PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan-kcr3104d0d2-0970-45e6-ab0a-fdd062d72465-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan-kcr3104d0d2-0970-45e6-ab0a-fdd062d72465-415x250-IndiaHerald.jpgఅమరావతి :ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ కు షాక్ ఇచ్చేలా కృష్ణా జలాల విషయంలో తెలంగాణా అక్రమాలపై సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచన లో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. విచారణ సందర్భంగా ప్రస్తావించిన అంశాలపై సాగునీటి శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దేశంలో రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు సర్వసాధారణమcmjagan{#}Krishna River;electricity;KCR;Aqua;Yevaru;Andhra Pradesh;News;Telangana;central governmentనీళ్ల పంచాయతీ : కెసిఆర్ తో ఢీ అంటున్న జగన్ ?నీళ్ల పంచాయతీ : కెసిఆర్ తో ఢీ అంటున్న జగన్ ?cmjagan{#}Krishna River;electricity;KCR;Aqua;Yevaru;Andhra Pradesh;News;Telangana;central governmentTue, 13 Jul 2021 08:35:22 GMTఅమరావతి :ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ కు షాక్ ఇచ్చేలా కృష్ణా జలాల విషయంలో తెలంగాణా అక్రమాలపై సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచన లో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. విచారణ సందర్భంగా ప్రస్తావించిన అంశాలపై సాగునీటి శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దేశంలో రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు సర్వసాధారణమై పోయాయని... అంతర్ రాష్ట్ర నదుల పై ఉన్న రిజర్వాయర్లను జాతీయ ఆస్తుల గుర్తించి, నిర్వహణ మరియు భద్రతలను కేంద్ర బలగాలకు తగ్గించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. రిజర్వాయర్ లతోపాటు వాటిపై ఉన్న విద్యుత్ కేంద్రాల నీటిని కూడా జాతీయ ఆస్తులుగా గుర్తించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరనుoదని ఉందని సమాచారం. వివిధ నదుల్లో నీటివాటాలపై వివిధ ట్రైబ్యునల్స్, కోర్టులు తమ తీర్పుల ద్వారా ఇప్పటికే ఖరారు చేశాయి...  వాటిని కచ్చితంగా అమలు చేయడానికి ఇది అవసరమంటున్నారు అధికారులు.

నిర్దేశించిన వాటాలను మీరి నీటిని అక్రమంగా వాడుకోవడం, ఆ ఒప్పందాలను ఉల్లంఘించేలా కొత్త ప్రాజెక్టులు కట్టడం, లేదా ఉన్న ప్రాజెక్టులను విస్తరించడం తదితర అక్రమ చర్యలను ఆపాలంటే ఒక శాశ్వాత పరిష్కారం అవసరమని కోర్టుకు నివేదించనున్నట్టుగా సాగునీటి అధాకార వర్గాల సమాచారం. నదీజలాల వివాదం ఎవరు పరిష్కరించాలన్న విషయాన్ని రాజ్యాంగంలోనే పొందుపరిచారని, రాజ్యాంగం ప్రకారం కేంద్రమే వీటిని పరిష్కరించాలని చెప్పారు కాబట్టి, అంతర్‌రాష్ట్ర నదీజలాలపై ఉన్న రిజర్వాయర్లు, విద్యుత్‌ కేంద్రాలన్నీకూడా కేంద్రం పరిధిలోనే ఉండాలంటూ పిటిషన్‌ ద్వారా ఏపీ కోరనున్నట్టు సమాచారం. బచావత్‌ అవార్డు ప్రకారం తాగునీరు, సాగునీటి అవసరాలే మొదటి ప్రాధాన్యత అని, విద్యుత్‌ ఉత్పత్తి అన్నది సాగునీటికోసం విడుదలచేసినప్పుడు మాత్రమే ఉత్పత్తిచేయాలి కాని, విద్యుత్‌ ఉత్పత్తికోసం నీటిని విడుదల చేయరాదన్న విషయాన్ని పిటిషన్‌ ద్వారా ప్రస్తావించనున్నట్టు అధికార వర్గాలు నుంచి వార్తలు వస్తున్నాయి.
 
బచావత్‌ అవార్డు వెలువడిన నాటినుంచి కూడా ఈప్రోటోకాల్‌ను దేశంలోని అన్ని రాష్ట్రాలు తప్పకుండా అనుసరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ విధానానికి చట్టబద్ధత కూడా ఉందని తెలియజేస్తున్నారు.  తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవోను వెంటనే సస్పెండ్‌ చేయడమే కాకుండా, కేఆర్‌ఎంబీ విధివిధానాలను ఖరారు చేయాలనికూడా ఈ పిటిషన్‌ ద్వారా కోరనున్నారని సమాచారం అందుతోంది.  రిజర్వాయర్లు, వాటిపై ఉన్న విద్యుత్త ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి ఇస్తూ ఆదేశాలు ఇవ్వాలని, గతంలో నిర్ణయించుకున్న వాటాల ప్రకారం ఆ మేరకు నీళ్లు అందేలా చూడాలని ఈ పిటిషన్‌ ద్వారా ఏపీ ప్రభుత్వం కోరనున్నట్టు విశ్వసనీయ సమాచారం అందుతోంది.



నయన తారను డైలమా లో పడేసిన తండ్రి కోరిక !

కాంగ్రెస్ లో ఇంటిదొంగలు.. బాబోరి రేవంత్ టార్గెట్ ఎవరు..?

తెలంగాణ‌లో 2023లో కేసీఆర్ వ‌ర్సెస్ రేవంత్‌

తెలంగాణ‌లో ఇప్పుడు ఆ కులం చుట్టూనే రాజ‌కీయం ?

యూపీ పోలీసుల‌పై అఖిలేష్ డౌట్ అందుకేనా..?

ఇల్లు సీల్... హీరో సీరియస్ రియాక్షన్ !

ఆ హీరో నిర్మాతగా హిందీలో ఆకాశమే హద్దురా రీమేక్..!

వైఎస్‌ సమాధిపై అన్న, చెల్లెళ్ల రాజకీయాలు..గమ్ముగున్న విజయమ్మ ?

టాప్ హీరోల ఆలోచనలను ప్రభావితం చేస్తున్న నాగార్జున ఆలోచనలు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>