CrimeMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/politics_latestnews/dead-0f70c638-370c-4df6-b7df-8a612454a1c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/politics_latestnews/dead-0f70c638-370c-4df6-b7df-8a612454a1c9-415x250-IndiaHerald.jpgవ‌ర్షాకాలం వ‌చ్చిందంటే వ‌ర్షాలు ప‌డ‌తాయ‌న్న ఆనందంతో పాటు ప్ర‌కృతి విప‌త్తులు ఉంటాయ‌న్న ఆందోళ‌న కూడా ఉంటుంది. ముఖ్యంగా వ‌ర్షాకాలంలో వ‌ర‌దలు, పిడుగులు ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తాయి. వ‌ర్షాకాలంలో పొలం ప‌నుల‌కు వెళ్లిన‌వాళ్లు ఇత‌ర ప‌నుల కోసం భ‌య‌ట‌కు వెళ్లిన వాళ్లు పిడుగు పాటుకు గురౌతుంటారు. ముఖ్యంగా పిడుగులు ప‌డే స‌మ‌యంలో పెద్ద పెద్ద చెట్ల క్రింద ఉండ‌టం ప్ర‌మాదం అని చెబుతుంటారు. కాగా తాజాగా ఆదివారం ఒక్క‌రోజే పిడుగు పాటుకు ఏకంగా 68 మంది మృతి చెందారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జ‌రిగcrime{#}Rajasthan;Ashok Gehlot;sunday;CMపిడుగుల వ‌ర్షానికి 68మంది మృతి... !పిడుగుల వ‌ర్షానికి 68మంది మృతి... !crime{#}Rajasthan;Ashok Gehlot;sunday;CMMon, 12 Jul 2021 13:59:00 GMTవ‌ర్షాకాలం వ‌చ్చిందంటే వ‌ర్షాలు ప‌డ‌తాయ‌న్న ఆనందంతో పాటు ప్ర‌కృతి విప‌త్తులు ఉంటాయ‌న్న ఆందోళ‌న కూడా ఉంటుంది. ముఖ్యంగా వ‌ర్షాకాలంలో వ‌ర‌దలు, పిడుగులు ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తాయి. వ‌ర్షాకాలంలో పొలం ప‌నుల‌కు వెళ్లిన‌వాళ్లు ఇత‌ర ప‌నుల కోసం భ‌య‌ట‌కు వెళ్లిన వాళ్లు పిడుగు పాటుకు గురౌతుంటారు. ముఖ్యంగా పిడుగులు ప‌డే స‌మ‌యంలో పెద్ద పెద్ద చెట్ల క్రింద ఉండ‌టం ప్ర‌మాదం అని చెబుతుంటారు. కాగా తాజాగా ఆదివారం ఒక్క‌రోజే పిడుగు పాటుకు ఏకంగా 68 మంది మృతి చెందారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జ‌రిగిన వేరు వేరు పిడుగులు ప‌డిన సంఘ‌ట‌న‌ల్లో వీరు మృతి చెందారు. కాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అధికంగా పిడుగు దాడికి 41 మంది మృతి చెందారు. 

అంతే కాకుండా రాజ‌స్థాన్ రాష్ట్రంలో 11 మంది పిడుగుల దాడికి మ‌ర‌ణించారు. మ‌రో ప‌ది మంది పిడుగుల పాటుకు గాయ‌ప‌డి ప్ర‌స్తుతం ఆస్ప‌త్ర‌ల్లో చికిత్స పొందుతున్నారు. గాయ‌ప‌డిన వారిలో పిల్ల‌లు కూడా ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మొత్తం ఏడుగురు పిల్ల‌లు గాయ‌ప‌డిన‌ట్టు సమాచారం. ఇదిలా ఉండ‌గా పిడుగుల కారణంగా మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియాను ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ ప్ర‌క‌టించారు. నాలుగు ల‌క్ష‌లు ఎమ‌ర్జెన్సీ ఫండ్ కింద అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంతే కాకుండా మ‌రో ల‌క్ష సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇస్తున్న‌ట్టు తెలిపారు.

ఆదివారం జైపూర్ ప్రాంతంలోనే పిడుగు పాటుకు 48 నిమిషాల వ్య‌వ‌ధిలో 11 మంది మృతి చెందిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. మధ్య‌ప్ర‌దేశ్ పిడుగుల కార‌ణంగా 7గురు మ‌ర‌ణించారు. ఇక ఈ విషాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాన‌మంత్రి మోడీ కూడా స్పందించారు. మృతుల కుంటుంబాల‌కు ప్ర‌గాడ సానుభూతి ప్ర‌క‌టిస్తున్నామ‌ని చెప్పారు. అంతే కాకుండా మృతుల కుటుంబాల‌కు పీఎం రిలీఫ్ పండ్ నుండి రూ.2 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. మ‌రోవైపు పిడుగుల కార‌ణంగా గాయ‌ప‌డిన వారికి రూ.50 వేల ఎక్స్ గ్రాషియా ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.



భ‌ట్టికి రేణుకా చౌద‌రికి మ‌ధ్య విభేదాలెందుకు..?

సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాష్ట్రంలో 144 సెక్ష‌న్.. !

జ‌గ‌న్ ఇలాకాలో ఇద్ద‌రు వైసీపీ నేత‌ల ఫైట్... ఎమ్మెల్యే వ్శ్ ఎమ్మెల్సీ..!

పొలిటిక‌ల్ ఎంట్రీ పై మ‌రోసారి ర‌జినీ క్లారిటీ.. !

అదిరిపోయిన ర‌వితేజ `రామారావు ఆన్ డ్యూటీ` ఫ‌స్ట్ లుక్ !

పెద్దపల్లి: పిల్లలతో కలిసి తల్లి దారుణం..!?

ఆకట్టుకుంటున్న ‘బలమెవ్వడు’ మూవీ టీజర్..!!

ఫస్ట్ డోస్ 10%, సెకండ్ డోస్ 20%.. హోటల్లో అదిరిపోయే డిస్కౌంట్?

క‌రీనా `ప్రెగ్నెన్సీ బైబిల్‌`లో ఏం ఉండ‌నుంది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>