HealthMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/tuermeric-powder6a8f589f-4309-4d69-ad1a-9b896f9be590-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/tuermeric-powder6a8f589f-4309-4d69-ad1a-9b896f9be590-415x250-IndiaHerald.jpgమనలో చాలా మంది సీజన్ మారినపుడు రకరకాల అలర్జీలకు గురవుతుంటారు. కొన్ని సీజన్లలో ఎల్లప్పుడూ తుమ్ము, దగ్గు మరియు చర్మ దద్దుర్లు అనుభవిస్తే, ఇది కాలానుగుణ అలర్జీ కావచ్చు. కానీ కొంతమందిలో కొన్ని ఆహారాలు తినడం వల్ల, పొగ, మందులు, మరియు దుమ్ము వల్ల అలర్జీలు వస్తుంటాయి. అలర్జీ లక్షణాలు.. దగ్గు, తుమ్ములు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోలేక పోవడం, గొంతు నొప్పి వంటివి ఉంటాయి. అయితే ఇలాంటి అలర్జీలను మన ఇంట్లో ఉండే పసుపుతో చెక్ పెట్టొచ్చు. అది ఎలాగో చూద్దాం. పసుపుని వంటల్లో నే కాక అనాదిగా చాలా వ్యాధులకు మందుగtuermeric powder{#}Turmeric;salt;Aaviri;Cheque;Appleపసుపు తో అలర్జీ లకు చెక్!పసుపు తో అలర్జీ లకు చెక్!tuermeric powder{#}Turmeric;salt;Aaviri;Cheque;AppleMon, 12 Jul 2021 11:12:51 GMTమనలో చాలా మంది సీజన్ మారినపుడు రకరకాల అలర్జీలకు గురవుతుంటారు. కొన్ని సీజన్లలో ఎల్లప్పుడూ తుమ్ము, దగ్గు మరియు చర్మ దద్దుర్లు అనుభవిస్తే, ఇది కాలానుగుణ అలర్జీ కావచ్చు. కానీ కొంతమందిలో కొన్ని ఆహారాలు తినడం వల్ల, పొగ, మందులు, మరియు దుమ్ము వల్ల అలర్జీలు వస్తుంటాయి. అలర్జీ లక్షణాలు.. దగ్గు, తుమ్ములు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోలేక పోవడం, గొంతు నొప్పి వంటివి ఉంటాయి. అయితే ఇలాంటి అలర్జీలను మన ఇంట్లో ఉండే పసుపుతో చెక్ పెట్టొచ్చు. అది ఎలాగో చూద్దాం.

పసుపుని వంటల్లో నే కాక అనాదిగా చాలా వ్యాధులకు మందుగా కూడా వాడుతున్నారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం వల్ల అలర్జీలను ఎదుర్కోవడానికి సహాయ పడుతుంది. పసుపుని పై పూత గా వాడటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

1. ఒక గ్లాస్ పాలలో అర స్పూన్  పసుపు, కొంచెం మిరియాలపొడి కలిపి వేడిచేసి ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు తాగుతూ ఉంటే మామూలు జలుబు, దగ్గు, తుమ్ములు వంటివి నివారించాబడతాయి.

 
2. నీటిలో పసుపు, టీ ఆకు, సెనగపిండి, మినపిండి వేసి బాగా కలిపి మరిగించాలి. ఆ నీరు మరుగినప్పుడు వచ్చే ఆవిరి ని బాగా పీల్చితే ఆయాసము, జలుబు, తలనొప్పి తగ్గిపోతాయి.


౩.పసుపును మెత్తగా నూరి తామర, గజ్జి లాంటి చర్మవ్యాదులకు పై పూతగా ఉపయోగించవచ్చు.

 
4. అర స్పూన్ పసుపు, మూడు స్పూన్ల తేనె కలిపి రోజుకి రెండు, మూడు సార్లుగా మూడు నెలల పాటు తీసుకుంటే ఈసినోఫీలియా వలన వచ్చు దగ్గు, చెడు లక్షణాలు నివారించబడతాయి.


5. పరిశుభ్రమైన వస్త్రాన్ని పసుపు కలిపిన నీటిలో ముంచి తడిపి ఆరబెట్టాలి. ఆ వస్త్రం తో కళ్ళు తుడుచుకుంటూ ఉంటే సాధారణ కంటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

 
6. మెత్తటి పసుపులో  మెత్తటి ఉప్పు కలిపి  టూత్ పౌడర్ గా వాడితే నోటిలో ఉండే దుర్వాసన, దంతాల పుచ్చు, నొప్పి, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వంటివి నివారించాబడతాయి.


7. పసుపు లో నిమ్మరసం, తేనె, ఆపిల్ సైడర్ వెనిగర్ లను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజు ఉదయం ఖాళీ  కడుపుతో ఒక స్పూన్ తీసుకుంటే మంచిది.



ఈ పురాతన శివాలయంలో అంతు చిక్కని రహస్యాలెన్నో.?

సైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్..

రేవంత్ వర్సెస్ బండి: కేసీఆర్‌కు మళ్ళీ ఫిక్స్ అయినట్లేనా?

ఏపీలో 1.50 కోట్ల రూపాయల గంజాయి సీజ్?

వాలిమై కాపీ కంటెంట్... ఇలా దొరికేశారేంటి !?

సీరియల్ నటికి రేప్ థ్రెట్స్

సీఎం జ‌గ‌న్‌కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ‌

కృష్ణపట్నం ఆనందయ్య ఎమ్మెల్సీ అవుతారా ?

ఢిల్లీ సర్కార్ మరో కఠిన నిర్ణయం... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>