PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babu-bala-krishnabff6a041-8c25-4233-b0e0-e353a72f818b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babu-bala-krishnabff6a041-8c25-4233-b0e0-e353a72f818b-415x250-IndiaHerald.jpgఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌లకు ముందు వ‌ర‌కు ఇక్క‌డ ఎమ్మెల్యే గా ఉన్న అప్ప‌టి మంత్రి గంటా శ్రీనివాస రావు ఎన్నిక‌ల‌కు ముందు విశాఖ నార్త్ కు జంప్ చేసేశారు. అప్పుడు చంద్ర‌బాబు స‌బ్బం హ‌రిని అక్క‌డ‌కు తీసుకు వ‌చ్చి ఎన్నిక‌ల్లో పోటీ చేయించారు. ఎన్నిక‌ల్లో స‌బ్బం ఇప్ప‌టి మంత్రి అవంతి శ్రీనివాస్ పై ఓడిపోయారు. ఇక ఇటీవ‌ల ఆయ‌న మ‌ర‌ణించారు. దీంతో భీమిలి బాధ్య‌త‌ల‌ను చంద్ర‌బాబు మాజీ ఎంపీపీ కోరాడ రాజ‌బాబుకు అప్ప‌గించారు.Chandra Babu Bala Krishna{#}prasad;Bheemili;Vishakapatnam;srinivas;MLA;రాజీనామా;Minister;Telugu Desam Party;Party;CBNచంద్ర‌బాబు వేసిన దెబ్బ‌తో బాల‌య్య ఫ్యాన్ గ‌రంగ‌రం ?చంద్ర‌బాబు వేసిన దెబ్బ‌తో బాల‌య్య ఫ్యాన్ గ‌రంగ‌రం ?Chandra Babu Bala Krishna{#}prasad;Bheemili;Vishakapatnam;srinivas;MLA;రాజీనామా;Minister;Telugu Desam Party;Party;CBNTue, 13 Jul 2021 16:40:00 GMTఏపీలో ప్ర‌తిప‌క్ష తెలుగు దేశం పార్టీలో క‌ల‌హాల కుంప‌ట్లు మామూలుగా లేవు. పార్టీ చ‌రిత్ర‌లోనే లేనంత ఘోరంగా ఓడిపోయింది. నేత‌లు ఎక్క‌డిక‌క్క‌డ ఇళ్ల‌ల్లో నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. మ‌రో వైపు ఏపీలో నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్ లు లేకుండా 25 నియోజ‌క‌వ‌ర్గాలు ఖాళీగా ఉన్నాయి. పార్టీ త‌ర‌పున ఏ చిన్న నాయ‌కుడు ముందుకు వ‌చ్చినా పెద్ద బాధ్య‌త‌లు అప్ప‌గిం చేందుకు చంద్ర‌బాబు నాయుడు  సిద్ధంగా ఉన్నారు. అయితే కొన్ని చోట్ల పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన నేత‌ల‌కు ప్రాధాన్య‌త లేద‌ని వారంతా అద‌ను చూసుకుని ఫైర్ అవుతున్నారు. విశాఖ జిల్లాలోని భీమిలి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి ఎప్పుడూ కంచుకోట‌గా ఉంటూ వ‌స్తోంది.

ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌లకు ముందు వ‌ర‌కు ఇక్క‌డ ఎమ్మెల్యే గా ఉన్న అప్ప‌టి మంత్రి గంటా శ్రీనివాస రావు ఎన్నిక‌ల‌కు ముందు విశాఖ నార్త్ కు జంప్ చేసేశారు. అప్పుడు చంద్ర‌బాబు స‌బ్బం హ‌రిని అక్క‌డ‌కు తీసుకు వ‌చ్చి ఎన్నిక‌ల్లో పోటీ చేయించారు. ఎన్నిక‌ల్లో స‌బ్బం ఇప్ప‌టి మంత్రి అవంతి శ్రీనివాస్ పై ఓడిపోయారు. ఇక ఇటీవ‌ల ఆయ‌న మ‌ర‌ణించారు. దీంతో భీమిలి బాధ్య‌త‌ల‌ను చంద్ర‌బాబు మాజీ ఎంపీపీ కోరాడ రాజ‌బాబుకు అప్ప‌గించారు.

 దీంతో అక్క‌డ సీనియ‌ర్ నేత‌గా ఉండి.. ఇన్ చార్జ్ ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్న పాశర్ల ప్రసాద్ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేస్తామని చెప్పి అందరికీ షాక్ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ఆయ‌న్ను పార్టీ అధిష్టానం బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేస్తోంది. అయినా ఆయ‌న ర‌గిలి పోతున్నారు. ప్ర‌సాద్ బాల‌య్య‌కు వీరాభిమాని.. బాల‌య్య అండ‌దండ‌ల‌తో అయినా త‌న‌కు భీమిలి ఇన్ చార్జ్ ప‌ద‌వి వ‌స్తుంద‌ని అనుకున్నారు. ఆయ‌న రాజ‌కీయాలు చాలా వ‌ర‌కు చంద్ర‌బాబు , బాల‌య్య క‌నుస‌న్న‌ల్లోనే న‌డిచాయి. అయితే ఇప్పుడు బాబు షాక్ ఇవ్వ‌డంతో ఆయ‌న ఏం చేయాలా ? అని త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు.




బాబు స్టార్ట్ చేశారు... ?

బుగ్గన గిల్లి.. గిల్లించుకున్నారే.. !

చంద్రబాబు వైఖరేంటి?

ఏపీ మీద కక్ష గట్టారా?

నాడు బాబు స‌క్సెస్‌.. నేడు జ‌గ‌న్ ప్లాప్‌.. ఒకే ఫార్ములా..!

సిగ్గు ఉండాలి మనకి... సిఎస్ పై బాబు ఫైర్...?

బ్రేకింగ్: ఇష్టమైన అధికారికి జగన్ రిలీవ్...?

యంగ్ టైగర్ కోసం వెయిటింగ్ తప్పదా?

ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన నారప్ప..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>