PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/look-at-the-two-children-otherwise-they-cut6787e875-0af4-4ab1-a2b2-8bba02beadc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/look-at-the-two-children-otherwise-they-cut6787e875-0af4-4ab1-a2b2-8bba02beadc7-415x250-IndiaHerald.jpgయూపి ప్ర‌భుత్వం `జ‌నాభా నియంత్ర‌ణ‌ బిల్లు 2021` తీసుకురానున్న సంగ‌తి తెలిసిందే అయితే ఈ బిల్లును ప్ర‌తిప‌క్షాలు వ్య‌తిరేకిస్తున్నాయి. దీనికి కార‌ణం రాబోయే ఎన్నిక‌ల్లో లాభం పోందాల‌ని బీజేపీ చూస్తోంద‌ని కాంగ్రెస్ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. ఇది కేవ‌లం ఆర్ఎస్ఎస్ ప్రేరేపించ‌డంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని, జ‌నాభా నియంత్ర‌ణ కేంద్రంలో చేతిలో ఉంటుంద‌ని రాష్ట్రానికి జ‌నాభా బిల్లును పెట్టే అధికారం లేద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఈ నిర్ణ‌యాన్ని వెంట‌నే వెన‌క్కు తీసుకోవాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు డిమాbjp{#}santhanam;yogi;Bharatiya Janata Party;Congress;Party;local languageజ‌నాభా బిల్లుపై ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు అందుకేనా..?జ‌నాభా బిల్లుపై ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు అందుకేనా..?bjp{#}santhanam;yogi;Bharatiya Janata Party;Congress;Party;local languageMon, 12 Jul 2021 13:01:20 GMT యూపి ప్ర‌భుత్వం `జ‌నాభా నియంత్ర‌ణ‌ బిల్లు 2021` తీసుకురానున్న సంగ‌తి తెలిసిందే అయితే ఈ బిల్లును ప్ర‌తిప‌క్షాలు వ్య‌తిరేకిస్తున్నాయి. దీనికి కార‌ణం రాబోయే ఎన్నిక‌ల్లో లాభం పోందాల‌ని బీజేపీ చూస్తోంద‌ని కాంగ్రెస్ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. ఇది కేవ‌లం ఆర్ఎస్ఎస్ ప్రేరేపించ‌డంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని, జ‌నాభా నియంత్ర‌ణ కేంద్రంలో చేతిలో ఉంటుంద‌ని రాష్ట్రానికి జ‌నాభా బిల్లును పెట్టే అధికారం లేద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఈ నిర్ణ‌యాన్ని వెంట‌నే వెన‌క్కు తీసుకోవాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. జ‌నాభా బిల్లు ద్వారా రాష్ట్రంలో ఇద్ద‌రి కంటే ఎక్కువ సంతానం ఉన్న‌వారు స్థానిక ఎన్నిక‌ల్లో పోటి చేయ‌డానికి అన‌ర్హులు. అలాగే ప్ర‌భుత్వ ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తు చేసుకోలేరు. ప్ర‌స్తుతం ఉన్న ఉద్యోగుల‌కు భ‌విష్య‌త్తులో ఎలాంటి ప‌దోన్న‌తులు ల‌భించ‌వు.
 
దేశంలో, స‌మాజంలో అస‌మాన‌త‌లు ఏర్ప‌డ‌డం, ప్రభుత్వ ప‌థ‌కాలు అంద‌రికీ అమ‌లు కాక‌పోవ‌డానికి కార‌ణం జ‌నాభా పెర‌గ‌డ‌మేన‌ని యూపి ముఖ్య‌మంత్రి ఉద్ఘాటించారు. జ‌నాభాను నియంత్రించ‌డానికి రూపొందించిన నూత‌న విధానాన్ని ఆయ‌న వెల్ల‌డించారు. 2026 నాటికి రాష్ట్ర జ‌నాభా పెరుగుద‌ల‌ను నియంత్రిస్తామ‌ని పేర్కొన్నారు. జ‌నాభా విప‌రీతంగా పెర‌గ‌డం ద్వారా రాష్ట్రంతో పాటు దేశ అభివృద్ధికి అడ్డం అవుతుంద‌ని తెలిపారు. జ‌నాభా నియంత్రిణ కోసం 2018 నుంచే త‌మ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింద‌ని వివ‌రించారు.

యోగి ప్ర‌భుత్వం తీసుకొస్తున్న జ‌నాభా నియంత్ర‌ణ బిల్లుపై స‌మాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అశుతోష్ మాట్లాడుతూ.. ఈ బిల్లును అమ‌లు చేయ‌డ‌మంటే ప్ర‌జాస్వామ్యాన్ని కూని చేయ‌డ‌మేన‌ని నిప్పులు చెరిగారు. ఈ బిల్లు ద్వారా హిందువుల ఓట్లు పొంద‌డం కోసమేన‌ని అలాగే ప్ర‌తిప‌క్షాలు దీనిని వ్య‌తిరేకిస్తే ప్ర‌జ‌ల దృష్టిలో వారి అభివృద్ధి ఆటంకులుగా చిత్రిక‌రించ‌డానికి యోగి ప్ర‌భుత్వం చూస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఏది ఏమైనా రాబోయే యూపి ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని యోగి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని, అలాగే ముస్లీముల‌కు అచారాల‌కు ఇది వ్య‌తిరేక‌మ‌ని, ఆ వ‌ర్గానికి ప్ర‌తికూలంగా ఈ బిల్లు తీసుకొస్తున్నార‌నే ప్ర‌చారమూ జ‌రుగుతోంది.
 





అఖిల‌ప్రియ‌ను టీడీపీ నుంచి గెంటేస్తోందెవ‌రు ?

జ‌గ‌న్ ఇలాకాలో ఇద్ద‌రు వైసీపీ నేత‌ల ఫైట్... ఎమ్మెల్యే వ్శ్ ఎమ్మెల్సీ..!

పొలిటిక‌ల్ ఎంట్రీ పై మ‌రోసారి ర‌జినీ క్లారిటీ.. !

బెజ‌వాడ మేయ‌ర్‌కు బ్యాడ్ సెంటిమెంట్‌..!

నాలుకే ఆయుధం: కేసీఆర్‌ మంత్రం జపిస్తున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ?

రేవంత్ వైఎస్సార్ మంత్రం వెన‌క ఇంత ప్లాన్ ఉందా...?

బాబోరి రేవంత్ ఛీఫ్ అయ్యాడు, మరేంటి..?

ప్రధాన నాయకత్వం ఒప్పుకోని ఛీఫ్ : బాబోరి రేవంత్..?

బ్రేకింగ్: ఫస్ట్ వికెట్ తీసిన బాబోరి రేవంత్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>