీలో చూడండి.

ఒక్క వీడియో తో మంచు విష్ణు అందరినీ పడగొట్టేశాడా!!

టీఆర్ఎస్‌,బీజేపీకి భారీ షాక్‌...?

మంచిమాట: అత్యాశకు పోతే.. మిగిలేది నిరాశే..

తల్లి బతికుండగానే పూడ్చి పెట్టేందుకు గొయ్యి తీసిన కొడుకు..ఆపై..?

నయన తారను డైలమా లో పడేసిన తండ్రి కోరిక !

అందుకే మా ఎన్నికల నుంచి తప్పుకున్న మంచు విష్ణు !

సాయం కోరుతున్న సీరియల్ నటి !

వైఎస్‌ సమాధిపై అన్న, చెల్లెళ్ల రాజకీయాలు..గమ్ముగున్న విజయమ్మ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>