MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/are-there-any-hopes-will-you-evaporate-a7c8056d-3b6d-4456-8551-2fa57f8cd3f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/are-there-any-hopes-will-you-evaporate-a7c8056d-3b6d-4456-8551-2fa57f8cd3f2-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. లాక్ డౌన్ తో సినిమా ఇండస్ట్రీ తీవ్ర నష్టాలను చవిచూసింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతుండటంతో ఇకముందైనా మంచిరోజులు వస్తాయని ఆశతో ఎదురు చూస్తోంది. సినిమా రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు కొన్ని అయితే.. షూటింగ్ సెట్ లో మరికొన్ని ఉన్నాయి. మరి వారి ఆశలు తీరతాయో లేదో అనే ఉత్కంఠగా మారింది. bollywood hopes{#}Sanjay Leela Bhansali;Sara Ali Khan;Akshay Kumar;Film Industry;Salman Khan;Alia Bhatt;Arjun;Cinemaఆశలు చిగురిస్తాయా..? ఆవిరైపోతాయా..!ఆశలు చిగురిస్తాయా..? ఆవిరైపోతాయా..!bollywood hopes{#}Sanjay Leela Bhansali;Sara Ali Khan;Akshay Kumar;Film Industry;Salman Khan;Alia Bhatt;Arjun;CinemaTue, 13 Jul 2021 18:06:15 GMTహిందీ చిత్ర పరిశ్రమ బాలీవుడ్‌కి రెండేళ్ల నుంచి అన్నీ సమస్యలే ఎదురవుతున్నాయి. థియేటర్‌ లో విడుదల లేకపోయినా, ఓటీటీలతో సరిపెట్టుకుందామంటే అక్కడా సరైన ఫలితం లావడం లేదు. దీంతో ఈ ఏడాది సెకండాఫ్‌పై చాలా ఆశలు పెట్టుకుంది బాలీవుడ్. భారీ సినిమాలతో బాక్సాఫీస్‌కి మళ్లీ ఎనర్జీ వస్తుందని తెగ ఆశపడుతోంది.


కరోనా ఎఫెక్ట్ తో గతేడాది నుంచి బాలీవుడ్‌ లాక్‌డౌన్‌లోనే ఉంది. తెలుగునాట ఈ ఏడాది ఆరంభంలో 'క్రాక్, ఉప్పెన, జాతి రత్నాలు' లాంటి హిట్స్ వచ్చినా, బాలీవుడ్‌లో మాత్రం థియేటర్లకి జోష్‌ రాలేదు. దీంతో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలు కూడా వాళ్ల సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ 'రాధే' సినిమా, అక్షయ్ కుమార్ 'లక్ష్మీ', అర్జున్ కపూర్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ల 'సర్దార్‌ కా గ్రాండ్‌సన్' సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి.  అయితే ఈ మూవీస్‌ ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేదు. పరిణీతి చోప్రా 'సైనా', సినిమా అయితే ఓటీటీలో కూడా డిజాస్టర్‌ రెస్పాన్స్ తెచ్చుకుంది.

కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పడుతోందని నార్త్‌లో మళ్లీ థియేటర్‌లు తెరుచుకుంటున్నాయి. ఈ నెల 27న అక్షయ్ కుమార్ 'బెల్‌ బాటమ్' సినిమా.. అలాగే ఆగస్ట్‌ 6న 'అతరంగీ రే' సినిమాని విడుదల కాబోతున్నాయి.  ఈ మూవీలో అక్షయ్ కుమార్‌తో పాటు ధనుష్, సారా అలీ ఖాన్ కూడా నటించారు.

స్టార్ హీరోలు బరిలో దిగితే థియేటర్లకి పండగొస్తుంది. భారీ ఓపెనింగ్స్‌, హౌస్‌ఫుల్‌ కలెక్షన్లు వస్తాయని ట్రేడ్‌ పండిట్స్‌ కూడా లెక్కలేస్తుంటారు. అందుకే స్టార్ల సినిమాల కోసం థియేటర్లు ఆతృతగా ఎదురుచూస్తుంటాయి. బాలీవుడ్‌ కూడా ఇలాగే టాప్ హీరోల సినిమా కోసం ఎదురుచూస్తోంది.

ఆలియా భట్‌ ఫుల్‌ మాస్‌ రోల్ ప్లే చేసిన సినిమా 'గంగూభాయ్ కఠియావాడి'. సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌తోనే మంచి బజ్‌ క్రియేట్ చేసుకుంది. దీంతో ఈ సినిమాని మల్టీలింగ్వల్‌గా రిలీజ్ చేయాలనుకున్నారు నిర్మాతలు. కానీ చాలా రాష్ట్రాల్లో థియేటర్లు మూతబడే ఉన్నాయి. దీంతో మల్టీమార్కెట్‌ గురించి ఆలోచించకుండా, బాలీవుడ్‌కి మెయిన్‌ సోర్స్ అయిన నార్త్‌ రీజియన్‌లో ఈ 30న 'గంగూభాయ్'ని విడుదల చేస్తున్నారు.





'సర్కారు వారి పాట' నుండి తప్పుకున్న సీనియర్ యాక్టర్ ..... ??

మహేష్ కోసం రూటు మార్చిన త్రివిక్రమ్..!!

ఎన్ కౌంటర్ చేస్తామని ఆర్ నారాయణమూర్తిని పోలీసులు ఎందుకు బెదిరించారు

అంచనాలు లేకుండా వచ్చి హిట్ అయ్యింది.. సీక్వల్ అలానే ఉంటుందా..?

టైటానిక్ షిప్ మునిగిపోవడానికి..తాళం చెవే కారణమా ?

"పూరి - బన్నీ" వేసిన ప్లాన్ ఇదేనా ?

బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న ఆశలు.. రిలీజ్ కు రెడీగా సినిమాలు..! థియేటర్లలో విడుదల చేసేలా ప్లాన్

ప్రతి రోజు షూటింగ్ కి లేట్ గా వచ్చిన హీరో రాజశేఖర్.. చివరికి ..?

మహేష్ బాబు అప్పటిలా లేడట.. వాపోతున్న త్రివిక్రమ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>