MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunaf9855f11-dda8-4608-85c5-ee47edddcad9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunaf9855f11-dda8-4608-85c5-ee47edddcad9-415x250-IndiaHerald.jpg అక్కినేని నాగార్జున రేపటి ట్రెండ్ ను ఈరోజే ఆలోచిస్తాడు. ఒక్క సినిమా తీసిన అనుభవం లేని రామ్ గోపాల్ వర్మకు ‘శివ’ మూవీ చేసే అవకాశం ఇచ్చి ఆరోజుల్లోనే ఒక ట్రెండ్ ను సెట్ చేసాడు. ఆతరువాత ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్ కు అవకాశాలు ఇచ్చి సూపర్ హిట్స్ కొట్టిన నాగార్జునకు ప్రస్తుతం నడుస్తున్న కాలం ఏమాత్రం కలిసి రావడంలేదు వరస పరాజయాలతో సతమతమైపోతున్నాడు.‘బిగ్ బాస్’ రియాలిటీ షోను నాగార్జున హోస్ట్ చేయకుండా ఉండి ఉంటే అతడి ఇమేజ్ మరింత మసకబారి ఉండేది. సినిమాలకు హిట్స్ లేకుండా కేవలం ‘బిగ్ బాస్’ షోను నమ్ముకుని ఉండటnagarjuna{#}Akkineni Nagarjuna;ram pothineni;Ishtam;surya sivakumar;Director;Salman Khan;Thriller;Venkatesh;Cinema;bollywood;Coronavirus;Newsటాప్ హీరోల ఆలోచనలను ప్రభావితం చేస్తున్న నాగార్జున ఆలోచనలు !టాప్ హీరోల ఆలోచనలను ప్రభావితం చేస్తున్న నాగార్జున ఆలోచనలు !nagarjuna{#}Akkineni Nagarjuna;ram pothineni;Ishtam;surya sivakumar;Director;Salman Khan;Thriller;Venkatesh;Cinema;bollywood;Coronavirus;NewsTue, 13 Jul 2021 07:17:07 GMT
అక్కినేని నాగార్జున రేపటి ట్రెండ్ ను ఈరోజే ఆలోచిస్తాడు. ఒక్క సినిమా తీసిన అనుభవం లేని రామ్ గోపాల్ వర్మకు ‘శివ’ మూవీ చేసే అవకాశం ఇచ్చి ఆరోజుల్లోనే ఒక ట్రెండ్ ను సెట్ చేసాడు. ఆతరువాత ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్ కు అవకాశాలు ఇచ్చి సూపర్ హిట్స్ కొట్టిన నాగార్జునకు ప్రస్తుతం నడుస్తున్న కాలం ఏమాత్రం కలిసి రావడంలేదు వరస పరాజయాలతో సతమతమైపోతున్నాడు.


‘బిగ్ బాస్’ రియాలిటీ షోను నాగార్జున హోస్ట్ చేయకుండా ఉండి ఉంటే అతడి ఇమేజ్ మరింత మసకబారి ఉండేది. సినిమాలకు హిట్స్ లేకుండా కేవలం ‘బిగ్ బాస్’ షోను నమ్ముకుని ఉండటం ఇష్టం లేక నాగ్ రాబోతున్న ‘బిగ్ బాస్’ సీజన్ ను వదులుకుని తన దృష్టి అంతా సినిమాల పై అదేవిధంగా వెబ్ సిరీస్ పై పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు నాగార్జున ఒక యంగ్ డైరెక్టర్ తో కలిసి ఒక వెబ్ సిరీస్ కు ప్లాన్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల పై స్పందించాడు. ఒక డిఫరెంట్ కథతో తాను వెబ్ సిరీస్ చేయబోతున్న విషయం నిజమే అని అయితే ఆ కథకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు అని అంటున్నాడు. పూర్తి యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఈ వెబ్ సిరీస్ ఉంటుందని లీకులు ఇస్తున్నాడు.


ఇప్పటికే కరోనా సమస్యలు మొదలైనప్పటి నుండి ధియేటర్లు మూత పడటంతో జనం ఓటీటీ లకు అలవాటు పడిపోయారు. దీనికితోడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కోలీవుడ్ లో సూర్య టాలీవుడ్ లో వెంకటేష్ లాంటి హీరోల భారీ సినిమాలు ఓటీటీ బాట పట్టడంతో ఇక భవిష్యత్ లో సినిమాలు అన్నీ ఇళ్ళల్లోని డ్రాయింగ్ రూమ్ లేక్ పరిమితం అయిపోతాయ అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు నాగార్జున కూడ వెబ్ సిరీస్ ల బాట పడితే దీని ప్రభావం టాప్ హీరోల ఆలోచనలను ప్రభావితం చేసి ఇక రానున్న సంవత్సరాలలో టాప్ హీరోలు అంతా బుల్లితెర తోనే సరిపెట్టుకుంటారా అన్న సందేహాలు వస్తున్నాయి..






నీళ్ల పంచాయతీ : కెసిఆర్ తో ఢీ అంటున్న జగన్ ?

చైనాకు చెక్ పెట్టేందుకు ఆ దేశాల సరికొత్త ఐడియా..?

ఆర్ ఆర్ ఆర్ పోరాటాల పై బుర్రా సాయి మాధవ్ లీకులు !

ఇల్లు సీల్... హీరో సీరియస్ రియాక్షన్ !

ఆ హీరో నిర్మాతగా హిందీలో ఆకాశమే హద్దురా రీమేక్..!

పుష్ప తర్వాత అల్లు అర్జున్ అదిరిపోయే ప్లాన్..!

కోవిడ్ హాస్పిటల్ లో ఘోర అగ్నిప్రమాదం.. 50 మంది మృతి?

వైఎస్‌ సమాధిపై అన్న, చెల్లెళ్ల రాజకీయాలు..గమ్ముగున్న విజయమ్మ ?

ఉద్యోగులకు జగన్ మరో షాక్ ఇవ్వబోతున్నారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>