ఇవాళ కేంద్రమంత్రివర్గం భేటీ.. ఏడాది తర్వాత భౌతికంగా సమావేశం...
కేంద్ర మంత్రివర్గం ఇటీవల పునర్ వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల అంతకుముందు వర్చువలే మీటింగ్స్ జరిగేవి.గత ఏడాది నుంచి ఫిజికల్ మీట్ జరగలే.. ఇవాళ ఒకసారి భౌతికంగా మీట్ అవబోతున్నారు.
గతేడాది ఏప్రిల్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ తర్వాత ప్రతీ వారం వీడియో కాన్పరెన్స్ ద్వారా మీట్ జరిగింది. అలాగే సాయంత్రం 4 గంటలకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. ఇటీవల మంత్రివర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి రెండోసారి మీట్ అవబోతున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలోనే.. కౌన్సిల్ ఆప్ మినిస్టర్స్ సమావేశం ఉంటుందని తెలుస్తోంది.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.