MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/s-s-thaman0f2d905d-6433-457d-a632-c16715406e70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/s-s-thaman0f2d905d-6433-457d-a632-c16715406e70-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న సంగీత దర్శకులలో టాప్ నెంబర్ వన్ సంగీత దర్శకుడు ఎవరు అని అడిగితే ఎస్.ఎస్.తమన్ అని ఇట్టే చెప్పొచ్చు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలా వైకుంఠపురం సినిమా తర్వాత తమన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. స్టార్ హీరోల సినిమాలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. సినిమాల అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే ప్రతి సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ అవ్వడం తో తమన్ కు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయి. s.s.thaman{#}mahathi;sree;trivikram srinivas;Balakrishna;thaman s;mahesh babu;kalyan;Sangeetha;varun tej;mani sharma;Yevaru;Tollywood;Music;Allu Arjun;Chiranjeevi;Cinema;Teluguఇప్పట్లో తమన్ ని బీట్ చేసే వారే లేరా?ఇప్పట్లో తమన్ ని బీట్ చేసే వారే లేరా?s.s.thaman{#}mahathi;sree;trivikram srinivas;Balakrishna;thaman s;mahesh babu;kalyan;Sangeetha;varun tej;mani sharma;Yevaru;Tollywood;Music;Allu Arjun;Chiranjeevi;Cinema;TeluguTue, 13 Jul 2021 12:00:00 GMTతెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న సంగీత దర్శకులలో టాప్ నెంబర్ వన్ సంగీత దర్శకుడు ఎవరు అని అడిగితే ఎస్.ఎస్.తమన్ అని ఇట్టే చెప్పొచ్చు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలా వైకుంఠపురం సినిమా తర్వాత తమన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. స్టార్ హీరోల సినిమాలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. సినిమాల అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే ప్రతి సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ అవ్వడం తో తమన్ కు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయి.

ఆయన సంగీతం అందించిన పాటలు ఎప్పుడూ ఏదో ఒక రికార్డును సృష్టిస్తూనే ఉంటున్నాయి. ప్రస్తుతం ఆయన చేతిలో పెద్ద హీరోల సినిమాలు అన్నీ ఉన్నాయి. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ మలయాళ రీమేక్, మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్,  వరుణ్ తేజ్ గని, బాలకృష్ణ అఖండ వంటి పెద్ద హీరోల సినిమాలు అన్నీ తమన్ చేతిలో ఉన్నాయి అంటే ఆయన ఏ రేంజ్ లో బిజీగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. 

ఆయన సినిమాల వరస చూస్తుంటే ఇప్పుడు వచ్చే సినిమాలు, చేతిలో ఉన్న సినిమాలు కలిపి మరో ఐదేళ్లు ఆయనే టాప్ లో ఉండే లా కనిపిస్తుంది. ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో ఒకటి రెండు స్థానాలు దేవి శ్రీ ప్రసాద్, తమన్ ల మధ్య మారుతూ వచ్చాయి. ఆహ్లాదకరమైన పోటీ ఆరోగ్యవంతమైన స్ఫూర్తితో వీరిద్దరు సినిమాలు చేసుకుంటూ వచ్చి వారి వారి సంగీతం తో ప్రేక్షకులను అలరించగా తమన్ ఒక్క మార్కు కొట్టేయడంతో టాప్ నెంబర్ వన్ గా మారిపోయాడు. మరోవైపు మణిశర్మ కూడా ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తున్నాడు. కుర్ర సంగీత దర్శకులైన మహతి స్వర సాగర్, అనూప్ రూబెన్స్ వంటి వారు కూడా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో వీరు తమన్ రేంజ్ ను అందుకునే సమయానికి చాలా ఏళ్లు పడుతుంది. అప్పటివరకు టాలీవుడ్ సంగీత ప్రపంచాన్ని తమన్ ఏకఛత్రాధిపత్యంగా తమన్ ఏలడం ఖాయం. 
 



ఈ నెల 30న ప్రేక్ష‌కుల‌ ముందుకు `తిమ్మ‌రుసు`..!

ఈ 8 డైరెక్టర్ల లో ఎక్కువగా చదువుకున్నది ఎవరో తెలుసా ?

టాలీవుడ్ స్టార్స్ సిక్స్ ప్యాక్స్ వెనక అసలు నిజాలు

రోటీ చేసి ఇంటర్నెట్ సంచలనం గా మారిన అమ్మాయి.. ఎవరో తెలిసిపోయింది

త్వ‌ర‌లో బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో `అల్లు` చిత్రం !

గజాల భర్త కూడా మనకు బాగా తెలిసిన నటుడే.. ఎవరో చూడండి

హీరో తనీష్ కి బంపర్ ఆఫర్ ?

రవితేజ రామారావు సినిమా డైరెక్టర్ గురించి తెలుసా?

బాలకృష్ణ కోసం శృతిహాసన్ షాకింగ్ నిర్ణయం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>