PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan5b56c97c-724f-4c8d-b58d-884d249667a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan5b56c97c-724f-4c8d-b58d-884d249667a6-415x250-IndiaHerald.jpgమంత్రి పదవి....ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి ఒక్కరికీ ఉండే నెక్స్ట్ టార్గెట్. ఎలాగైనా మంత్రి పదవిని దక్కించుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. అలాగే మంత్రి పదవులు దక్కిన వారు సైతం, ఆ హోదాని నిలబెట్టుకోవాలని చూస్తారు. ఇప్పుడు ఇదే పరిస్తితి ఏపీలోని అధికార వైసీపీలో ఉంది. ఎందుకంటే మరో కొన్ని నెలల్లో సీఎం జగన్ తన కేబినెట్‌లో మార్పులు చేయనున్నారు. కొందరు మంత్రులని పక్కకు తప్పించి, కొత్తవారికి ఛాన్స్ ఇవ్వనున్నారు. jagan{#}East;West Godavari;Kurasala Kannababu;Alla Ramakrishna Reddy;Nani;Godavari River;Minister;రాజీనామా;Jagan;CM;Coronavirusగోదావరి మంత్రులకు జగన్ షాక్ ఇచ్చేస్తారా?గోదావరి మంత్రులకు జగన్ షాక్ ఇచ్చేస్తారా?jagan{#}East;West Godavari;Kurasala Kannababu;Alla Ramakrishna Reddy;Nani;Godavari River;Minister;రాజీనామా;Jagan;CM;CoronavirusMon, 12 Jul 2021 03:00:00 GMTమంత్రి పదవి....ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి ఒక్కరికీ ఉండే నెక్స్ట్ టార్గెట్. ఎలాగైనా మంత్రి పదవిని దక్కించుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. అలాగే మంత్రి పదవులు దక్కిన వారు సైతం, ఆ హోదాని నిలబెట్టుకోవాలని చూస్తారు. ఇప్పుడు ఇదే పరిస్తితి ఏపీలోని అధికార వైసీపీలో ఉంది. ఎందుకంటే మరో కొన్ని నెలల్లో సీఎం జగన్ తన కేబినెట్‌లో మార్పులు చేయనున్నారు. కొందరు మంత్రులని పక్కకు తప్పించి, కొత్తవారికి ఛాన్స్ ఇవ్వనున్నారు.

దీంతో మంత్రి పదవి దక్కించుకోవాలని ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తుంటే, ఉన్న పదవిని కాపాడుకోవాలని మంత్రులు ట్రై చేస్తున్నారు. కానీ జగన్..పలువురు మంత్రులకు షాక్ ఇవ్వడం గ్యారెంటీ అని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే గోదావరి జిల్లాల్లో ఉన్న ఆరుగురు మంత్రుల్లో ఎవరికి షాక్ తగులుతుందనే అంశం గోదావరి రాజకీయాలని హీటెక్కిస్తుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సంగతి తెలిసిందే. ఆళ్ళ నాని, తానేటి వనిత, చెరుకువాడ రంగనాథరాజులు జగన్ కేబినెట్‌లో ఉన్నారు. ఇక ఈ రెండేళ్లలో ఈ ముగ్గురు మంత్రులు అద్భుతమైన పనితీరు కనబర్చిన సందర్భాలు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే కరోనా వల్ల మంత్రులకు పెద్దగా అవకాశం దక్కలేదు. కానీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఆళ్ళ నానికి ఎక్కువ పని పడింది. మరి ఆ పని ఆళ్ళ నాని విజయవంతంగా పూర్తి చేశారో లేదో జగన్‌కే తెలియాలని అంటున్నారు. జగన్‌తో సన్నిహితంగా ఉంటారు కాబట్టి నాని పదవికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చని అంటున్నారు. కానీ వనిత, చెరుకువాడల పదవుల విషయంలో కాస్త డౌట్ ఉందని చెబుతున్నారు.

అటు తూర్పు గోదావరిలో సైతం ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఇందులో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కన్నబాబు పనితీరు పట్ల జగన్ సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. అంటే కన్నబాబు ఐదేళ్లు మంత్రిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు గతేడాది పిల్లి సుభాష్ రాజీనామా చేయడంతో, ఆయన స్థానంలో కేబినెట్‌లోకి వచ్చిన చెల్లుబోయిన వేణుగోపాల్ పదవి కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని, కానీ పినిపే విశ్వరూప్ విషయంలో మాత్రం చెప్పలేమని అంటున్నారు. మరి చూడాలి గోదావరి మంత్రుల్లో జగన్ ఎవరికి షాక్ ఇస్తారో?



బొత్స ప్రత్యర్ధి లైన్‌లోనే ఉన్నారు...కానీ వర్కౌట్ కావడం లేదా?

రేవంత్ వర్సెస్ బండి: కేసీఆర్‌కు మళ్ళీ ఫిక్స్ అయినట్లేనా?

జగన్‌ జైలుకు.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కల తీరేనా..?

మంత్రి పదవి....ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి ఒక్కరికీ ఉండే నెక్స్ట్ టార్గెట్. ఎలాగైనా మంత్రి పదవిని దక్కించుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. అలాగే మంత్రి పదవులు దక్కిన వారు సైతం, ఆ హోదాని నిలబెట్టుకోవాలని చూస్తారు. ఇప్పుడు ఇదే పరిస్తితి ఏపీలోని అధికార వైసీపీలో ఉంది. ఎందుకంటే మరో కొన్ని నెలల్లో సీఎం జగన్ తన కేబినెట్‌లో మార్పులు చేయనున్నారు. కొందరు మంత్రులని పక్కకు తప్పించి, కొత్తవారికి ఛాన్స్ ఇవ్వనున్నారు.

విజయం మీదే: మీ పిల్లలు స్కూల్ కి వెళుతున్నారా... తీసుకోవాల్సిన జాగ్రత్తలివే ?

జగన్ బలమంతా అక్కడే ఉంది. జగన్ రాజకీయ జీవితాన్నే నిర్ణయించిన ప్రాంతమంది. వైఎస్ ఫ్యామిలీ అంటే వారికి ప్రాణం. అందుకే జగన్ బలమైన నేతగా ఏపీలో నిలబడ్డారు. అటువంటి జగన్ బలాన్ని తగ్గించడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయా అంటే అవును అనే జవాబు వస్తోంది.

జగన్ బలమంతా అక్కడే ఉంది. జగన్ రాజకీయ జీవితాన్నే నిర్ణయించిన ప్రాంతమంది. వైఎస్ ఫ్యామిలీ అంటే వారికి ప్రాణం. అందుకే జగన్ బలమైన నేతగా ఏపీలో నిలబడ్డారు. అటువంటి జగన్ బలాన్ని తగ్గించడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయా అంటే అవును అనే జవాబు వస్తోంది.

జగన్ని ఓడించాలంటే అక్కడ నుంచే... ?

వ్యాక్సినేషన్ వేయించుకున్నారా? ఇది మీకే !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>